Just In
Don't Miss!
- News
ద్వివేది, శంకర్‌పై బదిలీ వేటు.. 90 శాతం సర్పంచ్ సీట్లు గెలుస్తాం: పెద్ది రెడ్డి ధీమా
- Finance
రూ.50వేలకు దిగువనే బంగారం ధరలు, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే
- Lifestyle
Republic Day 2021 : పరేడ్ లో పురుషుల కవాతుకు నాయకత్వం వహించిన ఫస్ట్ లేడో ఎవరంటే...
- Sports
World Test Championship ఫైనల్ వాయిదా!!
- Automobiles
ఆటోమేటిక్ టెయిల్‌గేట్ కలిగి ఉన్న భారతదేశపు మొట్టమొదటి హ్యుందాయ్ క్రెటా, ఇదే
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
చక్రి మృతిపై రవితేజ, బన్నీ, సాయి ధరమ్ తేజ్
హైదరాబాద్ : ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం, ఇడియట్, అమ్మా నాన్నా ఓ తమిళమ్మాయ్ లాంటి ఎన్నో సూపర్‌హిట్ చిత్రాలకి అద్బుతమైన సంగీతాన్ని అందించిన సంగీత దర్శకుడు చక్రి. దాదాపు రవితేజ సక్సస్ కెరీర్ లో తనతో ట్రావెల్ అయ్యారు చక్రి. ఈరోజు ఉదయం చక్రి మరణవార్త విన్న రవితేజ దిగ్బ్రాంతి కి లోనయ్యారు. తన కెరీర్ స్టార్టింగ్ నుండి తనతో మరియ పూరిజగన్నాధ్‌లతో ట్రావెల్ అయ్యిన వెరీ టాలెంటెడ్ సంగీత దర్శకుడు చక్రి ఇలా హఠార్మణం చెందటం చాలా భాదాకరం. చక్రి మరణం యావత్ సంగీత లోకానికి తీవ్రమైన లోటని, చక్రి ఎక్కడ వున్నా అతని ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటూ అలానే వారి కుటుంబ సభ్యులకి నా తీవ్ర సంతాపాన్ని తెలుపుతున్నాను, వారి కుటుంబానికి మనోధైర్యం ఇవ్వాలని ఆ భగవంతుడ్ని కోరుకుంటున్నాను అని అన్నారు
చక్రి మృతి కి సంతాపం తెలిపిన అల్లు అర్జున్
ఎన్నో సూపర్‌హిట్ చిత్రాలకి అద్బుతమైన సంగీతాన్ని అందించిన సంగీత దర్శకుడు చక్రి. దాదాపు 85 చిత్రాలకి తన సంగీతాన్ని అందించారు.. ఈరోజు ఉదయం చక్రి మరణవార్త విన్నవెంటనే అల్లు అర్జున్ దిగ్బ్రాంతి చెందారు. తన కెరీర్ ఒన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన దేశముదురు చిత్రానికి సూపర్బ్ ఎనర్జిటిక్ సంగీతాన్ని అందించారు చక్రి. ఆ సినిమా సక్సస్ లో ఓ మెయిన్ ఫిల్లర్ గా నిలిచిన చక్రి ఈరోజు ఇలా హఠార్మణం చెందటం చాలా భాదాకరం. చక్రి మరణం తెలుగు సినిమా పరశ్రమకి తీవ్రమైన లోటు , చక్రి ఆత్మకి శాంతి చేకూర్చాలని కోరుకుంటూ అలానే వారి కుటుంబ సభ్యులకి సంతాపాన్నితెలుపుతున్నాను అని అల్లు అర్జున్ అన్నారు

చక్రి మృతి కి సంతాపం తెలిపిన దర్శకుడు మారుతి
ఎన్నో సూపర్‌హిట్ చిత్రాలకి అద్బుతమైన సంగీతాన్ని అందించిన సంగీత దర్శకుడు చక్రి. ఈరోజు ఉదయం చక్రి మరణవార్త విన్నవెంటనే దర్శకుడు మారుతి షాక్ కి గురయ్యారు. చక్రి తో నేను ఎప్పుడు పనిచేయలేదు కాని చక్రి బ్రదర్ మహిత్ తో మేము ఓ చిత్రాన్ని చేశాము. ఆ సమయంలో చక్రి ని కలవటం జరిగింది. చాలా మంచివాడు ,సౌమ్యుడు అందరిని ఆప్యాయం గా పలకరించేవాడు. కలిసిన మెదటి పరిచయమే గుర్తుండిపోయోలా వుంది. శివమణి చిత్రంలో రామా రామా అనే సాంగ్ ఇప్పటికి అందరి ఇంటిలో పాడుతూ వుంటారు. అలాంటి చక్రి ఈరోజు చాలా హఠార్మణం చెందటం చాలా భాదాకరం. చక్రి మరణం జీర్ణించుకోలేనిది , చక్రి ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటూ , వారి కుటుంబ సభ్యులకి నా తీవ్ర సంతాపాన్ని తెలుపుతున్నాను అని దర్శకుడు మారుతి అన్నారు
చక్రి గారి మృతి కి సంతాపం తెలిపిన సాయి ధరమ్ తేజ్
ఎన్నో సూపర్‌హిట్ చిత్రాలకి సూపర్బ్ సంగీతాన్ని అందించిన సంగీత దర్శకుడు చక్రి, ఈరోజు ఉదయం మరణించారు ఈవార్త విని హీరో సాయి ధరమ్ తేజ్ షాక్ కి లోనయ్యారు. సాయి ధరమ్ తేజ్ తన విచారాన్ని తెలియజేస్తూ..ఈ రోజు సడన్ గా చక్రి గారి వార్త విని విచారానికి లోనయ్యాను. ఆయన నాకు చాలా స్పెషల్ నా మొదటి చిత్రం రేయ్ కి ఆయన సంగీతాన్ని అందించారు. చక్రి గారు భౌతికంగా లేకపోయినా ఆయన పాటల ద్వారా చిరకాలం చిరంజీవిలా తెలుగు పాట వున్నంత కాలం బ్రతికేవుంటారు. చక్రి గారి మరణం జీర్ణించుకోలేనిది , చక్రి గారి ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటూ , వారి కుటుంబ సభ్యులకి నా తీవ్ర సంతాపాన్ని తెలుపుతున్నాను అని హీరో సాయి ధరమ్ తేజ్ అన్నారు.