»   » ఆ సీక్వెల్ కి గ్రీన్ సీగ్నల్ ఇచ్చిన రవితేజ...

ఆ సీక్వెల్ కి గ్రీన్ సీగ్నల్ ఇచ్చిన రవితేజ...

Posted By:
Subscribe to Filmibeat Telugu

మొత్తానికి వంశీ దర్శకత్వంలో మరో సారి నటించటానికి రవితేజా పచ్చ జెండా ఊపారు. 1985లో వంశి దర్శకత్వంలో రాజేంద్రప్రసాద్ హీరోగా వచ్చిన లేడీస్ టైలర్ సినిమాకు సీక్వెల్ గా ఈ చిత్రం రూపొందనుంది. ఇందునిమిత్తం రవితేజ..స్వయంగా వంశీని పిలిచి ఆ ప్రాజెక్టుని రెడీ చేయమని చెప్పారు. అలాగే ఈ సారి లేడీస్ టైలర్ కాస్తా సిటీల్లో ఉండే ఫ్యాషన్ డిజైనర్ గా మారనున్నాడు. ఈ ఫ్యాషన్ డిజైనర్..లేడీస్ కి బట్టలు డిజైన్ చేయటంలో నైపుణ్యం కలిగి ఉంటాడని సమాచారం. అలాగే టైటిల్ కూడా ఫ్యాషన్ డిజైనర్ సన్నాఫ్ లేడీస్ టైలర్ అని పెడుతున్నారు. పూర్తి స్ధాయి ఎంటర్టైన్మెంట్ తో ఈ స్క్రిప్టు తయారు చేస్తున్నారు. ఇక ఈ కథతో అల్లరి నరేష్ హీరోగా సినిమా చేస్తారని మొదట ప్రచారం జరిగింది. అయితే అవును..వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు కాంబినేషన్ రిపీట్ అయితే క్రేజ్ వచ్చే అవకాశం ఉందని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక వంశీ ఈ కథపై గత రెండు సంవత్సరాలుగా కూర్చుంటున్నట్లు చెప్తున్నారు. అలాగే తాజాగా వంశీ దర్శకత్వంలో రిలీజైన చిత్రం సరదాగా కాస్సేపు యావరేజ్ టాక్ తో ముందకెళ్తోంది. ఇక రవితేజ ప్రస్తుతం మిరపకాయ, వీర చిత్రాలతో బిజీగా ఉన్నారు..కాబట్టి వచ్చే సంవత్సరమే ఈ చిత్రానికి డేట్స్ కేటాయించే అవకాశం ఉంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu