»   » రవితేజ ‘కిక్-2’ ఇంకా రిపేరులోనే ఉంది...

రవితేజ ‘కిక్-2’ ఇంకా రిపేరులోనే ఉంది...

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రవితేజ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా ‘కిక్-2' చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగు పూర్తయిన తర్వాత ఎందుకనో... కొన్ని సీన్లు సరిగా రాలేదని మళ్లీ రీషూట్ చేస్తున్నారు. ఈ రీ షూట్ ప్రక్రియ ఇంకా కొనసాగుతూనే ఉంది.

సినిమాలోని కొన్ని ముఖ్యమైన సీన్లతో పాటు... కొన్ని పాటల ఔట్ పుట్ విషయంలో దర్శకుడు సురేందర్ రెడ్డి, నిర్మాత కళ్యాణ్ రామ్ సంతృప్తిగా లేరని, అందుకే కాంప్రమైజ్ కాకుండా రీ షూట్ చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. హీరో రవితేజతో పాటు రకుల్ ప్రీత్ సింగ్ కూడా రీ షూట్‌కు సహకరిస్తున్నారు.


Ravi Teja's Kick 2 reshoot details

రవితేజ అభిమానులు కిక్-2 సినిమా విడుదల కోసం గత కొన్ని రోజులుగా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో రిలీజ్ అయి చాలా కాలం అయింది. అయితే సినిమా మాత్రం ప్రేక్షకుల ముందుకు రావడం లేదు. ఇప్పట్లో వచ్చే అవకాశమూ కనిపించడం లేదు.


ఎప్పుడో వస్తుందనుకున్న సినిమా ఇలా వాయిదాల మీద వాయిదాలు పడటంపై సగటు రవితేజ అభిమానులు సినిమా చూడాలనే కిక్ దొబ్బుతోందని వాపోతున్నారు. ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బేనర్లో నందమూరి కళ్యాణ్ రామ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రవితేజ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది. తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

English summary
According to inside sources, Ravi Teja-starrer Kick 2 is undergoing a repair process as the makers have decided to do a reshoot of few portions of the film.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu