»   » నెగెటివ్ రిపోర్ట్: కిక్-2 రన్ టైంలో 20 నిమిషాల కోత

నెగెటివ్ రిపోర్ట్: కిక్-2 రన్ టైంలో 20 నిమిషాల కోత

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: భారీ అంచనాలతో విడుదలైన రవితేజ ‘కిక్-2' చిత్రం విడుదలైన రోజే మిక్డ్స్ టాక్ వచ్చింది. కిక్ రేంజిలో తాజాగా విడుదలైన కిక్ 2 సంతృప్తి పరచలేదనే టాక్ వచ్చింది. ఈ నేపథ్యంలో దర్శక నిర్మాతలు దిద్దుబాటు చర్యలు చేపట్టారు. సినిమా రన్ టైంలో 20 నిమిషాలు కొత విధించారు. సినిమాలో ప్రేక్షకులకు బోర్ తెప్పించే సన్నివేశాలను తొలగించారు.

Kick 2

ఈ చిత్రానికి ఎస్‌.ఎస్‌.థమన్‌ స్వరాలు అందించారు. ఈ చిత్రానికి సెన్సార్ జరిగి U/A సర్టిఫికేట్ వచ్చింది. చిత్రం రన్ టైమ్ 161 నిముషాలు ఉంది. సినిమాలో పలు చోట్ల సన్నివేశాలు సాగదీసినట్లు ఉండటంతో ప్రేక్షకులు అసంతృప్తికి గురవుతున్నారనే టాక్ వచ్చింది. 20 నిమిషాలు రన్ టైం తగ్గించడం ద్వారా మంచి ఫలితాలు వస్తాయని ఆశిస్తున్నారు.

మాస్ మహారాజా రవితేజ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి కథ: వక్కతం వంశీ, సంగీతం: యస్.యస్.థమన్, సినిమాటోగ్రఫీ: మనోజ్ పరమహంస, ఎడిటింగ్: గౌతం రాజు, ఆర్ట్: నారాయణ రెడ్డి, ఫైట్స్: రామ్ లక్ష్మణ్, నిర్మాత నందమూరి కళ్యాణ్ రామ్, స్క్రీన్ ప్లే-దర్శకత్వం: సురేంద్ రెడ్డి.

నెక్ట్స్ మూవీ..
మాస్ మహరాజ్‌ రవితేజ హీరోగా, త‌మ‌న్నా, రాశి ఖ‌న్నా హీరోయిన్స్ గా, సంపత్ నంది దర్శకత్వంలో చేస్తున్న 'బెంగాల్ టైగ‌ర్' చిత్రానికి సంబందించి థీమ్ సాంగ్ ని హైద‌రాబాద్ పరిసర ప్రాంతాల్లో చిత్రీక‌రిస్తున్నారు. ఈ సాంగ్ లో 120 మంది డాన్స‌ర్స్ తో మాస్‌మ‌హ‌రాజ్ ర‌వితేజ పై చిత్రంలో ఇంట్ర‌డ‌క్ష‌న్ సాంగ్ గా చిత్రీక‌రిస్తున్నారు . ఈ సాంగ్ కోసం హీరోయిన్ హంస‌నందిని మాస్‌మ‌హ‌రాజ్ తో స్టెప్స్ వేస్తుంది.

ఈ చిత్ర‌లో మాస్‌మ‌హ‌రాజ్ ర‌వితేజ‌, త‌మ‌న్నా, రాశిఖ‌న్నా, బోమ‌న్ ఇరాని, బ్ర‌హ్మ‌నందం, రావు ర‌మేష్‌, షియాజి షిండే, నాజ‌ర్‌, పోసాని కృష్ణ‌ముర‌ళి, త‌నికెళ్ళ భ‌ర‌ణి, హ‌ర్హ‌వ‌ర్ధ‌న్ రానే, పృద్వి, సురేఖ వాణి, అక్ష‌, శ్యామ‌ల‌, ప్రియ‌, ప్ర‌భు, ప్ర‌గ‌తి, నాగినీడు, ప్ర‌భ‌, ర‌మాప్ర‌భ తదిత‌రులు న‌టించారు. బ్యాన‌ర్‌ : శ్రీ స‌త్యసాయి ఆర్ట్స్‌, కెమెరా: సౌంద‌ర్ రాజ‌న్‌, ఎడిట‌ర్‌: గౌత‌ం రాజు, ఆర్ట్‌: డి,వై.స‌త్య‌నారాయ‌ణ‌, ఫైట్స్‌: రామ్‌-ల‌క్ష్మ‌ణ్‌, సంగీతం, భీమ్స్‌, నిర్మాత‌: కె.కె.రాధామెహ‌న్‌, క‌థ‌-మాట‌లు-స్ర్కీన్‌ప్లే-ద‌ర్శకత్వం: సంప‌త్ నంది.

English summary
Ravi Teja’s Kick 2 opened to some decent reviews all over. However, a slight lengthy run time became a hot topic of discussion. Keeping this in mind, the makers have trimmed the film by at least 20 minutes to make things better.
Please Wait while comments are loading...