»   » మాస్ హీరోగానే కాదు గ్రేట్ డిస్ట్రిబ్యూటర్ గా సక్సెస్ అయిన రవితేజ..

మాస్ హీరోగానే కాదు గ్రేట్ డిస్ట్రిబ్యూటర్ గా సక్సెస్ అయిన రవితేజ..

Posted By:
Subscribe to Filmibeat Telugu

సంక్రాంతి రేసులో గెలిచి నెంబర్ వన్ హిట్ గా నిలిచిన 'మిరపకాయ్" రవితేజ కెరీర్ లోనే హయ్యస్ట్ కలెక్షన్స్ సాధిస్తున్న చిత్రంగా రికార్డ్ సృష్టిస్తోంది. ఈస్ట్, వెస్ట్, వైజాగ్, కృష్ణా, గుంటూరు, సీడెడ్ ఏరియాల్లో 'కిక్" కంటే ఎక్కువ షేర్స్ వస్తున్నాయి. ఇక రవితేజ డిస్ట్రిబ్యూటర్ గా మారి రిలీజ్ చేసిన నైజాం ఏరియాలో కూడా రికార్డ్ కలెక్షన్స్ రాబడుతోంది.

ఈస్ట్ లో 'కిక్" 1కోటి 20 లక్షలు కలెక్ట్ చేయగా, 'మిరపకాయ్"1 కోటి 50 లక్షలు చేసింది. వైజాగ్ లో కిక్ 2 కోట్లు చేయగా, మిరపకాయ్ 2కోట్ల 50 లక్షలు కలెక్ట్ చేసింది 'కృష్ణ"తో సంక్రాంతి హిట్లకు శ్రీకారం చుట్టన రవితేజ మరోసారి ఈ సంక్రాంతికి హిట్ కొట్టి సంక్రాంతి హీరో అనిపించుకున్నాడు. మిరపకాయ్ రవితేజ పాత సినిమాలాగే వుందని, కొత్త సినిమా చూస్తున్న అనుభూతి లేదని అందరూ అభిప్రాయపడ్డప్పటికీ ఈ సినిమాకి సరైన పోటీ ఇచ్చే సినిమా లేకపోవడంతో సూపర్ హిట్ అయిపోయింది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu