For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  2.0 వాయిదా: రాజమౌళి విషయంలో అలా, పరువుపోకూడదనే శంకర్ ఇలా?

  By Bojja Kumar
  |
  2.0 వాయిదా.. పరువుపోకూడదనే శంకర్ ఇలా?

  సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం '2.0' సంక్రాంతి తర్వాత విడుదలవ్వాల్సి ఉండగా వాయిదా పడినట్లు రెండు మూడు రోజులుగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. చిత్ర యూనిట్ నుండి ఈ విషయమై అఫీషియల్ సమాచారం లేనప్పటికీ.... వాయిదా విషయం మాత్రం నిజం.

  ఈ చిత్రాన్ని తమిళ న్యూఇయర్ సందర్భాన్ని పురస్కరించుకుని ఏప్రిల్ 13, 2018న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అయితే సినిమా వాయిదా వెనక్ కారణం ఏమిటి అనేది తాజాగా వెలుగులోకి వచ్చింది. సినిమా ఫైనల్ ఔట్ పుట్ చూసిన తర్వాత శంకర్ కొన్ని విషయాల్లో అసంతృప్తిగా ఉన్నాడని, కొన్ని సీన్లలో కరెక్షన్స్ చేసేందుకు సంక్రాంతి వరకు ఉన్న సమయం చాలక పోవడం వల్లనే సినిమాను వాయిదా వేసినట్లు తెలుస్తోంది.

  మూడేళ్లుగా కష్టపడుతున్న శంకర్

  మూడేళ్లుగా కష్టపడుతున్న శంకర్

  2.0 సినిమా కోసం దర్శకుడు శంకర్ దాదాపు మూడేళ్లుగా కష్టపడుతున్నారు. 2015 జనవరి లో ఆయన దర్శకత్వంలో వచ్చిన ‘ఐ' మూవీ విడుదల తర్వాత తన పూర్తి సమయాన్ని ‘2.0' సినిమా కోసమే కేటాయించారు. సినిమాలోని ప్రతి చిన్న విషయాన్ని ఎంతో కేర్‌తో టేకప్ చేస్తూ వచ్చారు.

   శంకర్ సినిమాలు అంటేనే భారీతనం, పర్‌ఫెక్ట్‌నెస్

  శంకర్ సినిమాలు అంటేనే భారీతనం, పర్‌ఫెక్ట్‌నెస్

  ఇండియాలో శంకర్‌కు ఒక ప్రత్యేకమైన పేరుంది. ఆయన సినిమాలు మన భారతీయ సినిమా రేంజిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లే విధంగా ఉంటాయి. దాంటో పాటు ఇప్పటి వరకు ఆయన సినిమాల్లో గ్రాఫిక్స్ వర్క్‌ విషయంలో చాలా పర్‌ఫెక్ట్ గా హ్యాండిల్ చేస్తూ వస్తారు.

  2.0 ఫైనల్ ఔట్ పుట్ విషయంలో అసంతృప్తి

  2.0 ఫైనల్ ఔట్ పుట్ విషయంలో అసంతృప్తి

  రోబో 2.0 దుబాయ్ ఆడియో ఈవెంటుకు ముందే శంకర్ అండ్ టీం ఫైనల్ ఔట్ పుట్ చూశారు. అయితే సినిమాలో ఎక్కువ శాతం గ్రాఫిక్స్, సీజీ వర్క్ ఉంది. అందులోని కొన్ని ఎపిసోడ్స్ శంకర్‌కు సంతృప్తి ఇవ్వ లేదని, ఆయా సీన్లను రీ కరెక్షన్ కోసం పంపారని సమాచారం.

   గతంలో రాజమౌళి బాహుబలి విషయంలో అలా

  గతంలో రాజమౌళి బాహుబలి విషయంలో అలా

  గతంలో 2015లో రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘బాహుబలి-ది బిగినింగ్' విడుదలైన తర్వాత సినిమాలోని గ్రాఫిక్స్ విషయంలో కొన్ని విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. అలాంటి విమర్శలు ‘2.0' సినిమా విషయంలో రాకూడదనే ఉద్దేశ్యంతోనే దర్శకుడు శంకర్ రీ కరెక్షన్ కోసం పంపినట్లు తెలుస్తోంది.

   ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి పరువు పోగొట్టుకోవడం ఎందుకు?

  ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి పరువు పోగొట్టుకోవడం ఎందుకు?

  ‘2.0' మూవీ ఇండియాలోనే హై బడ్జెట్ మూవీ. దాదాపు రూ. 450 కోట్లు ఈ సినిమా కోసం ఖర్చు పెడుతున్నారు. ఇంత ఖర్చు పెట్టి తీసిన సినిమాలో తప్పులు వెతికి అవహేళన చేసేందుకు చాలా మంది సిద్ధంగా ఉంటారు. ఇంత ఖర్చు పెట్టి అలాంటి మాటలు పడటం ఎందుకు? అనే ఉద్దేశ్యంతోనే సినిమా విడుదల కాస్త ఆలస్యమైనా మంచిదే.... పర్‌ఫెక్ట్ మూవీ ప్రేక్షకులకు చూపించాలనేది ఉద్దేశ్యంలో శంకర్ ఉన్నారట.

   శంకర్ అంటే ఒక బ్రాండ్

  శంకర్ అంటే ఒక బ్రాండ్

  ఇప్పటి వరకు ఇండియాలో శంకర్ సినిమాలకు ఒక బ్రాండ్ నేమ్ ఉంది. మరి 2.0 సినిమాతో శంకర్ తన బ్రాండ్ నేమ్ ఏ మేరకు విస్తరిస్తాడో? ఇంటర్నేషనల్ స్థాయిలో ‘2.0' మూవీ ఉంటుందా? లేదా? అనేది వేచి చూడాలి.

   అక్షయ్ ద్వారా బాలీవుడ్లో భారీగా మార్కెటింగ్

  అక్షయ్ ద్వారా బాలీవుడ్లో భారీగా మార్కెటింగ్

  ‘2.0' మూవీలో బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ విలన్ పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆయన ద్వారా ఈ సినిమాకు ఉత్తరాదిన భారీ కలెక్షన్స్ రాబట్టాలనేది ప్రధాన ఉద్దేశ్యం. ఈ సినిమా బాహుబలి రికార్డులతో పాటు ఇతర బాలీవుడ్ సినిమాల రికార్డులను ఏ మేరకు బద్దలు కొడుతుందో చూడాలి.

  English summary
  Shankar's 2.0 release has been pushed to summer next year. Though the makers have not issued things officially, a source from the movie unit confirmed the news. There has been huge delay in the CG work and Shankar is said to have not been happy with some of the CG episodes which have been sent for re-correction. The movie will now hit the screens on April 13th 2018 during Tamil New Year.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X