»   » రవితేజ ‘వీర’ రెమ్యూనరేషన్ 5 కోట్లు

రవితేజ ‘వీర’ రెమ్యూనరేషన్ 5 కోట్లు

Posted By:
Subscribe to Filmibeat Telugu

కథానాయకుడు రవితేజ 'వీర" గా కెమెరా ముందుకు రాబోతున్నారు. జగపతి బాబు-ప్రియమణి జంటగా నటించి విజయం సాధించిన చిత్రం 'ప్రవరాఖ్యుడు" అదే ప్రొడక్షన్ హౌస్ టాలీ టు హాలీ ఫిలిమ్స్ సంస్థ ఓ చిత్రాన్ని నిర్మించబోతోంది అదే 'వీర". 'రైడ్" విజయం తరువాత రమేష్ వర్మ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఇదే. గణేష్ ఇందుకూరి నిర్మాత. ఈ సినిమాకి 'వీర" అనే పేరు ఖరారైంది. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన ఫోటో షూట్ చేసినట్టు సమాచారం.

'నేనింతే" సినిమాలో రవితేజ క్యారెక్టర్ ఆయన వాస్తవ జీవితానికి దగ్గరగా ఉంటుంది.'ఒక్క ఛాన్స్" అంటూ ఎంత కష్టపడి ఈ స్థాయికి వచ్చాడో అందరికీ తెలిసిందే. సినిమా కష్టాలు అనుభవించిన రవితేజ ఈ రోజు స్టార్ హీరో హోదా అందుకున్నారు. తనకంటూ సొంత ఇమేజ్ సోంతం చేసుకున్నాడు. అందుకే ఈ సినిమాకు గాను రవితేజ రెమ్యునరేషన్ కింద ఐదు కోట్లు తీసుకున్నాడని తెలిసింది.

'రైడ్" సినిమా తర్వాత బాలకష్ణ, రమేష్ వర్మ కాంబినేషన్ లో బెల్లంకొండ సురేష్ 'భీష్మ" చిత్రాన్ని తీస్తున్నట్లు ఎనౌన్స్ చేశారుకూడా. కొన్ని కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి రాలేదు. దీంతో రమేష్ వర్మ రవితేజతో 'వీర" అనే భారీ బడ్జెట్ మూవీని తెరకెక్కిస్తున్నారు. దీనికి పరుచూరి బ్రదర్స్ మాటలు, దేవీ శ్రీప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu