»   » ‘సత్తా ఉన్న మగాడి కోసం’ రవితేజ ఇలా...(వీడియో)

‘సత్తా ఉన్న మగాడి కోసం’ రవితేజ ఇలా...(వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మీరు ఈ క్రింద ఉన్న వీడియోని చూస్తే ఏదన్నా రాబోయే చిత్రంలో ఇంట్రడక్షన్ సీన్ అనుకుంటారు. అయితే ఇది రవితేజ తాజాగా చేసిన ఓ యాడ్ ఫిల్మ్. అచ్చం సినీ ఫక్కీలో సినిమా డైలాగులతో ఈ యాడ్ ని షూట్ చేయటంతో అంతటా హాట్ టాపిక్ అయ్యింది. ఆ వీడియో మీరూ ఇక్కడ చూడండి.


ఇక రవితేజ తాజా చిత్రం గురించి...


రవితేజ హీరోగా సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘కిక్‌-2'. నందమూరి తారక రామారావు ఆర్ట్స్‌ పతాకంపై నందమూరి కల్యాణ్‌రామ్‌ నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఆగస్టు 14న స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా విడుదల చేయాలని ఫైనల్ చేసి డేట్ ని ఫిక్స్ చేసినట్లు సమాచారం. అప్పటికి శ్రీమంతుడు చిత్రం వచ్చి వారం అవుతుంది.


ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


దర్శకుడు మాట్లాడుతూ ‘‘ఈ సినిమా ‘కిక్‌'కు సీక్వెల్‌ కాదు. కానీ అందరికీ డబుల్‌ కిక్‌ ఇస్తుంది. ‘కిక్‌'లో రవితేజ, ఇలియానా జంటగా నటించారు. వాళ్లిద్దరి కొడుకు కథే ‘కిక్‌-2'. రాజస్థాన్‌లోని జైసల్మీర్‌లో క్లైమాక్స్‌ను భారీగా తెరకెక్కించాం. '' అని తెలిపారు.


నందమూరి కల్యాణ్‌రామ్‌ మాట్లాడుతూ ‘‘అతనొక్కడే వంటి హిట్‌ తర్వాత సురేందర్‌రెడ్డి మా సంస్థలో చేస్తున్నారు. రవితేజ హీరోగా ఈ చిత్రం రూపొందుతోంది. హై టెక్నికల్‌ వేల్యూస్‌తో ఎక్కడా కాంప్రమైజ్‌ కాకుండా సినిమాను రూపొందిస్తున్నాం. త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం'' అని తెలిపారు.


Raviteja's New Commercial in Film Style!

ఆద్యంతం వినోద ప్రధానంగా సాగే చిత్రమని రవితేజ అన్నారు. 'కిక్'లో జంటగా నటించిన రవితేజ, ఇలియానా పాత్రల కొడుకు కథే ఈ 'కిక్ 2' అని దర్శకుడు తెలిపారు. నిర్మాత మాట్లాడుతూ...యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ చిత్రంలో రవితేజ మార్క్ ఎంటర్‌టైనర్‌తోపాటు సురేందర్ రెడ్డి, తమన్నా మ్యాజిక్ మళ్లీ రిపీట్ కానుంది.


ఈ చిత్రంలో రవితేజ సరసన రకూల్ ప్రీత్ సింగ్ నటిస్తోంది. ఈ సినిమాకు కథ: వక్కంతం వంశీ, సంగీతం: యస్‌.యస్‌.థమన్‌, కెమెరా: మనోజ్‌ పరమహంస, ఎడిటింగ్‌: గౌతంరాజు, ఆర్ట్‌: నారాయణరెడ్డి, ఫైట్స్‌: రామ్‌-లక్ష్మణ్‌.

English summary
The Television commercial of Raviteja's newly-signed brand 'Lord & Master' is no way less than a power-packed movie scene.
Please Wait while comments are loading...