twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మరో కోణం : దర్శకేంద్రుడి నుండి ప్రాణహాని ఉందంటూ..!

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు ఇంటి మీద ఓ యువకుడు ఇటీవల దాడి చేసిన సంగతి తెలిసిందే. రాఘవేంద్రరావు ఇంటి ఆవరణలోని కార్లు ధ్వంసం చేయడంతో పాటు ఆయన ఇంటి అద్దాలు బద్దలు కొట్టాడు. అడ్డొచ్చిన వాచ్ మెన్ మీద దాడి చేసారు. శ్రీరామదాసు కథ తనదే అని, 2003లోనే మీకు కథ పంపిస్తే తన పేరు వేయలేదంటూ ఆరోపిస్తూ అనంతపురం జిల్లాకు చెందిన రవీంద్ర అనే యువకుడు ఈ దాడికి పాల్పడ్డాడు. పోలీసులు అతన్ని అరెస్టు ఐపీసీ సెక్షన్ 452, 427 కింద కేసు నమెదు చేసి రిమాండ్ కు పంపించారు.

    అయితే రవీంద్ర తల్లిదండ్రులు వలపి అంజనమ్మ, వెంకటప్ప వాదన మరోలా ఉంది. ఓ పత్రిక ఇంటర్వ్యూలో వారు మాట్లాడుతూ...సినిమాలపై వ్యామోహంతో తన కొడుకు శ్రీరామదాసు కథను రాసి దర్శకుడు రాఘవేంద్రరావుకు పంపాడని, ఆ కథను మెచ్చుకున్న ఆయన రూ. 15 లక్షలు ఇస్తానని ఒప్పుకున్నారని, అయితే డబ్బులు ఇవ్వకుండా చాలా కాలం హైదారాబాద్ తిప్పించుకున్నారని ఆరోపించారు.

    జూన్ 9వ తేదీన డబ్బులు ఇస్తానని హైదరాబాద్ పిలిపించారని...డబ్బులు ఇవ్వక పోవడంతో కోపంతో రవీంద్ర దాడి చేసాడేమో? మా వాడు చాలా అమాయకుడు, రాఘవేంద్రరావు నుండి మా కుమారుడికి ప్రాణహాని ఉంది, వాడికి రక్షణకల్పించాలని కోరుతున్నాం....అని చెప్పుకొచ్చారు.

    రాఘవేంద్రరావు ఏమంటున్నారు?

    రాఘవేంద్రరావు ఏమంటున్నారు?

    అయితే... రాఘవేంద్రరావు మాత్రం తనకు ఎవరూ ఏ కథ పంపలేదని, ‘శ్రీరామ దాసు' కథ జేజే భారవి అందించారని స్పష్టం చేస్తున్నారు.

    రవీంద్ర తీరుపై

    రవీంద్ర తీరుపై

    అయితే రవీంద్ర తీరుపై కూడా పలు అనుమానాలు వ్యక్తం అవతున్నాయి.

    పదేళ్ల తర్వాతా?

    పదేళ్ల తర్వాతా?

    ఎప్పుడో పదేళ్ల క్రింద సినిమా వస్తే ఇపుడు వచ్చి దాడి చేయడం ఏమిటి? అలాంటిదేమైనా ఉంటే అప్పుడే తాడో పేడో తేల్చుకుని ఉండాలి కదా అని అంటున్నారు.

    ఎవరూ నమ్మడం లేదు

    ఎవరూ నమ్మడం లేదు

    రవీంద్ర ఆరోపణలను, ఆయన తల్లిదండ్రుల ఆరోపణలను ఎవరూ విశ్వసించడం లేదు.

    English summary
    A young script writer tried to attack Telugu cinema director K Raghavendra Rao.The 28-year-old script writer's name is Vallipi Ravindra, of Uddulavadapalli in Nallamada Mandal, Anantapur district. Ravindra entered into an argument with the director over plagiarising his story, based on which Sri Ramadasu was made in 2006.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X