»   » లేటుకు కారణం..గ్రాఫిక్స్ అని చెప్తున్నాడు

లేటుకు కారణం..గ్రాఫిక్స్ అని చెప్తున్నాడు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నిఖిల్ తాజా చిత్రం కార్తికేయ ప్రారంభమై చాలా రోజులు అయ్యింది. అలాగే ఫస్ట్ లుక్ కూడా వచ్చి చాలా కాలం అయ్యింది. దాంతో ఈ చిత్రంపై ఆసక్తి మెల్లిమెల్లిగా సన్నగిల్లుతోంది. ఈ నేపధ్యంలో ఎందుకు ఇంత లేటు అవుతోంది. రిలీజ్ డేట్ ఎందుకు ఎనౌన్స్ చేయటం లేదు అని అందరిలో సందేహం వస్తోంది. దానికి తోడు ...చిత్రానికి బిజినెస్ కావటం లేదని, ఫైనాన్సియల్ ట్రబుల్స్ అని బయిట ప్రచారాలు మొదలయ్యాయి. ఈ నేపధ్యంలో ట్విట్టర్ ద్వారా సినిమా ఎందుకు లేటవుతోందో కారణం వివరించే ప్రయత్నం చేసాడు. అంతేకాక ఈ ఫొటో పెట్టి...ఎప్పుడు రిలీజ్ డేటో ఇంకా చెప్పలేమని అన్నారు.

నిఖిల్ ట్వీట్ చేస్తూ... కార్తికేయ సినిమా తెలుగు,తమిళ భాషల్లో ఒకే సారి రిలీజ్ చేయాలనుకోవటం,గ్రాఫిక్స్ తో డబుల్ టైమ్ పోస్ట్ ప్రొడక్షన్ లో పడుతోంది. ఇది నా తొలి గ్రాఫిక్స్ మరియు ద్విభాషా చిత్రం. ఇంత సమయం పోస్ట్ ప్రొడక్షన్ లో పట్టడజం నాకు మొదటి సారి. అయితే మంచి వార్త ఏమిటంటే...ఇప్పటికి దాదాపు 99% పోస్ట్ ప్రొడక్షన్ పూర్తైంది. త్వరలోనే రిలీజ్ డేట్ ప్రకటిస్తాము అన్నారు.

Reason behind Karthikeya Movie delayed

గతేడాది ప్రేక్షకుల ముందుకొచ్చిన 'స్వామి రా రా'తో విజయాల బాట పట్టాడు నిఖిల్‌. ఇటీవల వైవిధ్యమైన కథల్ని ఎంచుకొంటూ ప్రయాణం చేస్తున్నాడు. నిఖిల్, స్వాతి ల కార్తికేయ సినిమా షూటింగ్ చివరిదశలో వుంది. ప్యాచ్ వర్కులతొ సహా ఈ సినిమా షూటింగ్ ను త్వరలో ముగించానున్నారు. చందూ మొందేటి దర్శకుడిగా పరిచయంకానున్నాడు. మాగ్నమ్ సినిమా ప్రైమ్ బ్యానర్ పై వెంకట్ శ్రీనివాస్ ప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.

దేవాలయం నేపధ్యంలో వరుస మరణాల మిస్టరీ ని చేదించడానికి నిఖిల్ ఒక గ్రామానికి వెళ్తాడు. ఈ సినిమా ట్రైలర్ కు మంచి స్పందన వచ్చింది. ఈ చిత్రం తమిళ, తెలుగు భాషలలో విడుదలకానుంది. నిఖిల్ సిద్ధార్ధ, స్వాతీ తమ గత చిత్రం 'స్వామి రారా' విజయంతో చాలా ఆనందంగా వున్నారు. మరోసారి ఆ మ్యాజిక్ ను తెరపై ప్రదర్శించాలని కోరుకుంటున్నారు.

ఈ చిత్రం గురించి నిఖిల్ మాట్లాడుతూ.... ఇది ఎంటర్ టైన్మెంట్ బేస్ గా ఉంటుంది, ముఖ్యంగా సామర్లకోట దగ్గరలోని బెమ్మేశ్వరాలయం చుట్టూ జరిగే కథ ఇది. అన్ని కమర్షియల్ అంశాలు ఉన్న ఈ చిత్రం నాకు స్వామి రా రా తరువాత మంచి హిట్ ఇస్తుందన్న నమ్మకం ఉంది అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ...పూర్తి వినోదాత్మకంగా సినిమా సాగుతుంది. వైజాగ్, అరకు, సామర్ల కోటలోని భీమేశ్వరాలయంలో షూటింగ్ చేసాం. గుడి నేపథ్యంలో సాగే కథ ఇది. అయితే హిస్టారికల్, పీరియాడికల్ మాత్రం కాదు అని తెలిపారు.

ఈ చిత్రంలో ముఖ్య పాత్రల్లో తనికెళ్ల భరణి, రావు రమేష్, శ్రీనివాస్ రెడ్డి, తులసి, కిషోర్, జోగి నాయుడు, తాగుబోతు రమేష్, పృథ్వి, గౌతం రాజు, శివన్నారాయణ, స్వామి రారా సత్య, గిరి తదితరులు నటిస్తున్నారు. కెమెరా : కార్తిక్, సంగీతం : శేఖర్ చంద్ర, ఎడిటింగ్ : కార్తిక శ్రీనివాస్, ఆర్ట్ : సాహి సురేష్, పాటలు : కృష్ణ చైతన్య, కొరియోగ్రఫీ : రఘు, ఫైట్స్ : వెంకట్ నాగు, సమర్పణ : శిరువూరి రాజేష్ వర్మ, నిర్మాత : వెంకట శ్రీనివాస్ బొగ్గరం, కథ-స్ర్కీన్ ప్లే-దర్శకత్వం : చందు మొండేటి.

English summary
Nikhil tweeted: Karthikeya havin quiet a Lot of Graphics nd being a Bi-lingual with a same day Tamil-Telugu release has caused Double Time 4 Post-Production. This is my 1st CG loaded film as well as my 1st Bilingual Film.. hence this time taken for Post-Production is New to me :-)But the good news 4 our team is that we r 99% done with the post production nd looking 4 a suitable date to release :-) will announce soon..
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu