»   »  రెజీనా చేదు అనుభవం : ఛాన్స్‌ కావాలంటే అది కావాలని...డైరక్ట్ గా అడిగాడు

రెజీనా చేదు అనుభవం : ఛాన్స్‌ కావాలంటే అది కావాలని...డైరక్ట్ గా అడిగాడు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : మళయాళి నటి కిడ్నాప్, లైంగిక వేధింపులు విషయమై సామాజిక మాధ్యమాలు, మీడియాలో భారీ ఎత్తున చర్చ జరుగుతున్న సమయమిది. ముఖ్యంగా సెలబ్రెటీలు కొందరు ఈ నేఫద్యంలో తమ చేదు అనుభవాలు గుర్తు చేసుకుంటున్నారు. వరలక్ష్మి శరత్ కుమార్ మొదటిగా ఈ విషయమై మాట్లాడగా తర్వాత నగ్మా, మంచు లక్ష్మి, స్నేహ గళం విప్పారు. ఇప్పుడు రెజీనా కూడా సెక్సవుల్ హెరాస్ మెంట్ విషయమై మాట్లాడింది.

ఆ విషయం గురించి ఓ ఆంగ్ల పత్రికతో రెజీనా మాట్లాడుతూ - ''ఏడేళ్ల క్రితం నేనో తెలుగు సినిమా చేస్తున్నప్పుడు, ఎవరో వ్యక్తి ఒక తమిళ సినిమాకి అవకాశం ఇస్తానంటూ ఫోన్‌ చేశాడు. ఆ ఛాన్స్‌ కావాలంటే, కొన్ని అడ్జస్ట్‌మెంట్స్‌ చేయాలన్నాడు. అతనేం మాట్లాడుతున్నాడో అర్థం కాలేదు. ఫోన్‌ పెట్టాశాను'' అన్నారు. ఏదైనా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు తమను తాము ఎలా కాపాడుకోవాలో మహిళలకు తెలిసుండాలని ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు.

Regina Cassandra about some ‘adjustments’ in industry

రెజీనా కెరీర్ విషయానికి వస్తే... ప్రస్తుతం కృష్ణవంశీ దర్శకత్వంలో రూపొందుతున్న నక్షత్రం మూవీలో సందీప్ కిషన్ తో జోడీ కట్టింది రెజీనా. ఇప్పటికే రొటీన్ లవ్ స్టోరీ.. రారా కృష్ణయ్యా చిత్రాలలో సందడి చేసిన ఈ సుందరాంగికి.. సందీప్ తో కలిసి అల్లరి చేయడం ఇది మూడో సారి. మరోవైపు.. ఇదే సినిమాలో సుప్రీం హీరో సాయిధరం తేజు కూడా నటించనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పిల్లా నువ్వు లేని జీవితం.. సుబ్రమణ్యం ఫర్ సేల్ చిత్రాలలో తేజుతో ఆడిపాడిన రెజీనాకి.. నక్షత్రం హ్యాట్రిక్ మూవీగానే చెప్పాలి.

నారా రోహిత్ తో శంకర.. జ్యో అచ్యుతానంద చిత్రాలలో కలిసి కనిపించిన రెజీనా.. ఇప్పుడు పవన్ మల్లెల దర్శకత్వంలో రూపొందనున్న కొత్త సినిమాలో మూడోసారి జత కట్టనుంది. ఒక హీరోతో రెండో సారి చేయడమే కష్టంగా ఉన్న పరిస్థితుల్లో.. వరుసగా హ్యాట్రిక్స్ కొట్టేయడంలో రెజీనా ఓ కొత్త రికార్డ్ క్రియేట్ చేస్తోంది.

English summary
Regina Cassandra said “It was just one of my earlier experiences. Seven years ago, while I was working on a Telugu movie, someone called to say that there was an opportunity to work in Tamil. But to get the chance, some ‘adjustments’ had to be made! I did not even know who called and what he was talking about — some vague thing!"
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu