»   » నిజంగానే కబాలి మానియాలా ఊపేస్తోంది.... శాటిలైట్లో కూడా కబాలినే.....

నిజంగానే కబాలి మానియాలా ఊపేస్తోంది.... శాటిలైట్లో కూడా కబాలినే.....

Posted By:
Subscribe to Filmibeat Telugu

కబాలి అదరగొడుతోంది. ఆ బిజినెస్ చూసి పరిశ్రమ కూడా షాక్ కు గురవుతోంది. దేశమంతటా ఇప్పుడు కబాలి జపం నడుస్తోంది. రజనీకాంత్ హీరోగా పా రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా కోసం మనదేశంలోని అభిమానులే కాదు.. ఇతర దేశాల్లోని సినీ అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురు చూసారు.

ఈ సినిమాకు సౌత్ ఇండియాలో మరే సినిమాకూ అవ్వని స్థాయిలో ఏకంగా రూ.220 కోట్ల దాకా బిజినెస్ అయిన సంగతి తెలిసిందే. ఇందులో శాటిలైట్-ఆడియో రైట్స్ మాత్రమే రూ.40 కోట్లు కావడం విశేషం. జయ టీవీ 'కబాలి' శాటిలైట్ హక్కుల్ని రూ.30 కోట్లకు పైనే పెట్టి సొంతం చేసుకుంది. ఇది సౌత్ ఇండియన్ సినిమాల్లో రికార్డు. ఇటు తెలుగులో సైతం శాటిలైట్ విషయంలో రికార్డు రేటు పలికింది 'కబాలి'. ఈ చిత్ర శాటిలైట్ హక్కుల్ని 8 కోట్ల రూపాయలకు ఓ ప్రముఖ ఛానెల్ సొంతం చేసుకుందట.


Record Price For Kabali Satellite Rights

తెలుగులో స్టార్ హీరోల డైరెక్ట్ సినిమాలు మాత్రమే ఈ స్థాయిలో రేటు పలుకుతుంటాయి. అందులోనూ ఈ మధ్య తెలుగులో శాటిలైట్ బిజినెస్ డల్లుగా ఉంది. నిర్మాతలే ఛానెళ్ల వెంట పడుతున్నాయి తప్ప.. ఒకప్పట్లా నిర్మాతలు డిమాండింగ్ పొజిషన్లో లేరు. ఇలాంటి తరుణంలో ఓ తమిళ అనువాద చిత్రానికి రూ.8 కోట్ల ఫ్యాన్సీ రేట్ పెట్టి శాటిలైట్ రైట్స్ తీసుకోవడం అంటే మామూలు విషయం కాదు. తెలుగు రాష్ట్రాల్లో కబాలి థియేట్రికల్ హక్కుల్ని రూ.32 కోట్లకు కొనుగోలు చేశారు. మిగతా ప్రాంతాల్లో తెలుగు వెర్షన్ హక్కులు ఇంకో ఐదు కోట్లకైనా పలికి ఉంటాయి. అంటే మొత్తంగా తెలుగు నుంచే 'కబాలి' నిర్మాతకు రూ.45 కోట్ల దాకా ముట్టాయన్నమాట.

English summary
Record price is for Kabali satellite rights. this movie has earned huge hype among the public and cinema lovers. Jaya HD has earned the satellite rights of Kabali film for huge money.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu