»   » మిస్టర్ ఫర్ ఫెక్ట్ లా మళ్ళీ ఇద్దరు చార్మింగ్ బ్యూటీస్ తో ప్రభాస్ రెబల్...!

మిస్టర్ ఫర్ ఫెక్ట్ లా మళ్ళీ ఇద్దరు చార్మింగ్ బ్యూటీస్ తో ప్రభాస్ రెబల్...!

Posted By:
Subscribe to Filmibeat Telugu

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా దర్శకుడిగా మారిన కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'రెబెల్'. ఇటివలే ప్రారంభమైన ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ ఏప్రిల్ 28 నుండి హైదరాబాద్ లో జరగనుంది. అనుష్క, దీక్షా సేథ్ ప్రభాస్ సరసన కదానాయికలుగా నటిస్తున్నారు.

గతంలో గోపీచంద్ తో 'శంఖం' నిర్మించిన జె.భగవాన్, జె.పుల్లారావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రభాస్ కెరీర్ లోనే అత్యంత బడ్జెట్ సినిమాగా తెరకెక్కుతున్న రెబల్ చిత్రాన్ని లారెన్స్ ప్రతిస్తాత్మకంగా రూపొందించానున్నాడు. తొలిసారి ప్రభాస్ చిత్రానికి తమన్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. మిస్టర్ పెర్ఫెక్ట్ తో ఫ్యామిలీ ఆడియన్స్ ను అలరించిన ప్రభాస్ పూర్తిస్థాయి యాక్షన్ సినిమాగా వస్తున్న ఈ చిత్రంలో కొత్తగా కనిపించనున్నాడని తెలుస్తుంది. యంగ్‌రెబల్‌స్టార్‌ ప్రభాస్‌, అనుష్క జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో బ్రహ్మానందం, ముఖేష్‌రుషి, కెల్లీ డార్జ్‌, షాయాజీ షిండే, ఆలీ, ఎస్‌నారాయణ, చలపతిరావు, జయప్రకాష్‌రెడ్డి, సుప్రీత్‌, జీవా తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

English summary
Prabhas, who has received his first success of the Year, in the form of Mr.Perfect is all set to kick-start the regular shoot of his next film Rebel from 28th April in Hyderabad. Rebel is touted as a high voltage mass entertainer with ample action in the film. Prabhas will pair up with two sizzling actresses Anushka Shetty and Deeksha Seth in the movie.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu