»   » టాలీవుడ్‌కు మరో స్టార్ హీరో కుమారుడు.. ఈ కుర్రాడు ఎవరంటే..

టాలీవుడ్‌కు మరో స్టార్ హీరో కుమారుడు.. ఈ కుర్రాడు ఎవరంటే..

Posted By:
Subscribe to Filmibeat Telugu
Star Hero Son's Entry In Raja The Great movie

ఇండస్ట్రీలో వారసత్వాలకు కొదవే లేదు. చెట్టు పేరు చెప్పుకుని కాయలు అమ్ముకునేవాళ్లు మిగతా ఇండస్ట్రీలతో పోలిస్తేమన తెలుగు ఇండస్ట్రీలో కాస్త ఎక్కువే. ఇప్పటికే మెగా వారసులు అరడజనుకు పైగా రాగా నందమూరి, దగ్గుబాటి, అక్కినేని ఇలా ఒకరి తర్వాత ఇంకొకరు ఇండస్ట్రీలోకి వస్తూనే ఉన్నారు.

రవితేజ కొడుకు మ‌హాధన్ కూడా

రవితేజ కొడుకు మ‌హాధన్ కూడా

తాజాగా మాస్ మహరాజ్ రవితేజ కొడుకు మ‌హాధన్ కూడా వెండితెర‌పై క‌నిపించ‌నున్నాడ‌నే వార్త ఒక‌టి సినీ వర్గాల్లో హ‌ల్ చ‌ల్ చేస్తుంది. రవితేజ కాస్త గ్యాప్ తీసుకుని అనీల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో నటిస్తున్న రాజా ది గ్రేట్ అనే చిత్రంలో మ‌హాధన్ కనబడనున్నట్లు తెలుస్తుంది.

రవితేజ చిన్నప్పటి క్యారెక్టర్‌లో

రవితేజ చిన్నప్పటి క్యారెక్టర్‌లో

రాజా ది గ్రేట్ చిత్రంలో ర‌వితేజ అంధుడి గా క‌నిపిస్తుండగా రవితేజ చిన్నప్పటి క్యారెక్టర్‌లో మ‌హాధ‌న్ కనిపించనున్నాడట. అయితే దీనిపై పూర్తి క్లారిటీ రావ‌ల‌ంటే మాత్రం మరికొంత సమయం వేచి చూడాల్సిందే. కాగా రాజా ది గ్రేట్ సినిమాలో రవితేజ తల్లిగా రాధిక నటిస్తుంది.

ఇది క్రొత్త విషయం ఏమీ కాదు.

ఇది క్రొత్త విషయం ఏమీ కాదు.

అయితే ఇలా తండ్రి చిన్నప్పటి పాత్రలు చేయడం ఇది క్రొత్త విషయం ఏమీ కాదు. ఇది టాలీవుడ్‌లో ఈ మధ్య నడుస్తున్న ట్రెండే. సూపర్ స్టార్ ప్రిన్స్ మహేశ్ బాబు కొడుకు గౌతమ్ కూడా వన్.. నేనొక్కడినే సినిమాలో మహేష చిన్నప్పటి క్యారెక్టర్ పోషించిన విషయం తెలిసిందే. తాజాగా శ్రీశ్రీ సినిమాలో కూడా సుధీర్ బాబు కొడుకు చరిత్ కూడా ఇలా నటించి మెప్పించాడు.

అక్టోబ‌ర్ 12న రాజా ది గ్రేట్

అక్టోబ‌ర్ 12న రాజా ది గ్రేట్

ఇక రవితేజ ‘రాజా ది గ్రేట్' షూటింగ్ మొత్తం పూర్తి చేయగా మరో సినిమా 'టచ్ చేసి చూడు' సెట్స్ పైనే ఉంది. దిల్ రాజు నిర్మాణంలో రూపొందుతున్న ‘రాజా ది గ్రేట్' చిత్రం అక్టోబ‌ర్ 12న విడుద‌ల కానుంది. సాయి కార్తీక్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో మెహ‌రీన్ కౌర్ క‌థానాయిక‌గా న‌టిస్తుంది. తాజాగా విడుదలైన చిత్ర టీజర్‌కు ప్రేక్షకుల నుంచి భారీ స్పందన లభించింది.

English summary
Tollywood is going to witness another star hero son's entry. reports suggest that, Mass Maharaj Raviteja's son mahadhan will be seen in Raja the Great movie. Mahadhan is acting as young Raviteja role. This movie slated to release on October 12th.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu