»   » ఖరారు: ఓ మై ఫ్రెండ్ తో రవితేజ నెక్ట్స్

ఖరారు: ఓ మై ఫ్రెండ్ తో రవితేజ నెక్ట్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : రీసెంట్ గా 'కిక్ 2' తో వచ్చిన రవితేజ ఇప్పుడు 'బెంగాల్‌ టైగర్‌' షూటింగ్ లో బిజీగా ఉన్నారు. అదే వేడిలో తాజాగా మరో చిత్రం కమిటయ్యారు. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఓ చిత్రం కమిటయ్యినట్లు సమాచారం. రీసెంట్ గా వేణు శ్రీరామ్ కలిసి కథ నేరేట్ చేసినట్లు తెలుస్తోంది. రవితేజ ఇప్రెస్ అయ్యి డేట్స్ ఇవ్వటానికి ముందుకు వచ్చినట్లు చెప్తున్నారు. వేణు శ్రీరామ్ గతంలో ఓహ్ మై ఫ్రెండ్ 2011 చిత్రం చేసారు. ఇన్నాళ్లకు ఈ కథని ఓకే చేసారు.

'బెంగాల్‌ టైగర్‌' విశేషాలకు వస్తే....

రచ్చతో దర్శకుడుగా తన సత్తా ఏంటో చూపించిన దర్శకుడు సంపత్ నంది.. దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'బెంగాల్‌ టైగర్‌'. రవితేజ హీరోగా నటిస్తున్నారు. తమన్నా, రాశీ ఖన్నా హీరోయిన్స్. కె.కె.రాధామోహన్‌ నిర్మాత. ఈ నెల 8 నుంచి యూరప్‌లో చిత్రీకరణ జరగనుంది. అక్కడ కొన్ని కీలక సన్నివేశాల్ని తెరకెక్కిస్తారు. దీంతో చిత్రీకరణ పూర్తవుతుంది.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

Ravi Teja To Team Up with Venu

సంపత్ నంది మాట్లాడితే... పులి పంజా విసిరిందంటే ఇక తిరుగులేనట్టే. అదే పులి ఓ పథకం ప్రకారం పంజా విసిరితే? పౌరుషమున్న ఒక పులి అదే చేసింది. మరి అక్కడ ఏం జరిగిందో తెలియాలంటే మా చిత్రం చూడాల్సిందే అంటున్నారు సంపత్‌ నంది.

దర్శకుడు కంటిన్యూ చేస్తూ.. ''పేరుకు తగ్గట్టుగా బలమైన కథతో రూపొందుతున్న చిత్రమిది. యాక్షన్‌, భావోద్వేగాలు, వినోదం మేళవించి చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. రవితేజ హుషారైన నటన చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. బెంగాల్‌ టైగర్‌ అంత పవర్‌ రవితేజ పాత్రలో కనిపిస్తుంది'' అన్నారు.

''చిత్రీకరణ తుదిదశకు చేరుకొంది. రవితేజ శైలి మాస్‌ అంశాలతో దర్శకుడు సంపత్‌ నంది చిత్రాన్ని తీర్చిదిద్దుతున్న విధానం చాలా బాగుంది. మా సంస్థలో నిలిచిపోయే ఓ మంచి చిత్రమవుతుంది'' అన్నారు నిర్మాత.

English summary
Ravi Teja is likely to team up with director Venu Sriram for an upcoming film. Venu has narrated a script to Ravi Teja recently and Ravi was impressed with the story.
Please Wait while comments are loading...