Just In
Don't Miss!
- Finance
IMF చీఫ్ గీతా గోపినాథ్‌పై అమితాబ్ వ్యాఖ్యలు, ఏం మాటలు అంటూ నెటిజన్ల అసహనం
- News
ఎస్సై ఆత్మహత్యను రాజకీయంగా వాడుకుంటారా ? చంద్రబాబు, దేవినేని ఉమపై పోలీస్ అధికారుల సంఘం ధ్వజం
- Sports
టీమిండియా ఆటగాళ్లకు మరో కొత్త టెస్ట్.. 8 నిమిషాల్లోనే 2 కిమీ!! ఎన్నిసార్లంటే?
- Automobiles
భారత్‌లో సిట్రోయెన్ మొదటి షోరూమ్ ప్రారంభం, త్వరలో సి5 ఎయిర్‌క్రాస్ విడుదల
- Lifestyle
ఈ రాశుల వారు పిల్లల్ని బాగా పెంచుతారట... మీ రాశి కూడా ఉందేమో చూసెయ్యండి...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
డబుల్ కిక్: రవితేజ 'కిక్-2' లొకేషన్ లో ..(ఫొటోలు)
హైదరాబాద్: నిరుడు ‘బలుపు'తో కెరీర్ బెస్ట్ హిట్ సాధించి జోరుమీదున్న రవితేజ, ఈ ఏడాది ‘పవర్'తో ఆ జోరును కొనసాగించాడు. స్ర్కిప్ట్ రైటర్ బాబీ (కె.ఎస్. రవీంద్ర) దర్శకుడిగా మారి రూపొందించిన ఈ చిత్రంలో ఏసీపీ బలదేవ్ సహాయ్‌గా, తిరుపతిగా రవితేజ తనదైన శైలి నటనతో అలరించి, మరోసారి ‘మాస్ మహారాజా' అనే గుర్తింపుకు న్యాయం చేశాడు. నిర్మాతకూ, బయ్యర్లకూ లాభాల పంట పండించాడు. ప్రస్తుతం ఆయన ‘కిక్ 2', ‘బెంగాల్ టైగర్' సినిమాలు చేస్తున్నాడు.
పాఠకుల కోసం ఫేస్‌బుక్ ద్వారా ఎప్పటికప్పుడు తాజా వార్తలు... లైక్ చేయండి.
రవితేజ, సురేందర్‌రెడ్డి కాంబినేషన్‌లో వచ్చిన 'కిక్' ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో తెలిసిందే. మళ్లీ అదే టీమ్‌తో నందమూరి తారక రామారావు ఆర్ట్స్ పతాకంపై నందమూరి కల్యాణ్‌రామ్ నిర్మిస్తున్న సినిమా 'కిక్-2'. ఈ చిత్రం అనేక విశేషాలతో కిక్కు ఎక్కించనుందని తెలుస్తోంది. ఈ విశేషాలలో మొదటిది రవితేజ డ్యూయిల్ రోల్ లో కనిపించనున్నాడని, అదీ తండ్రి,కొడుకులుగా అని తెలుస్తోంది. ఆ మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాలో హైలెట్ అంటున్నారు.
ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు రాజపాల్ యాదవ్ కీలక పాత్రలో కనిపించటం. ఆ పాత్ర సినిమాలో పెద్ద హైలెట్ అవుతుందని అంటున్నారు. ఈ విషయాన్ని రాజపాల్ యాదవ్ ఖరారు చేసాడు.
స్లైడ్ షోలో ఫొటోలు...

మరింత కిక్
రవితేజ పాత్ర శైలి, నటన మరోసారి ప్రేక్షకులకు కావల్సినంత కిక్ ఇస్తాయని దర్శక,నిర్మాతలు చెప్తున్నారు.

కేవలం క్యారక్టరైజేషన్
సీక్వెల్ లో కేవలం క్యారెక్టరైజేషన్ కంటిన్యూ అవుతుందని అంటున్నారు. అందులో హీరో పోలీస్ ఆఫీసర్ అయిన తర్వాత కిక్ సినిమా ముగుస్తుంది. కాబట్టి సీక్వెల్ లో పోలీస్ పాత్ర ఉంటుందని తెలుస్తోంది.

విలనా..కమిడయినా
ఆయన పాత్ర సినిమాలో ఊహించని విధంగా సాగుతుందని, కొంత ఫన్ కూడిన పాత్ర అదని అంటున్నారు. రాజపాల్ యాదవ్ అంటేనే కామెడీ ..మరి ఈ కామెడీ సినిమాలో ఆయన కామెడీ చేస్తారో లేక తొలి చిత్రంలో లాగ విలనీ చేస్తారో చూడాలి.

రిలీజ్ డేట్
ఈ చిత్రం మే 28, 2015న విడుదల చేస్తామని నిర్మాత తెలియచేసారు.

చిత్ర విశేషాలను నిర్మాత తెలుపుతూ-
యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ చిత్రంలో రవితేజ మార్క్ ఎంటర్‌టైనర్‌తోపాటు సురేందర్ రెడ్డి, తమన్ మ్యాజిక్ మళ్లీ రిపీట్ కానుంది.

రవితేజ మాట్లాడుతూ...
‘కిక్' తర్వాత మళ్లీ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మరో ఫుల్ లెంగ్త్ ఎంటర్టెనర్ చేస్తున్నాను. మా ఇద్దరి కాంబినేషన్లో ఇది మంచి కిక్ ఇచ్చే సినిమా అవుతుంది అన్నారు.

దర్శకుడు సురేందర్ రెడ్డి మాట్లాడుతూ....
‘ఈ సినిమా ‘కిక్'కి సీక్వెల్ కాదుగానీ అందరికీ డబుల్ కిక్ ఇచ్చే సినిమా అవుతుంది. ‘కిక్'లో రవితేజ, ఇలియానా జంటగా నటించారు. వాళ్లిద్దరి కొడుకు కథే ‘కిక్-2' అన్నారు.

రేసు గుర్రం తర్వాత
అల్లు అర్జున్ తో చేసిన రేసు గుర్రం చిత్రం తర్వాత చేస్తున్న చిత్రం కావటంతో సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి.

బిజినెస్ క్రేజ్
సినిమాకు అప్పుడే బిజినెస్ క్రేజ్ మొదలైందని సమాచారం. మంచి రేట్లకే బిజినెస్ చేస్తున్నట్లు ట్రేడ్ లో చెప్పుకుంటున్నారు

అందుకే...
కళ్యాణ్ రామ్ తనకు అతనొక్కడే చిత్రంతో నమ్మి బ్రేక్ ఇచ్చినందుకే ..సురేంద్ర రెడ్డి ఈ క్రేజీ ప్రాజెక్టుని అతనికి చేస్తున్నట్లు చెప్పుకుంటున్నారు.

తెర వెనక...
ఈ చిత్రానికి కథ: వక్కతం వంశీ, సంగీతం: యస్ యస్ థమన్, సినిమాటోగ్రఫీ: మనోజ్ పరమహంస, ఎడిటింగ్: గౌతం రాజు, ఆర్ట్ : నారాయణరెడ్డి, ఫైట్స్: రామ్ లక్ష్మణ్, నిర్మాత నందమూరి కళ్యాణ్ రామ్, స్క్రీన్ ప్లే-దర్శకత్వం: సురేందర్ రెడ్డి.