»   » రవితేజ ‘బలుపు’రిలీజ్ డేట్ ఖరారు

రవితేజ ‘బలుపు’రిలీజ్ డేట్ ఖరారు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రవితేజ ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో 'బలుపు' చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. 'గబ్బర్‌సింగ్' విజయం తర్వాత బిజీ హీరోయిన్‌గా మారిపోయిన శృతిహాసన్ రవితేజతో 'బలుపు' చిత్రంలో జోడీగా కనిపించబోతుంది. జూన్ 1న పాటలు, జూన్ 21న చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అంజలి మరో హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని పరమ్.వి.పొట్లూరి నిర్మిస్తున్నారు.

ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ 'రవితేజ శారీరక భాషకు తగ్గ కథతో, పర్‌ఫెక్ట్ టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ చిత్రానికి తమన్ మంచి సంగీతాన్ని అందించాడు. పూర్తి వినోదాత్మకంగా రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రంలో అన్ని వాణిజ్య అంశాలున్నాయి. శృతిహాసన్ గ్లామర్, అంజలి అభినయం చిత్రానికి ప్రధాన ఆకర్షణ. లక్ష్మీరాయ్ ప్రత్యేకగీతం యూత్‌కు కిక్‌నిస్తుంది. తప్పకుండా ఈ చిత్రం రవితేజ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలుస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. జూన్ 1న పాటలు, జూన్ 21న చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం' అన్నారు.

ఈ చిత్రంలో రవితేజ సరసన శృతి హాసన్, అంజలి హీరోయిన్లుగా చేస్తున్నారు. వైజాగ్ బ్యాక్ డ్రాప్‍‌తో సాగే ఈ చిత్రంలో చాలా కాలం తర్వాత రవితేజ పూర్తి మాస్ రోల్ చేస్తున్నారు. పివిపి సినిమా బేనర్ పై గతంలో రవితేజతో వీడింతే చిత్రం రూపొందించిన ప్రసాద్ వి.పొట్లూరి ఈ చిత్రానికి నిర్మాత. ఇంతకు ముందు రవితేజతో గోపీచంద్ మలినేని 'డాన్‌శీను' చిత్రాన్ని రూపొందించిన సంగతి తెలిసిందే. ఈచిత్రానికి ప్రముఖ రచయిత కోన వెంకట్ స్క్రిప్టు రచయితగా పని చేస్తున్నారు.

ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, బ్రహ్మాజీ, రావు రమేష్, అలీ, అశుతోష్ రాణా, అడవి శేషు, సుప్రీత్, ఆదిత్య మీనన్, రఘుబాబు, జయప్రకాష్ రెడ్డి, శేఖర్, అజయ్, షఫీ, శ్రీనివాస్ రెడ్డి, సన, రాజశ్రీ నాయర్ తదితరులు ఈ చిత్రంలో నటిస్తున్నారు. ఈచిత్రానికి కథ, మాటలు: కోన వెంకట్, కె. ఎస్. రవీంద్ర, పాటలు: సిరివెన్నెల సీతారామ శాస్త్రి, భాస్కర భట్ల, ఫైట్స్: స్టన్ శివ, కొరియోగ్రఫీ: రాజు సుందరం, బృందం, ఆర్ట్: ఎ.ఎస్.ప్రకాష్, ఎడిటింగ్: గౌతం రాజు, సినిమాటోగ్రఫీ: జైనన్ విన్సెంట్, సంగీతం: థమన్, నిర్మాత: పరమ్ వి. పొట్లూరి.

English summary
Balupu movie audio is going to release on 1st June and the movie will be releasing on 21st june. The official announcement came from the producers. Malineni Gopichand directing this film. Thaman scoring the music. A song sung by Raviteja completely in this movie as per the sources.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu