»   »  రవితేజ ‘బెంగాల్ టైగర్’ ట్రైలర్ అదరగొడుతోంది

రవితేజ ‘బెంగాల్ టైగర్’ ట్రైలర్ అదరగొడుతోంది

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మాస్ మహరాజ రవితేజ ఎన‌ర్జిటిక్ గా చేస్తున్న చిత్రం బెంగాల్‌టైగ‌ర్‌. సంపత్ నంది ద‌ర్శ‌కుడు. అందాల ముద్దుగుమ్మలు తమన్నా, రాశి ఖన్నా హీరోయిన్స్. ఈ చిత్రాన్ని ఏమైంది ఈవేళ, అధినేత, ప్యార్ మే పడిపోయానే వంటి ప్రేక్షకాదరణ పొందిన చిత్రాల్ని అందించిన అభిరుచివున్న నిర్మాణ‌సంస్థ శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్లో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. కె కె రాధామోహన్ నిర్మాత‌.

Ravi Teja’s Bengal Tiger trailer gets superb response

ఈ నెల 18న సాయంత్రం ‘బెంగాల్ టైగర్' ఆడియో రిలీజైంది. అదే సమయంలో ట్రైలర్ కూడా విడుదల చేసారు. ట్రైలర్ కు అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. రెండు రోజులు కూడా గడవక ముందే యూట్యూబులో 2 లక్షలకు పైగా హిట్స్ వచ్చాయి. దీన్ని బట్టి సినిమాపై జనాల్లో అంచనాలు ఏ రేంజిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.రవితేజ కెరీర్లోనే ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ హంగుల‌తో ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా తెర‌కెక్కిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి దీపావళి కానుకగా చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో విడుదల చేయబోతున్నారు. ఈ చిత్రంలో రవితేజ న‌ట‌న అందిరిని ఆక‌ట్టుకుంటుంది. బ్ర‌హ్మ‌నందం కామెడికి చూసిన ప్ర‌తిప్రేక్ష‌కుడు న‌వ్వుకుంటారు. అన్ని వర్గాల ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుందని అంటున్నారు నిర్మాతలు.


ఈ చిత్ర‌లో మాస్‌మ‌హ‌రాజ్ ర‌వితేజ‌, త‌మ‌న్నా, రాశిఖ‌న్నా, బోమ‌న్ ఇరాని, బ్ర‌హ్మ‌నందం, రావు ర‌మేష్‌, షియాజి షిండే, నాజ‌ర్‌, పోసాని కృష్ణ‌ముర‌ళి, త‌నికెళ్ళ భ‌ర‌ణి, హ‌ర్హ‌వ‌ర్ధ‌న్ రానే, పృద్వి, సురేఖ వాణి, అక్ష‌, శ్యామ‌ల‌, ప్రియ‌, ప్ర‌భు, ప్ర‌గ‌తి, నాగినీడు, ప్ర‌భ‌, ర‌మాప్ర‌భ తదిత‌రులు న‌టించారు.


బ్యాన‌ర్‌ : శ్రీ స‌త్యసాయి ఆర్ట్స్‌, కెమెరా: సౌంద‌ర్ రాజ‌న్‌, ఎడిట‌ర్‌: గౌత‌ం రాజు, ఆర్ట్‌: డి,వై.స‌త్య‌నారాయ‌ణ‌, ఫైట్స్‌: రామ్‌-ల‌క్ష్మ‌ణ్‌, సంగీతం భీమ్స్‌, నిర్మాత‌: కె.కె.రాధామెహ‌న్‌, క‌థ‌-మాట‌లు-స్ర్కీన్‌ప్లే-ద‌ర్శకత్వం: సంప‌త్ నంది.English summary
Ravi Teja’s upcoming film Bengal Tiger has become the talk of the town ever since it was announced. The trailer of this high voltage action entertainer, which was unveiled yesterday, received a superb response from the audience.
Please Wait while comments are loading...