»   » రవితేజ కొత్త చిత్రం పూజ ..దర్శకుడు ఎవరంటే

రవితేజ కొత్త చిత్రం పూజ ..దర్శకుడు ఎవరంటే

Posted By:
Subscribe to Filmibeat Telugu
హైదరాబాద్ : బలుపు హిట్ తో ఊపు మీద ఉన్న రవితేజ మరో కొత్త చిత్రానికి శ్రీకారం చుట్టారు. బలపు రచయిత...బాబి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుంది. వైవియస్ చౌదరి ఈ చిత్రం నిర్మించనున్నారు. ఈ మేరకు పూజా కార్యక్రమాలు వైవియస్ చౌదరి ఆఫీసులో నిన్న(ఆదివారం)జరిగాయి. పూర్తి స్దాయి ఎంటర్టైన్మెంట్ తో కూడిన యాక్షన్ ఫిల్మ్ గా చిత్రం రూపొందనుందని సమాచారకం. ఈ నెలాఖరనుంచి చిత్రం షూటింగ్ మొదలు కానుంది. బాబి గతంలో ... డాన్ శ్రీను, బాడీ గార్డ్, మిస్టర్ ఫెరఫెక్ట్ చిత్రాలకు రచనా సహకారం అందించారు.

వరుస ప్లాపులతో సతమతం అయిన రవితేజకు 'బలుపు' చిత్రం హిట్‌తో కాస్త ఊరట లభించింది. ఇంత కాలం స్క్రిప్టుపై పెద్దగా దృష్టి పెట్టని రవితేజ... బలుపు చిత్రం దగ్గర నుంచి ఆచి తూచి అడుగులు వేస్తున్నాడు. గుడ్డిగా ఏ సినిమా పడితే ఆ సినిమా చేసుకుంటే పోతే తన కెరీర్‌కు ఆపద తప్పదని గ్రహించాడు. అందుకే కథ, స్క్రిప్టు విషయాల్లో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాడు.


ఈ చిత్రం తో పాటు రవితేజ తర్వాతి సినిమా భీమినేని శ్రీనివాసరావు దర్శకత్వంలో ఉంటుందని తెలుస్తుంది. ఇప్పటికే వీరిద్దరి కథ, స్క్రిప్టు విషయంలో ఓ అవగాహన కుదిరిందని తెలుస్తోంది. రీమేక్ మూవీల దర్శకుడిగా పేరుతన్న భీమినేని శ్రీనివాసరావు గతంలో అల్లరి నరేష్ హీరోగా 'సుడిగాడు' చిత్రం తెరకెక్కించారు. ఓ తమిళ చిత్రం రీమేక్‌గా తెరకెక్కించిన 'సుడిగాడు' చిత్రం హిట్ టాక్ తెచ్చుకోవడంతో పాటు, తెలుగు బాక్సాఫీసు వద్ద మంచి ఫలితాలను రాబట్టింది. తాజాగా రవితేజ-భీమినేని కాంబినేషన్లో రాబోయే సినిమా కూడా తమిళ రీమేక్ సినిమానే అని, తమిళంలో హిట్టయిన 'సుందర పాండ్యన్' చిత్రాన్ని తెలుగులో వీరిద్దరి కాంబినేషన్లో రీమేక్ చేస్తున్నారని తెలుస్తోంది. త్వరలో ఈ ప్రాజెక్టు విషయమై అఫీషియల్ అనౌన్స్ మెంట్ రానుంది.

English summary
Ravi Teja has started working for a new film. This untitled film is being directed by newcomer Bobby, writer of Ravi Teja's recent hit, Balupu. The film yesterday (September 1, 2013) had its pooja at a quite ceremony at producer YVS Chowdhary's office. Director and producer YVS Chowdhary earlier produced Nippu with Ravi Teja as hero in the direction of Gunashekar but the film was a failure at box-office. Yet he is producing another film with Ravi Teja, giving directorial reins to a newcomer. The film will have its regular shoot from this month end.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu