»   » స్టుపిడ్ గా ప్రవర్తించను, ముద్దు సీన్ పై హీరోయిన్ భర్త (ఫోటోస్)

స్టుపిడ్ గా ప్రవర్తించను, ముద్దు సీన్ పై హీరోయిన్ భర్త (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్, సైఫ్ అలీ ఖాన్ తో వివాహం తర్వాత నుండి ముద్దు సీన్లకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం ఆమె నటిస్తున్న ‘కి అండ్ కా' మూవీ విషయంలో మాత్రం కరీనా తన నిర్ణయం మార్చుకుంది. ఈ చిత్రంలో తనకంటే చిన్నవాడైన అర్జున్ కపూర్ తో హాట్ హాట్ రొమాంటిక్ సీన్లలో నటించడంతో పాటు ముద్దు సీన్లు కూడా చేసింది.

అయితే ఈ ముద్దు సీన్లు చేసే ముందు కరీనా కపూర్ తన భర్త సైఫ్ నుండి అనుమతి తీసుకుందట. ‘నేను, అర్జున్ భార్య భర్తలుగా నటిస్తున్నామని సైఫ్ తో చెప్పాను. ముద్దు సీన్లు కూడా చేయాల్సి ఉంటుంది అని వెల్లడించాను' అని కరీనా ఇటీవల ఇంటర్వ్యూలో తెలిపారు.

‘సినిమాలో భార్య భర్తల పాత్రలు ఉన్నపుడు ఇలాంటి సీన్లు చేయడం సాధారణమే. ఈ విషయంలో నేను స్టుపిడ్ గా ప్రవర్తించను, అనవసర ఆంక్షలు పెట్టేరకం కాదు నేను. మనం ఏదైనా పాత్ర చేసేపుడు పర్ ఫెక్ట్ సీన్ పండటానికి ఇలాంటి ఎన్నో చేయాల్సి ఉంటుంది.' అని సైఫ్ చెప్పినట్లు కరీనా వెల్లడించారు.

ఈ చిత్రం గురించి కరీనా మాట్లాడుతూ,'భారతీయ సమాజంలో పెళ్ళైన భార్యభర్తల మధ్య మగ, ఆడ అనే జెండర్‌ తేడా ఎలాంటి కీలక పాత్ర పోషిస్తుందనే పాయింట్‌తో ఈ చిత్రం రూపొందింది. భావోద్వేగాలకు ప్రతీకగా నిలిచిన ఇటువంటి చిత్రంలో నటించే అవకాశం రావడం చాలా ఆనందంగా ఉంది. అర్జున్‌ కపూర్‌, అమితాబ్‌, జయాబచ్చన్‌ వంటి వారితో నటించటం మరచిపోలేని అనుభూతినిచ్చింది' అని తెలిపారు.

ముద్దు సీన్లు

ముద్దు సీన్లు


కి అండ్ కా మూవీలో అర్జున్, కరీనా మధ్య హాట్ అండ్ సెక్సీ ముద్దు సీన్లు ఉన్నాయి.

సైఫ్ అనుమతి

సైఫ్ అనుమతి


ఈ సినిమాలో ముద్దు సీన్లు చేయడానికి కరీనా తన భర్త అనుమతి కూడా తీసుకుంది.

సైఫ్ సినిమా వాడే కావడం

సైఫ్ సినిమా వాడే కావడం


సైఫ్ అలీ ఖాన్ కూడా సినిమా రంగానికి చెందిన వాడే కావడంతో ముద్దు సీన్ విషయంలో కరీనాకు ఎలాంటి అభ్యంతరాలు ఎదురు కాలేదు.

బాలీవుడ్లో..

బాలీవుడ్లో..


ప్రస్తుతం బాలీవుడ్లో ముద్దు సీన్లు అనేవి చాలా కామన్ అయిపోయాయి. సైఫ్ కూడా అనేక చిత్రాల్లో ఇతర హీరోయిన్లతో ముద్దు సీన్లు చేసిన సంగతి తెలిసిందే.

స్టుపిడ్ లా ప్రవర్తించను

స్టుపిడ్ లా ప్రవర్తించను


నువ్వు ముద్దు సీన్లో నటిస్తే నేను స్టుపిడ్ లా అడ్డుపడే ప్రయత్నం చేయను అని సైఫ్ కరీనాతో అన్నారట.

బాల్కీ దర్శకత్వం

బాల్కీ దర్శకత్వం


దర్శకుడు బల్కీ తన సినిమాల్లో కుటుంబ బంధాలు, అనుబంధాలను అత్యంత శక్తివంతంగా చూపించగలరు. ఆయన గత చిత్రాల మాదిరిగానే కుటుంబ నేపథ్యంలో 'కి అండ్‌ కా' ప్రత్యేకంగా ఉంటుంది' అని చెబుతోంది కరీనాకపూర్‌.

రిలీజ్ డేట్

రిలీజ్ డేట్


కి అండ్ కా మూవీ ఏప్రిల్ 1న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

సినిమా కాన్సెప్టు

సినిమా కాన్సెప్టు


తెలుగులో వచ్చిన మిస్టర్ పెళ్లాం తరహాలో.... మొగుడు ఇల్లు చూసుకుంటాడు, పెళ్లాం ఉద్యోగం చేస్తుంది అనే కాన్సెప్టుతో ‘కి అండ్ కా' ఉంటుంది.

అంచనాలు భారీగా...

అంచనాలు భారీగా...


సినిమా కాన్సెప్టు డిఫరెంటుగా ఉండటం, ఇటీవల విడుదలైన ట్రైలర్ ఆకట్టుకునే విధంగా ఉండటంతో సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.

ఫ్యామిలీ ఆడియన్స్

ఫ్యామిలీ ఆడియన్స్


ఈ సినిమాకు ఫ్యామిలీ ఆడియన్స్ నుండి మంచి స్పందన వస్తుందని భావిస్తున్నారు.

కి అండ్ కా

కి అండ్ కా


కి అండ్ కా మూవీ ఏప్రిల్ 1న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

English summary
We all know that Kareena Kapoor broke her no kissing policy for Ki And Ka. Recently, Kareena revealed how Saif Ali Khan reacted when she told him about her kissing scenes with Arjun Kapoor.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu