For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  కృష్ణంరాజు దర్శకత్వానికి రంగం సిద్దం.. పూర్తి డిటేల్స్

  By Srikanya
  |
  హైదరాబాద్: ఒకప్పటి యాంగ్రీయంగ్ మెన్ హీరో... కృష్ణంరాజు త్వరలో మెగాఫోన్ చేతపట్టబోతున్నారు. ఆయన దర్శకత్వంలో ఓ సెన్సేషనల్ ప్రాజెక్ట్‌కు సన్నాహాలు జరుగుతున్నాయి. కృష్ణంరాజు దీన్ని తన డ్రీమ్ ప్రాజెక్టుగా తీర్చిదిద్దబోతున్నారు. యూత్ పాలిటిక్స్ నేపథ్యంలో ఆయన ఇప్పటికే కథను సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. చాలా కాలంగా ఆయన ఈ కథపై కసరత్తులు చేస్తున్నారు.

  ఇక కృష్ణంరాజు సొంత నిర్మాణ సంస్థ 'గోపీకృష్ణా మూవీస్'లోనే ఈ చిత్రం రూపొందనున్నట్లు సమాచారం. ఈ సినిమా కోసం 'ఒక్క అడుగు' అనే టైటిల్‌ని ఫిలిం చాంబర్‌లో రిజిస్టర్ చేశారు. 'ఛత్రపతి' సినిమాలో ప్రభాస్ 'ఒక్క అడుగు' అంటూ చెప్పిన పవర్‌ఫుల్ డైలాగ్ బాగా పాపులరైన విషయం తెలిసిందే. ప్రస్తుతం తారాగణం ఎంపికలో కృష్ణంరాజు నిమగ్నమై ఉన్నారు. పూర్తి వివరాలు త్వరలోనే అధికారికంగా తెలుస్తాయి.

  ఆయన ఇదే విషయంపై మాట్లాడుతూ...ఇప్పటివరకూ హీరోగా 150కు పైగా సినిమాలు చేశాను. నిర్మాతగా ఎన్నో విలువైన చిత్రాలు నిర్మించాను. కేంద్రమంత్రిగా పదిహేను నెలలు సేవలందించాను. ఈ మూడు విభాగాల్లోనూ నా పాత్రను సంతృప్తికరంగా పోషించాను. ఇక మిగిలింది దర్శకత్వం. త్వరలో ఆ పని కూడా పూర్తి చేస్తాను అన్నారు డా.కృష్ణం రాజు. ఇకపై కూడా ఇదే రీతిలో తమ సంస్థ ప్రతిష్ఠను ఇనుమడింపజేసే విధంగా మంచి చిత్రాలు నిర్మిస్తాను అన్నారు.

  అలాగే ఆదివారాలు కూడా విశ్రాంతి తీసుకోకుండా రాత్రింబవళ్లు పని చేస్తూ ఏడాదికి ఏడెనిమిది సినిమాలు చేసేవాణ్ని. కొన్ని నా ఇమేజ్‌ను పెంచుకోవడం కోసం చేస్తే, మరికొన్ని పరిశ్రమ బాగు కోసం చేశాను. మనం ఒక సినిమా చేస్తే కొన్ని వందల కుటుంబాలకు పని దొరుకుతుంది. నేను చేసిన సినిమా టీవీలో చూస్తుంటే చాలా ఆనందం కలుగుతోంది. ఇన్ని గొప్ప సినిమాలు చేశానా...అని మనసు పులకించి పోతోంది. ఇప్పట్లోలాగా కథల కోసం ఏళ్ల తరబడి ఎదురు చూసింది లేదు. సినిమా చేయడానికి నెల రోజుల ముందు కథ వినేవాణ్ని అంతే. ఒకే ఒక్క సినిమా మాత్రం కథ వినకుండా ఆ దర్శకుడి మీద నమ్మకంతో చేశాను. అదే 'కటకటాల రుద్రయ్య'..అంటూ చెప్పుకొచ్చారు. ఆయన దర్శకత్వం చేయబోయే చిత్రం కూడా హిట్టు కావాలని కోరుకుందాం.

  English summary
  Krishnam Raju will soon be wielding mega phone. All preparations are on for a sensational project in his direction. Sources say this is Krishnam Raju's dream project and he already readied a powerful script on youth politics. He has been working for quite some time on the script. Film will be made on his own banner Gopi Krishna Movies and he already registered a title 'Okka Adugu' with film chamber. One may remember the popular dialogue of Prabhas 'Okka Adugu' in ‘Chatrapathi’. Currently Krishnam Raju is finalizing star cast for the film.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X