»   » 'బెంగాల్‌ టైగర్‌' సరికొత్త పోస్టర్‌ విడుదల

'బెంగాల్‌ టైగర్‌' సరికొత్త పోస్టర్‌ విడుదల

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌ పతాకంపై రవితేజ, తమన్నా, రాశీఖన్నా ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం 'బెంగాల్‌ టైగర్‌'. అధికారిక ఫేస్‌బుక్‌ ఖాతా ద్వారా ఈ చిత్రం సరికొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. టీజర్‌ను ఈ బుధవారం ఉదయం 10.30 గంటలకు విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు. అదేవిధంగా ఆడియోను ఈనెల 18న విడుదల చేయనున్నట్లు తెలిపారు. సంపత్‌ నంది దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి కె.కె. రాధామోహన్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


సంపత్ నంది మాట్లాడితే... పులి పంజా విసిరిందంటే ఇక తిరుగులేనట్టే. అదే పులి ఓ పథకం ప్రకారం పంజా విసిరితే? పౌరుషమున్న ఒక పులి అదే చేసింది. మరి అక్కడ ఏం జరిగిందో తెలియాలంటే మా చిత్రం చూడాల్సిందే అంటున్నారు సంపత్‌ నంది.


Ravi Teja's Bengal Tiger new poster released

దర్శకుడు కంటిన్యూ చేస్తూ.. ''పేరుకు తగ్గట్టుగా బలమైన కథతో రూపొందుతున్న చిత్రమిది. యాక్షన్‌, భావోద్వేగాలు, వినోదం మేళవించి చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. రవితేజ హుషారైన నటన చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. బెంగాల్‌ టైగర్‌ అంత పవర్‌ రవితేజ పాత్రలో కనిపిస్తుంది'' అన్నారు.


''చిత్రీకరణ తుదిదశకు చేరుకొంది. రవితేజ శైలి మాస్‌ అంశాలతో దర్శకుడు సంపత్‌ నంది చిత్రాన్ని తీర్చిదిద్దుతున్న విధానం చాలా బాగుంది. మా సంస్థలో నిలిచిపోయే ఓ మంచి చిత్రమవుతుంది'' అన్నారు నిర్మాత. రచ్చతో దర్శకుడుగా తన సత్తా ఏంటో చూపించిన దర్శకుడు సంపత్ నంది.. దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'బెంగాల్‌ టైగర్‌'. రవితేజ హీరోగా నటిస్తున్నారు. తమన్నా, రాశీ ఖన్నా హీరోయిన్స్. కె.కె.రాధామోహన్‌ నిర్మాత.

English summary
Bengal Tiger is action entertainer movie directed by Sampath Nandi. In which, Ravi Teja and Tamannah are playing the main lead roles along with Bpllywood actor Boman Irani will be seen in negative roles. KK Radha Mohan is producing this movie under his home production banner while Thaman S composed music for this movie.
Please Wait while comments are loading...