»   » రామ్ చరణ్ మూవీ: అందుకే తమన్‌ను తప్పించారా?

రామ్ చరణ్ మూవీ: అందుకే తమన్‌ను తప్పించారా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రామ్ చరణ్, కృష్ణ వంశీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న 'గోవిందుడు అందరి వాడేలే' చిత్రంలో తొలుత తమన్‌ను సంగీత దర్శకుడిగా ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. అయితే ఉన్నట్టుండి అతన్ని తప్పించి యువన్ శంకర్ రాజాను తీసుకున్నారు. ఈ మార్పుకు కారణం ఏమిటనే విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది.

తమన్ సంగీతం అందించిన సినిమాలన్నింటిలోనూ ఈ మధ్య ట్యూన్స్ ఓకే రకంగా ఉంటున్నాయి. అయితే తనకు ఇలా వద్దని, డిఫరెంటు ట్యూన్స్ ఉండే ఫ్యామిలీ సాంగ్స్ కావాలని కృష్ణ వంశీ అడిగారట. అలా కుదరదని, తాను ఇచ్చిన ట్యూన్సే తీసుకోవాలని తమన్ చెప్పడంతో...అతన్ని తప్పించినట్లు తెలుస్తోంది.

Reason behind Thaman's exit for GAV

'గోవిందుడు అందరి వాడేలే' రామ్ చరణ్, కాజల్ జంటగా నటిస్తున్నారు. శివబాబు బండ్ల సమర్పణలో, పరమేశ్వర ఆర్ట్స్ ప్రొడక్షన్స్ పతాకంపై అత్యంత భారీ తారాగణంతో నిర్మిస్తున్న చిత్రం యూనిట్ కన్యాకుమారి, పొలాచ్చి షెడ్యూల్ పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరారు.

ఏప్రిల్ 21 నుండి హైదరాబాద్‌లో రామానాయుడు సినీ విలేజ్ లోని హౌస్ సెట్‌లో ప్రధాన తారాగణం అంతా నటించే భారీ షెడ్యూల్ దాదాపు 40 రోజులు జరుగుతుంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, కాజల్ జంటగా వస్తున్న ఈ చిత్రానికి 'గోవిందుడు అందరి వాడేలే' అనే టైటిల్ ఖరారు చేయడంతో అభిమానులతో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌లో భారీగా అంచనాలు పెరిగాయి.

English summary
The exit of SS Thaman from Govindhudu Andari Vaadele is confirmed and Yuvan Shankar Raja entered in to his shoes. Here is why Thaman is kicked out of the project. Differences arose between Krishna Vamsi and Thaman in two aspects. KV wants a different version of a family song scored by Thaman for which the music director refused bluntly.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu