»   » రిలీజ్ డేట్ వచ్చింది: కిక్కు కోసం రిస్క్ చేస్తున్న రవితేజ!

రిలీజ్ డేట్ వచ్చింది: కిక్కు కోసం రిస్క్ చేస్తున్న రవితేజ!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రవితేజ నటించిన ‘కిక్' సినిమాలో హీరో పాత్ర కిక్ కోసం చాలా రిస్కులు చేస్తుంటాడు. త్వరలో ‘కిక్-2' సినిమా కూడా రాబోతోంది. అయితే ఈ సినిమా విడుదల విషయంలో నిర్మాతలు రిస్క్ చేస్తున్నారేమో? అని పలువురు అభిప్రాయ పడుతున్నారు. ఓ వైపు ఏప్రిల్ మాసాంతంలో ‘రుద్రమదేవి' విడుదలకు సిద్దమవుతోది. మరో వైపు మే రెండో వారంలో ‘బాహుబలి' విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో ఈ రెండు సినిమాల మధ్యలో రవితేజ ‘కిక్-2' విడుదల చేయాలని నిర్ణయించడం హాట్ టాపిక్ అయింది.

మాస్ మహారాజా రవితేజ, సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో వచ్చిన ‘కిక్' ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. మళ్లీ కిక్ టీమ్ తో నందమూరి తారక రామారావు ఆర్ట్స్ బేనర్లో నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న ‘కిక్-2' చిత్రానికి సంబంధించి రెండు పాటలను స్విట్జర్లాండ్ లో చిత్రీకరిస్తున్నారు.


 Ravi Teja's “ Kick 2 ” release date confirmed

ఈ నెల 31 వరకు ఈ షెడ్యూల్ జరుగుతుంద. ఏప్రిల్ 3 నుండి అన్నపూర్ణ స్టూడియోలో చిత్రీకరించే పాటతో చిత్రానికి సంబంధించిన టోటల్ షూటింగ్ పూర్తవుతుంది. ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై ‘పటాస్' వంటి సూపర్ హిట్ చిత్రాన్ని నిర్మించిన కళ్యాణ్ రామ్ ‘కిక్ 2' మరో ఘన విజయాన్ని సాధించేందుకు సిద్దమవుతుననారు.


అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి సమ్మర్ స్పెషల్ గా మే 7న ‘కిక్ 2' చిత్రాన్ని వరల్డ్ వైడ్ గా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మాస్ మహరాజా రవితేజ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి కథ: వక్కతం వంశీ, సంగీతం: ఎస్.ఎస్.థమన్, సినిమాటోగ్రఫీ: మనోజ్ పరమహంస, ఎడిటింగ్: గౌతం రాజు, ఆర్ట్: నారాయణ రెడ్డి, ఫైట్స్: రామ్ లక్ష్మణ్, నిర్మాత నందమూరి కళ్యాణ్ రామ్, స్క్రీన్ ప్లే-దర్శకత్వం: సురేందర్ రెడ్డి.

English summary
Mass Maharaja Ravi Teja’s upcoming movie “Kick 2” is scheduled to hit big screens on May 7, according to the latest grapevine in the T-town.
Please Wait while comments are loading...