»   » నన్ను క్షమించండీ..! మోసం చేసాను : సంపూ బాబు చెప్పిన నమ్మలేని నిజాలు

నన్ను క్షమించండీ..! మోసం చేసాను : సంపూ బాబు చెప్పిన నమ్మలేని నిజాలు

Posted By:
Subscribe to Filmibeat Telugu

2014 ఏప్రిల్ 4 తేదిన అమృత ప్రోడ‌క్ష‌న్ బ్యాన‌ర్ లో స్టీవెన్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపోంది టాలీవుడ్ లో సంచ‌ల‌నాల‌కు దారి తీసిన చిత్రం హ్రుద‌య‌కాలేయం. ఈ చిత్రం ద్వారా ప్ర‌ముఖ పారిశ్రామిక వేత్త సంపూర్జేష్ బాబు హీరోగా ప‌రిచ‌యం అయ్యి ప్ర‌పంచంలో వున్న తెలుగు ప్రేక్ష‌కులు అందించిన రికార్డుల‌ ప్రేమ‌కు బానిస‌య్యాడు.

బర్నింగ్‌స్టార్‌ సంపూర్ణేష్‌ బాబు

బర్నింగ్‌స్టార్‌ సంపూర్ణేష్‌ బాబు

‘హృదయ కాలేయం' సినిమాతో ఓవర్‌నైట్‌ స్టార్‌ అయిపోయాడు బర్నింగ్‌స్టార్‌ సంపూర్ణేష్‌ బాబు. అసలు.. సినిమాను ఇలా కూడా తీయవచ్చా అని అందర్నీ ఆశ్చర్యపరిచారు సంపూ అండ్‌ బ్యాచ్‌. తెలుగు తెరపై చాలా కొత్తగా కనిపించిన సంపూ గురించి అందరూ ఆరా తీయడం మొదలుపెట్టారు.

తానొక ఎన్నారైనని చెప్పాడు

తానొక ఎన్నారైనని చెప్పాడు

అప్పట్లో ఓ ఇంటర్వ్యూలో తానొక ఎన్నారైనని, సాఫ్ట్వేర్ ఇంజినీర్ గా పని చేసి అక్కడ బాగా సంపాదించి ఇక్కడికి వచ్చి ఆ డబ్బుతోనే సినిమాలు తీస్తున్నానని చెప్పాడు సంపూ. చాలా మంది అప్పట్లో నమ్మేసినా కొందరు మాత్రం అనుమానంగానే చూసారు. అయితే సంపూ ఎక్కడినుంచి వచ్చినా, అంతకు ముందు ఏం చేసినా తమకు అనవసరం అనుకున్నారు ప్రేక్షకులు. సంపూ ని మనస్పూర్థిగా అభిమానించారు.

నిజాలు ఉన్నట్టుగా చెబితే

నిజాలు ఉన్నట్టుగా చెబితే

అయితే అప్పట్లో ఉన్న నిజాలు ఉన్నట్టుగా చెబితే తనకు కనీస గౌరవం కూడా ఇవ్వరన్న విషయం సంపూ కి తెలుసు కాబట్టే తాను ఎన్నారై అని చెప్పి ఉంటాడు. అందుకే ఇన్నాళ్ళకి తనకంటూ ఒక స్థాయి వచ్చాక తాజాగా ఓ యూట్యూబ్‌ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన గురించి నిజాలను వెల్లడించాడు సంపూ.

అసలు పేరు నరసింహాచారి

అసలు పేరు నరసింహాచారి

తన అసలు పేరు నరసింహాచారి అని, సినిమాల్లోకి రాకముందు సిద్ధిపేట్‌లోని బంగారం షాపులో పనిచేసేవాడినని చెప్పాడు. ఇన్నాళ్లూ మోసం చేసినందుకు, అబద్ధం చెప్పినందుకు క్షమించాలని వేడుకున్నాడు. ఓ చెత్త హీరోతో ఓ చెత్త సినిమా తీయాలనే కాన్సెప్ట్‌తో ‘హృదయకాలేయం' సినిమా చేసినట్టు చెప్పాడు.

మొహానికి కర్చీఫ్ కట్టుకుని

మొహానికి కర్చీఫ్ కట్టుకుని

తాను ఇప్పటికీ సిద్ధిపేట్‌లోనే ఉంటానని, షూటింగ్‌లు ఉన్నప్పుడు హైదరాబాద్‌ వస్తుంటానని తెలిపాడు. సినిమాల్లో స్థిరపడిన తర్వాత కూడా చాలాసార్లు మొహానికి కర్చీఫ్ కట్టుకుని ఆర్టీసీ బస్సుల్లో హైదరాబాద్‌ వచ్చానని చెప్పాడు సంపూర్ణేష్‌ బాబు. అప్పుడు ఎవరూ గుర్తు పట్టకుండా అలా వచ్చేవాడట మళ్ళీ షూటింగ్ అయిపోగానే మళ్ళీ బస్ లోనే తిరుగు ప్రయాణం అయ్యేవాడట.

ఇప్పటికీ సైకిల్‌ మీదే తిరుగుతా

ఇప్పటికీ సైకిల్‌ మీదే తిరుగుతా

ఊర్లో ఉంటే ఇప్పటికీ సైకిల్‌ మీదే తిరుగుతానని, సైకిల్‌ మీద మంచినీళ్లు తెచ్చుకుంటానని, పిల్లలను కూడా సైకిల్‌ మీదే స్కూల్‌కు తీసుకెళతానని చెప్పాడు. నిజానికి ఈ విషయాలన్నీ ఇండస్ట్రీ లో ఎప్పటి నుంచో "రూమర్లు" గా చలామనీ లో ఉన్నవే. అయితే ముందే అనుకున్నట్టు సంపూర్నేష్ సినిమాలని చూసే వాళ్ళకి అతని బ్యాక్ గ్రౌండ్ ఏమితీ అన్న విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు....

ఏకైక టాలీవుడ్ హీరో

ఏకైక టాలీవుడ్ హీరో

నిజానికి సంపూ పేద బ్యాక్ గ్రౌండ్ నుంచే రావొచ్చు కానీ అతనికి వచ్చే ఆ తక్కువ మొత్తం రెమ్యునరేషన్ లోనే చాలా సహాయాలు చేసాడు, ఆఖరికి ఆంధ్ర ప్రదేశ్ ప్రత్యేక హోదాకోసం ఆర్కే బీచ్ కి వెళ్ళిన ఏకైక టాలీవుడ్ హీరో సంపూర్ణేష్ బాబు. ఇంతకన్నా ఒక హీరోకి ఇంకా ఏ అర్హత కావాలి? సంపూ గతం, ఆయన ఆర్థిక హోదా లతో సంబందం లేకుండానే ఆయన్ని అభిమానిస్తారు అభిమానులు...

English summary
Burning Star Sampoornesh babu recently revealed his Real Life Secrets in a web interview
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu