»   » మరో బాహుబలికి సిద్ధమే, కానీ రెండేళ్లే : తేల్చి చెప్పిన ప్రభాస్

మరో బాహుబలికి సిద్ధమే, కానీ రెండేళ్లే : తేల్చి చెప్పిన ప్రభాస్

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాహుబలి ప్రాజెక్టు కోసం ప్రభాస్ తన నాలుగేళ్ల కెరీర్‌ పనంగా పెట్టిన సంగతి తెలిసిందే. బాహుబలి కంటే ముందే ప్రభాస్ తెలుగులో పెద్ద స్టార్. అలాంటి స్టార్ హీరోకు నాలుగేళ్ల సమయం అంటే ఎంత విలువైందో? ఒక్కసారి ఊహించుకోండి.

బాహుబలి సినిమా ఒప్పుకోకుండా ప్రభాస్ వరుసగా సినిమాలు చేసుకుంటూ పోతే సంవత్సరానికి రెండు సినిమాల వేసుకున్నా ఇప్పటికి 8కి పైగా సినిమాలు పూర్తి చేసేవాడు. అలా చేస్తే రెమ్యూనరేషన్ రూపంలో ప్రభాస్ కోట్లు సంపాదించి ఉండేవాడు. అయితే రాజమౌళి దర్శకత్వంలో బాహుబలి ప్రాజెక్టుకు ఓకే చెప్పి చాలా పెద్ద సాహసమే చేశాడు యంగ్ రెబల్ స్టార్.

తగిన ఫలితమే

తగిన ఫలితమే

నాలుగేళ్ల పాటు ప్రభాస్ పడ్డ కష్టానికి, చేసిన త్యాగానికి తగిన ఫలితమే దక్కింది. బాహుబలి వల్లనే ప్రభాస్ నేషనల్ స్టార్ అయ్యాడు. ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఏ నటుడైనా ఇంతకు మించి ఏమి కోరుకుంటాడు?

Bahubali 2 Movie Press Meet Full Video | SS Rajamouli | Prabhas | Rana Daggubati | Telugu Filmibeat
సాహోలో బిజీ బిజీ

సాహోలో బిజీ బిజీ

‘బాహుబలి' తర్వాత ప్రభాస్‌ నటిస్తున్న చిత్రం ‘సాహో'. సుజీత్‌ దర్శకుడు. ఈ చిత్రం షూటింగ్‌ ప్రస్తుతం ముంబయిలో జరుగుతోంది. తాజాగా ప్రభాస్‌ ఓ ఆంగ్లపత్రికతో మాట్లాడుతూ.. ‘బాహుబలి' లాంటి గొప్ప కథతో తన వద్దకు వస్తే ఆ సినిమా కోసం రెండేళ్లు కేటాయించడానికి వెనకాడనని అన్నారు.

మళ్లీ నాలుగేళ్లు కష్టం

మళ్లీ నాలుగేళ్లు కష్టం

‘నాలుగేళ్లు అనేది చాలా ఎక్కువ కాలం. ఓ నటుడికి అది ఎంతో విలువైన సమయం. ‘బాహుబలి' కోసం నేను కేటాయించిన సమయం నాకు చాలా నేర్పింది. ఇప్పుడు మరో సినిమాకు నాలుగేళ్లంటే నా వల్ల కాదు అని ప్రభాస్ అన్నారు.

ఎగ్జైట్ చేస్తే ఆలోచిస్తా..

ఎగ్జైట్ చేస్తే ఆలోచిస్తా..

బాహుబలి సినిమాకు నేను అంత కష్టపడటానికి, ఎక్కువ డేట్స్ కేటాయించడానికి కారణం ఆ సినిమా కథ. అది తనకు ఎంతో నచ్చింది కాబట్టే ఇదంతా చేశాను. బాహుబలిని మించి ఎగ్జైట్ చేసే కథ వస్తే తప్పకుండా మళ్లీ భారీగా డేట్స్ ఇవ్వడానికి సిద్ధమే అని ప్రభాస్ అన్నారు.

English summary
"Four years is a very long time. It is also precious for an actor. The time spent for Baahubali taught me a lot. Four years is way too long for another film, but if the script excites me, I can once again block dates, but only for two years”, Prabhas said.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu