For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  పాజిటివ్&నెగిటివ్: 'కిక్‌-2' ట్వీట్ రివ్యూ...

  By Srikanya
  |

  హైదరాబాద్ : రవితేజ తాజా చిత్రం 'కిక్‌-2' ఈ రోజు విడుదల అయిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఇప్పటికే చాలా చోట్ల బెనిఫిట్ షోలలో అభిమానులు చూసేయటం జరిగింది. సినిమా కి ఇప్పటివరకూ అందుతున్న రిపోర్ట్ లను బట్టి కంఫర్టబుల్ పాజిటివ్ టాక్ వచ్చింది. అయితే మిక్సిడ్ టాక్ రన్ అవుతోంది. అయితే సినిమా చూసిన వారంతా రవితేజ ఎనర్జీకి ఆశ్చర్యపోతున్నారు. వయస్సు తో పాటే ఎనర్జీ పెరుగుతోందని అంటున్నారు.

  ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

  'కిక్‌-2' విషయానికి వస్తే... ఈ సారి కంఫర్ట్ అనే కాన్సెప్టు తో వస్తున్న ఈ చిత్రం పూర్తి కంపర్ట్ ప్రాజెక్టు అంటున్నారు. దానికి తోడు ఈ సారి కేవలం కామెడీని మాత్రమే కాక యాక్షన్ ని కూడా జోడించి వదులుతున్నారు. ఓ రకంగా ఇది కంఫర్ట్ తో కూడిన డబుల్ డోస్ అని చెప్తున్నారు. ఈ కిక్ సిరీస్ లో.... ఫస్ట్ పార్ట్ మొత్తం కామెడీ బ్యాక్ డ్రాప్ తో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. ఇక ఈ రోజున వస్తున్న కిక్ 2... కామెడీ తో పాటు కంఫర్ట్ అనే డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఆడియెన్స్ ని అలరిస్తోంది. అయితే సినిమా స్క్రీన్ ప్లే ఫెయిలైందని కొందరంటున్నారు. సినిమాని ఎంతసేపూ ఎంటర్టైన్ ధోరణిలోనే నడపాలని కొన్ని మూవ్ మెంట్స్ ని మిస్ చేసాడంటున్నారు.

  ఇందులో రవితేజ రాబిన్ హుడ్ గా కనిపిస్తారు. కథలో ఎక్కువభాగం రాజస్ధాన్ లోని విలాస్ పూర్ అనే గ్రామంలో జరుగుతుంది. ఎన్నారై అయిన రాబిన్ హుడ్ తన ఆస్దులు అమ్మకం కోసం ఇండియా వస్తాడు. అక్కడ రకుల్ ప్రీతితో ప్రేమలో పడతాడు. ఆమెతో డ్యూయిట్స్ పాడుతూ, పండిట్ రవితేజ (బ్రహ్మానందం)ఇంట్లో గెస్ట్ గా ఉంటూ వచ్చిన అతనికి రకుల్ విషయంలో ఓ ట్విస్ట్ పడుతుంది. ఆ ట్విస్ట్ ...విలీస్ పూర్ గ్రామానికి దారి తీస్తుంది. అది సోలామన్ సింగ్ ఠాకూర్ (రవికిషన్) రాజ్యం. అక్కడ అతను ఎంత చెప్తే అంత. అక్కడ జనం చాలా ఇబ్బందులు పడుతూంటారు. అవన్నీ చూసినా కంఫర్ట్ అనే రాబిన్ హుడ్ యాక్షన్ లోకి ఎంట్రీ ఇవ్వటానికి ఇష్టపడడు. అయితే కొన్ని పరిస్దితులు అతన్ని రవికిషన్ పైకి దండెత్తేలా చేస్తాయి. ఆ పరిస్ధితులు ఏంటి...రాబిన్ హుడ్ ఎలా ఆ విలన్ ని ఎదిరించాడు. రకుల్ ప్రీతి సింగ్ లక్ష్యం ఏమిటి అనేది మిగతా కథ.

  స్లైడ్ షోలో ..

  ఫస్ఠాఫ్ గురించి

  ఈ సినిమా ఫస్టాఫ్ బాగుందంటూ ట్వీట్ చేసాడు

  కామెడీ

  సినిమాలో కామెడీ హైలెట్ గా ఉంటుందని అంటున్నారు

  కిరాక్

  రకుల్ ప్రీతి సింగ్ గురించి ట్వీట్ చేసారు

  డైలాగ్స్

  సినిమాలో డైలాగ్స్ గురించి డైలాగ్ డెలవరీ గురించి ఈ ట్వీట్

  హిట్ టాక్

  చూస్తుంటే కంపర్టబుల్ విన్నర్ లాగే కనపడుతోంది

  సంగీతం గురించి

  సినిమాలో తమన్ సంగీతం గురించి ఈ ట్వీట్

  మిస్సయ్యా

  సినిమాలో ఇలియానా ని మిస్సయ్యామంటూ...

  సూపర్ హిట్ అంటూ

  ఓ వ్యూయర్ ఈ సినిమాని సూపర్ హిట్ గా అభివర్ణించాడు.

  English summary
  Though intial reports from overseas suggested a mixed version, early shows in Telugu land opened up with a 'comfortable' positive talk.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X