For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  పెద్దలకు మాత్రమే...ప్రభాస్ 'రెబల్'

  By Srikanya
  |

  హైదరాబాద్ : ప్రభాస్ తాజా చిత్రం 'రెబల్' . ఈ నెల 28 వ తేదీన విడుదల అవుతున్న ఈ చిత్రం సెన్సార్ పార్మాలిటీస్ పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి సెన్సార్ A సర్టిఫికేట్ ఇచ్చారు. హింసాత్మక యాక్షన్ సీక్వెన్స్ లు ఉండటంతో సెన్సార్ ఈ నిర్ణయానికి వచ్చి A సర్టిఫికేట్ ఇచ్చినట్లు చెప్తున్నారు. ఈ చిత్రం పూర్తి మాస్ మసాలా ఎంటర్టైన్మెంట్ గా రూపొందింది. రాఘవ లారెన్స్ స్వయంగా అందించిన ఈ చిత్రం సంగీతం ఇప్పటికే ప్రభాస్ అభిమానులును ఆకట్టుకుంటోంది. అలాగే ఈ చిత్రం పోస్టర్స్,టీజర్స్ సినిమాపై ఆసక్తిని రేపాయి. ప్రభాస్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ గా చెప్పబడుతున్న ఈ చిత్రంపై చాలా అంచనాలు ఉన్నాయి. వరసగా లవ్ స్టోరీలు చేస్తున్న ప్రభాస్ ఈ చిత్రంతో ఛత్రపతి రేంజిలో తన అభిమానులను అలరిస్తానని చెప్తున్నారు.

  శత్రువులను వేటాడే పనిలో ఉన్న ఆ కుర్రాడు ఒక్కసారిగా 'చెప్పలేని ఆనందం... గుప్పుమంది గుండెలోన...' అంటూ పాట అందుకున్నాడు. అందుకు కారణం ఓ అందాల భామ. ఒక్క పిడి గుద్దుతో ఎదుటివాడిని నేలకూల్చే ఆ యువకుణ్ని ఆకట్టుకొన్న సుందరాంగి ఎవరు? వాళ్ల ప్రేమాయణం ఏ తీరం చేరిందో 'రెబల్‌' చిత్రంలో చూడాల్సిందే. ప్రభాస్‌ హీరోగా నటించిన చిత్రమిది. తమన్నా, దీక్షాసేథ్‌ హీరోయిన్స్ . ఈ నెల 28న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.

  దర్శకుడు రాఘవ లారెన్స్‌ మాట్లాడుతూ ''ప్రభాస్‌ కుటుంబానికి అభిమానులు ఇచ్చిన బిరుదు 'రెబల్‌'. దాన్ని నిలిపేలా ఈ కథ ఉంటుంది. యాక్షన్‌ అంశాలు పుష్కలంగా ఉంటాయి. ప్రేమ, వినోదం సమపాళ్లలో ఉంటాయని'' అన్నారు. 'రెబల్' అనే టైటిల్ మాత్రమే కాదు. కథ కూడా ప్రభాస్ కోసమే అన్నట్టుగా ఉంటుంది. ప్రభాస్ కెరీర్‌లో మాస్ ప్రేక్షకులను ఎక్కువగా ఆకట్టుకున్న సినిమా 'ఛత్రపతి'. ఆ సినిమాను మించే స్థాయిలో మా 'రెబల్' ఉంటుంది అన్నారు.

  నిర్మాతలు జె.భగవాన్, జె.పుల్లారావు మాట్లాడుతూ -''డార్లింగ్, మిస్టర్ పర్‌ఫెక్ట్ లాంటి విజయాల తర్వాత వస్తున్న ప్రభాస్ సినిమా ఇది. తప్పకుండా ఈ సినిమా ప్రభాస్‌కి హ్యాట్రిక్ హిట్‌గా నిలుస్తుంది. తమన్నా, దీక్షాసేథ్ గ్లామర్ ఈ చిత్రానికి అదనపు ఆకర్షణ. ఏ విషయంలోనూ రాజీ పడకుండా లారెన్స్ అద్భుతంగా ఈ సినిమాను తీర్చిదిద్దారు. ప్రభాస్ కెరీర్‌లోనే 'రెబల్' హై బడ్జెట్ ఫిలిం అవుతుంది'' అని చెప్పారు.

  ప్రభాస్ సరసన తమన్నా, దీక్షాసేథ్ నటిస్తున్న ఈచిత్రంలో రెబల్ స్టార్ కృష్ణం రాజు ఓప్రత్యేక పాత్ర పోషిస్తున్నారు. ముఖేష్ రుషి, బ్రహ్మానందం, అలీ, ఎంఎస్ నారాయణ, ప్రభ, హేమ, సన, రజిత, ముంబయి విలన్స్ శంకర్, విశాల్, ఆకాష్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి మాటలు: డార్లింగ్ స్వామి, ఫోటో గ్రఫీ: సి. రాంప్రసాద్, ఎడిటింగ్: మార్తాండ్ కె. వెంకటేష్, ఫైట్స్: రామ్ లక్ష్మణ్, ఆర్ట్: ఎ.ఎస్. ప్రకాష్, ప్రొడక్షన్ కంట్రోలర్: బెజవాడ కోటేశ్వరరావు, కో-డైరెక్టర్స్: బుజ్జి, కిరణ్, నిర్మాతలు: జె. భగవాన్, జె. పుల్లరావు, కథ-స్ర్కీన్ ప్లే-కొరియోగ్రఫీ-సంగీతం-దర్శకత్వం: రాఘవ లారెన్స్.

  English summary
  Prabhas's Rebel completed its formalities with Censor Board. Regional Censor Board cleared the film and it was awarded with A Certificate for its violent action sequences. Starring Prabhas, Tamannah and Deeksha Seth, Rebel is an action entertainer with dose of glamour. Raghava Lawrence has directed the movie. Rebel is set for grand release on September 28th.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X