For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  క్లినికల్ ట్రైల్ మోసాలపై... ('బెంగాల్ టైగర్' ప్రివ్యూ)

  By Srikanya
  |

  హైదరాబాద్ : విడుదల తేదీలు మార్చుకుంటూ ఎట్టకేలకు విడుదల అవుతున్న ఈ సినిమా ...అటు రవితేజ కెరీర్ కు, ఇటు దర్శకుడు సంపత్ నంది కెరీర్ కు అత్యవసరమైన టైంలో వస్తోంది. దాంతో ఇద్దరూ చాలా ఆసక్తిగా ఈ చిత్రం రిజల్ట్ వైపు చూస్తూ తమ నెక్ట్స్ స్టెప్ ఏంటనేది తేల్చుకునే దశలో ఉన్నారు. ముఖ్యంగా భారీ అంచనాల మధ్య విడుదలైన 'కిక్ 2' డిజాస్టర్ టాక్ తెచ్చుకోవటంతో ఈ సినిమా ఓపినింగ్స్ దగ్గర నుంచి కీలకమయ్యాయి. అటు సంపత్ నంది సైతం పవన్ కళ్యాణ్ నుంచి బయిటకు వచ్చిన చేస్తున్న చిత్రం కావటంతో ఇది కెరీర్ నే డిసైడ్ చేసే చిత్రం కానుంది.

  అచ్చమైన తెలుగు పల్లెటూరికి చెందిన ఓ యువకుడి కథ ఇది. కంప్యూటర్స్‌లో మాస్టర్స్ పూర్తిచేసిన అతనికి స్పష్టమైన లక్ష్యాలేవి వుండవు. ఓ రోమియోలా జీవితాన్ని సాగిస్తుంటాడు. అనుకోకుండా అతనికి ఓ అవమానం ఎదురవుతుంది. అందుకు ప్రతీకారం తీర్చుకోవడానికి అతను కొత్త ప్రయాణాన్ని మొదలుపెడతాడు. ఈ క్రమంలో అతను ఎవరిపై పోరాడాడు? లక్ష్యసాధనకు అతను అనుసరించిన వ్యూహాలేమిటి? అనే అంశాల సమాహారమే చిత్ర ఇతివృత్తం.

  ఈ చిత్రం గురించి దర్శకుడు మాట్లాడుతూ...రవితేజ పాత్రను కొత్తగా డిజైన్ చేశాను. ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌ను కొత్త తరహాలో చూపించాను. ఔషదాల తయారీకి ముందు క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తారు. వాటిలో జరిగే మోసాల గురించి ఓ పేపర్‌లో చదివాను. ఆ సంఘటనకు వాణిజ్య అంశాల్ని మేళవించిన ఈ సబ్జెక్ట్‌ను తయారుచేసుకున్నాను అన్నారు.

  Ravi Teja's 'Bengal Tiger' preview

  రవితేజ మాట్లాడుతూ... బెంగాల్‌ టైగర్‌' చాలా సరదాగా ఉంటాడు. మంచి కమర్షియల్‌ సినిమా. రండి.. చూడండి.. నవ్వుకొంటూ వెళ్లండి. అంతే అన్నారు.

  బ్యాన‌ర్‌ : శ్రీ స‌త్యసాయి ఆర్ట్స్‌,
  నటీనటులు:ర‌వితేజ‌, త‌మ‌న్నా, రాశిఖ‌న్నా, బోమ‌న్ ఇరాని, బ్ర‌హ్మ‌నందం, రావు ర‌మేష్‌, షియాజి షిండే, నాజ‌ర్‌, పోసాని కృష్ణ‌ముర‌ళి, త‌నికెళ్ళ భ‌ర‌ణి, హర్ష వ‌ర్ధ‌న్ రానే, పృద్వి, సురేఖ వాణి, అక్ష‌, శ్యామ‌ల‌, ప్రియ‌, ప్ర‌భు, ప్ర‌గ‌తి, నాగినీడు, ప్ర‌భ‌, ర‌మాప్ర‌భ తదిత‌రులు
  కెమెరా: సౌంద‌ర్ రాజ‌న్‌,
  ఎడిట‌ర్‌: గౌత‌ం రాజు,
  ఆర్ట్‌: డి,వై.స‌త్య‌నారాయ‌ణ‌,
  ఫైట్స్‌: రామ్‌-ల‌క్ష్మ‌ణ్‌,
  సంగీతం భీమ్స్‌,
  నిర్మాత‌: కె.కె.రాధామెహ‌న్‌,
  క‌థ‌-మాట‌లు-స్ర్కీన్‌ప్లే-ద‌ర్శకత్వం: సంప‌త్ నంది.
  విడుదల తేదీ : 10-12-2015.

  English summary
  Director Sampath Nandi's much-awaited Telugu movie "Bengal Tiger" starring Ravi Teja in the lead roles is gearing up for a massive release in theatres around the world this Friday.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X