twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అక్కినేని మృతికి కారణం క్యాన్సర్ కాదు ...మరేమిటి?

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: తెలుగు సినీ దిగ్గజం అక్కినేని నాగేశ్వరరావు క్యాన్సర్ కారణంగా మరణించారని ఇప్పటి వరకు అంతా అనుకున్నారు. కానీ అక్కినేని మరణానికి కారణం అది కాదని, ఆయన గుండె పోటుతో మరణించారని తాజాగా వెల్లడైంది. నాగేశ్వరరావు కూతురు నాగ సుశీల మాట్లాడుతూ....నాన్నగారు క్యాన్సర్ కారణంగా మరణించారని అంతా అనుకుంటున్నారు. అది వాస్తవం కాదు. ఆయన గుండె పోటు కారణంగా మరణించారు అని తెలిపారు.

    Akkineni Nageswara Rao

    'రాత్రి 10. 30 వరకు ఆయన బాగానే ఉన్నారు. అర్ధరాత్రి దాటాక 2.30 గంటల ప్రాంతంలో ఆయన శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడ్డారు. నిద్రలో గుండె పోటు రావడం వల్లనే ఇలా జరిగిందని వైద్యులు చెప్పారు. మరణించిన తర్వాత ఆయన మృత దేహం కూడా నిద్రపోతున్నట్లెగానే ఉంది' అని ఆమె వెల్లడించారు.

    కొన్ని నెలల క్రితం క్యాన్సర్ బారిన పడ్డ అక్కినేని మీడియా సమావేశం ఏర్పాటు చేసి తకు సోకిన జబ్బు గురించి వెల్లడించిన సంగతి తెలిసిందే. తనకు క్యాన్సర్ ప్రమాదకర స్థితిలో ఏమీ లేదని, ఇంకొంతకాలం జీవిస్తాను, అభిమానుల ఆశీస్సులు ఉంటే సెంచరీ కొడతానంటూ వెల్లడించారు. అక్కినేని ఉత్సాహం చూసి ఆయనకు అప్పుడిప్పుడే ఏమీ కాదనే నమ్మకాని వచ్చారు అభిమానులు.

    క్యాన్సర్ నివారణలో భాగంగా అక్కినేనికి సర్జరీ జరుగడం, సర్జరీ తర్వాత నాన్న బాగానే కోలుకున్నారని నాగార్జున చెప్పడం తెలిసిందే. మధ్య అక్కినేని ఆరోగ్యం క్రిటికల్‌గా ఉందనే వార్తలు వినిపించినా.....అలాంటి దేమీ లేదని, అక్కినేని బాగానే ఉన్నారని నాగార్జుతో పాటు, ఆయన మనవళ్లు కూడా స్టేట్ మెంట్ ఇచ్చారు. అంతలోనే ఘోరం జరిగిపోయింది. అకస్మాత్తుగా అక్కినేని అందరినీ విడిచి అనంత లోకాలకు వెళ్లి పోయారు. కాగా.... సర్జరీ జరుగకుండా ఉండి ఉంటే తమ అభిమాన నటుడు అక్కినేని నాగేశ్వ ఇంకొంతకాలం జీవించి ఉండేవారని, సర్జరీ తర్వాత ఆయన వీక్ కావడం వల్లనే గుండె పోటు వచ్చి ఉంటుందని అభిమానులు అభిప్రాయ పడుతున్నారు.

    English summary
    ANR’s daughter Naga Susheela admitted that, her father died not due to cancer but due to a cardiac arrest which happened when he was asleep. As heart attack occurred during his sleep, even his dead body looked like as he is sleeping, she added.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X