»   » వీర సినిమా మరో విక్రమార్కుడు లాంటి పవర్‌పుల్ పాత్ర ఎనర్జిటిక్ హీరో

వీర సినిమా మరో విక్రమార్కుడు లాంటి పవర్‌పుల్ పాత్ర ఎనర్జిటిక్ హీరో

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఇటీవల 'మిరపకాయ్"తో మరో కమర్షియల్ సక్సెస్‌ను తన ఖాతాలో జమ చేసుకున్న రవితేజ ఈ వేసవికి 'వీర"గా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. రమేష్ వర్మ దర్శకత్వంలో శాన్వి ప్రొడక్షన్స్ పతాకంపై గణేష్ ఇందుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్, తాప్సీ నాయికలుగా చేస్తున్నారు. ఈ చిత్రం విశేషాలను దర్శకుడు తెలియజేస్తూ రవితేజ శైలిలో సాగే పక్కా మాస్ ఎంటర్‌టైనర్ ఇది.

ఈ చిత్రంలో రవి రెండు విభిన్నమైన పార్శ్వాలు గల పాత్ర చేస్తున్నారు. కాజల్ కబడ్డీ చిట్టిగా నటిస్తోంది. ఆమె తొలిసారిగా పుల్‌లెంగ్త్ మాస్ పాత్రను పోషిస్తున్నారు. తాప్సీ ఐటీ స్టూడెంట్‌గా నటిస్తున్నారు. పూర్తి కమర్షియల్ మాస్ ఎంటర్‌టైన్‌మెంట్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో 'విక్రమార్కుడు" తర్వాత అంతటి పవర్‌ఫుల్‌గా రవితేజ పాత్ర వుంటుంది"" అన్నారు. నిర్మాత మాట్లాడుతూ '' రవితేజ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్ చిత్రమిది. ఇటీవలే రవితేజ, కాజల్‌పై ఓ పాటను చిత్రీకరించాం. ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుగుతోంది. ఏకధాటిగా జరిగే ఈ షెడ్యూల్‌తో షూటింగ్ పూర్తవుతుంది.

మేలో చిత్రాన్ని విడుదల చేస్తాం. ఇందులో వుండే ఎనిమిది ఫైట్స్ చిత్రానికి హైలైట్‌గా నిలుస్తాయి"" అని తెలిపారు. కిక్ శ్యామ్, శ్రీదేవి ముఖ్యపాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రంలో నాగబాబు, రోజా, రాహుల్‌దేవ్, ప్రదీప్‌రావత్, సుప్రీత్, ప్రభాకర్, ప్రకాష్‌రాజ్ ముఖ్యపాత్రలు చేస్తున్నారు. ఈ చిత్రానికి ఫొటోగ్రఫీ: ఛోటా.కె.నాయుడు, సంగీతం: థమన్, రచన: పరుచూరి బ్రదర్స్, మాటలు: అబ్బూరి రవి.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu