»   » రవితేజ.... సత్తా ఉన్న మగాడు కాంటెస్ట్!

రవితేజ.... సత్తా ఉన్న మగాడు కాంటెస్ట్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ర‌వితేజ లార్డ్ - మాస్టర్ అనే ప్రముఖ మ‌ద్యం ఉత్ప‌త్తి చేసే సంస్థ‌కు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ‘సత్తా ఉన్న మగాడి కోసం' అంటూ ఆ ల్రెడీ రవితేజ మీద యాడ్స్ కూడా చిత్రీకరించారు. రవితేజను కలవాలనుకునే అభిమానుల కోసం లార్డ్-మాస్టర్ సరికొత్త కాంటెస్ట్ ప్రవేశ పెట్టింది.

Ravi Teja's Satta Unna Magadu Contest

కాంటెస్టుకు సంబంధించిన వివరానలు రవితేజ తన సోషల్ మీడియా పేజీలో పోస్టు చేసారు. ఇందు కోసం మీరు చేయాల్సిందల్లా.....డబ్‌స్మాష్ వీడియో క్రియేట్ చేసి మీ సోషల్ మీడియాలో పోస్టు చేయడమే. మీ పోస్టులో #LordAndMaster అనే యాష్ ట్యాగ్ తగిలించాలి. బెస్ట్ డబ్ స్మాష్ వీడియోలను రవితేజ స్వయంగా చూసి మూడింటిని సెలక్ట్ చేసారు. బెస్ట్ వీడియో మేకర్స్ రవితేజను కలిసే అవకాశం దక్కించుకుంటారు.

Posted by Ravi Teja onSaturday, January 2, 2016

రవితేజ సినిమాల విషయానికొస్తే.... ఆయన నటించిన ‘బెంగాల్ టైగర్' ఇటీవల విడుదలై బాక్సాఫీసు వద్ద యావరేజ్ చిత్రంగా నిలిచింది. రవితేజ నెక్ట్స్ ప్రాజెక్టు ఇంకా అఫీషియల్ గా ఖరారు కాలేదు. రవితేజ హీరోగా కొత్త దర్శకుడు చక్రి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కబోతున్నట్లు తెలుస్తోంది.

English summary
"Hello everyone, To participate in the contest click on the link below and show your Satta by making a Dubsmash video and post it on your Social media profiles with #LordAndMaster in the description. I'll personally watch videos and post 3 best videos on my page and 3 best video makers will get a chance to meet me. See you all soon." Ravi Teja said.
Please Wait while comments are loading...