»   » అలా 13 కేజీలు తగ్గా : హన్సిక

అలా 13 కేజీలు తగ్గా : హన్సిక

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : మొన్నటిదాకా హన్సికని బొద్దుగుమ్మ అన్నారు.. ఇప్పుడు మాత్రం అలా అనడానికి వీల్లేదు. ఎందుకంటే... కందిరీగ నడుముతో సన్నగా తయారైంది. కష్టపడి తయారు చేసుకొన్న ఈ సరికొత్త రూపం ఆమెకి బాగానే కలిసొచ్చిందని చిత్రసీమలో చెప్పుకొంటున్నారు. ఇటీవల హన్సికకి మరిన్ని అవకాశాలు వస్తున్నాయట. దర్శకులు కొత్త కథలు వినిపిస్తామంటూ వెంటపడుతున్నారట. వరస ఆఫర్స్ తో ఆమె ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఇన్నాళ్ళూ బొద్దు పాపలాగ ఉందని ప్రక్కన పెట్టినవాళ్లంతా సై అంటూ ముందుకు దూకుతున్నారు. ఇంతకీ హన్సిక ఎలా సన్నబడింది అనేది పెద్ద కథ అంటోంది.

hansika

తమిళనాట చిన్న కుష్బూగా పేరు తెచ్చుకున్న హన్సిక... ఇటీవల 13 కేజీల బరువు తగ్గి మరింత నాజూగ్గా మారడానికి ప్రయత్నాలు చేస్తోంది. ఈ మార్పు వెనక కారణాలేమిటా అని చాలామంది అమ్మాయిలు తలలు పట్టుకుంటున్నారట. ఇదే విషయాన్ని హన్సిక దగ్గర ప్రస్తావిస్తే... ఆమె చెప్పే కారణాలు విని షాక్ అవుతున్నారు.

హన్సిక మాట్లాడుతూ... ''నేను బరువు తగ్గడానికి కారణాలు చెప్తే.. అందరూ నవ్వుతారు. నా పద్ధతిని ఎవరూ అవలంబించరు అంటేనే చెప్తాను. నేను కసరత్తులు చేసో... యోగా వల్లో, శస్త్రచికిత్సల వల్లో బరువు తగ్గలేదు. రోజూ సరిగ్గా భోజనం చేయక, నిద్రపోక ఇలా అయ్యాను. అవును.. ఈ మధ్య నిద్రపోవడానికి ఐదు గంటలు కూడా దొరకడం లేదు. చిత్రీకరణ మధ్య ఖాళీ సమయాల్లో నిద్రపోయేదాన్ని. కథలు వినడం, డిజైనర్లతో మాటలు, మధ్య మధ్యలో ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి. దీంతో బరువు తగ్గి సన్నబడ్డాను'' అని చెప్పుకొచ్చింది .


హన్సిక మాట్లాడుతూ ''అవును, నేను రోజూ అయిదారు కథల్ని వింటున్నాను. వాటిలో నచ్చిన కథల్ని మాత్రమే ఎంచుకొంటున్నా. కథల ఎంపికలో పరిణతి ప్రదర్శిస్తున్నా. గతంతో పోలిస్తే... తక్కువ తప్పులు చేస్తున్నాను. చేస్తున్న చాలా చిత్రాలు మంచి ఫలితాల్ని తెస్తున్నాయి''అని చెప్పుకొచ్చింది. అయితే సన్నబడటం వల్లే ఆఫర్స్ వస్తున్నాయట కదా? అని అడిగితే... ''అది పూర్తిగా అబద్ధం. బొద్దుగా ఉన్నప్పుడు బోలెడన్ని సినిమాలు చేశాను. ఇలా నాజూగ్గా తయారయ్యాక కూడా సినిమాలు చేస్తున్నా. బరువు నాకు ఎప్పుడూ సమస్య కాలేదు'' అని చెప్పుకొచ్చింది.

English summary

 
 Hansika had become slim so suddenly. She is getting many opportunities in the Telugu film industries these days and notably, she had signed the dotted lines for three films. One with Raviteja, another with Naga Chaitanya and one more with Manchu Vishnu. 
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu