»   » రవితేజ, కళ్యాణ్ రామ్ మధ్య పోటి... ఎవరు సక్సెస్ అవుతారో?

రవితేజ, కళ్యాణ్ రామ్ మధ్య పోటి... ఎవరు సక్సెస్ అవుతారో?

Posted By:
Subscribe to Filmibeat Telugu

మాస్ మాహారాజ్ రవితేజ చేస్తున్న తాజా చిత్రం 'నేల టికెట్'. ఇటీవల విడుదలైన ఈ సినిమా పాటలకు మంచి స్పందన లభిస్తోంది. ఈ మూవీలో రవితేజ సరసన మాళవిక శర్మ హీరోయిన్ గా నటిస్తోంది. జగపతిబాబు పాత్ర ఈ సినిమాలో ప్రధానంగా ఉండబోతోందని సమాచారం. త్వరలో సెన్సార్ పూర్తి చేసుకోబోతున్న ఈ సినిమా మే 25న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

రవితేజ నేల టికెట్ సినిమాతో పాటు కళ్యాణ్ రామ్నటించిన నా నువ్వే సినిమా మే 25నే విడుదల కాబోతోంది. లవ్ స్టోరిగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా పాటలకు మంచి స్పందన లభిస్తోంది. బుధవారం విడుదల చేసిన ఈ సినిమా ట్రైలర్ బాగుంది. ప్యూర్ లవ్ స్టోరి గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కళ్యాణ్ రామ్ ఈ సినిమాపై హోప్స్ పెట్టుకోవడం జరిగింది.

 raviteja and kalyan ram movies releasing on same day!

ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో రవితేజ, కళ్యాణ్ రామ్ ఇద్దరికి హిట్ కావాలి. మరి ఏ హీరో సినిమా విజయం సాధిస్తుందో చూడాలి. రెండు సినిమాలపై మంచి మంచి అభిప్రాయం ఉంది. నేల టికెట్ సినిమా కామెడి ఎంటర్టైనర్ గా ఫ్యామిలి ఆడియన్స్ ను అలరిస్తే.. నా నువ్వే సినిమా యూత్ ను అలరించవచ్చని తెలుస్తోంది.

English summary
Mass Maharaja Ravi Teja's forthcoming flick 'Nela Ticket' managed to create a good buzz in Tollywood with the recently released teaser. The movie coming theaters on may 25th. the same day kalyan ram naa nuvve film coming theaters. both films releasing on same day.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X