»   » పవన్-దాసరి కాంబినేషన్ వెనక..ఒకే ఒక్క ఫోన్ కాల్!

పవన్-దాసరి కాంబినేషన్ వెనక..ఒకే ఒక్క ఫోన్ కాల్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ప్రస్తుతం టాలీవుడ్లో లీడింగ్ హీరో. ఆయన సినిమాలో ఉంటే చాలు సినిమాకు కలెక్షన్ల వర్షం. ఆయనతో సినిమా చేయడానికి చాలా మంది నిర్మాతలు క్యూలో ఉన్నారు. అయితే ఆ అవకాశం దక్కేది మాత్రం కొందరికే. అయితే దాసరి విషయంలో మాత్రం అలా జరుగలేదు. కేవలం ఒకే ఒక్క ఫోన్ కాల్ తో పవన్ కళ్యాణ్ ఓకే చెప్పారట. దాసరిపై పవన్ కళ్యాణ్‍‌కు ఉన్న గౌరవమే ఈ సినిమా ఒప్పుకోవడానికి కారణమని అంటున్నారు. ఏది ఏమైతేనేం...టాలీవుడ్లో ఓ రేర్ కాంబినేషన్ తెరకెక్కుతోంది. ఇదో సెన్సేషన్ సినిమా అవుతుందని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నారు.

గతంలో పవన్ కళ్యాణ్ ...తన స్వీయ దర్శకత్వంలో జానీ చిత్రం రూపొందించిన సంగతి తెలిసిందే. ఆ చిత్రం పరాజయంతో ఆ తర్వాత మళ్లీ మెగాఫోన్ పట్టుకోలేదు. అయితే ఇప్పుడు మరోసారి స్వయంగా డైరక్షన్ కు పూనుకోనున్నట్లు తెలుస్తోంది. దాసరి నిర్మించే చిత్రం కోసం పవన్ తిరిగి డైరక్షన్ చేయనున్నారని చెప్పుకుంటున్నారు. అందుకోసం ఆయన గతంలో తాను వర్కవుట్ చేసిన సత్యాగ్రహి స్క్రిప్టుని తీసుకోనున్నట్లు చెప్పుకుంటున్నారు. మరో వైపు ఈ చిత్రానికి పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించే అవకాశం ఉందనే వార్తలు సైతం ప్రచారంలో ఉన్నాయి. ఇందులో నిజా నిజాలు తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.

Reason Behind Pawan kalyan Accepted Dasari Request

ఈ చిత్రం తారక ప్రభు ఫిలిమ్స్‌ పతాకంపై దాసరి నిర్మిస్తున్న 37వ సినిమా. దర్శకరత్న దాసరి నారాయణరావు - పవన్‌ కల్యాణ్‌ కలసి ఓ సినిమా చేస్తున్నారనే వార్త సోమవారం సాయింత్రం అందరినీ ఆశ్చర్యంలో పడేసింది. అది రూమర్ అని కొట్టిపారేసే లోగా దానిని ఖరారు చేస్తూ సోషల్ నెట్ వర్కింగ్ సైట్ లో ...దాసరి ఈ విషయాన్ని ఖరారు చేస్తూ పోస్ట్ చేసారు. నా నెక్ట్స్ డైరక్షనల్ ప్రాజెక్టు పవన్ కళ్యాణ్‌తో అని రాసారు. ఇది అభిమానులలో కలకలం పుట్టించింది. దాసరి దర్శకత్వంలో పవన్ సినిమా ఏంటని కంగు తిన్నారు. అయితే ఈ విషయం గమనించినట్లున్నారు...మరి కాస్సేపటికి దాన్ని ఎడిట్ చేస్తూ...నా నెక్ట్స్ ప్రాజెక్టు నిర్మాతగా పవర్ స్టార్ తో అని మార్పు చేసి మళ్లీ పోస్టు చేసారు.

English summary
In a rarest of the rare combinations we have ever seen, Powerstar Pawan Kalyan and veteran director Dasari Narayana Rao are joining hands for a movie.
Please Wait while comments are loading...