»   » ఏమిటీ షాక్...! రెజీనా జూనియర్ ఆర్టిస్ట్ గానా? ఇది నిజంగా నిజమేనా..!?

ఏమిటీ షాక్...! రెజీనా జూనియర్ ఆర్టిస్ట్ గానా? ఇది నిజంగా నిజమేనా..!?

Posted By:
Subscribe to Filmibeat Telugu

గోవిందుడు అందరివాడేలే సినిమాకు తర్వాత కృష్ణ వంశీ భారీ బడ్జెట్ సినిమా తీస్తున్నారు. నక్షత్రం అనే పేరిట ఈ సినిమా తెరకెక్కుకోంది. ఈ సినిమాలో రెజీనా గెటపే ప్రస్తుతం టాలీవుడ్‌లో చర్చనీయాంశమైంది. అందాల కథానాయిక రెజీనా జూనియర్ ఆర్టిస్టుగా మారిపోయింది. అయితే, ఇది నిజజీవితంలో కాదులెండి.. 'నక్షత్రం' సినిమా కోసం ఆమె అలా మారింది.

కృష్ణవంశీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో రెజీనా కథానాయికగా నటిస్తున్న సంగతి విదితమే. అందులో ఆమె సినిమాల్లో నటించే జూనియర్ ఆర్టిస్టుగా కనిపిస్తుందని తెలుస్తోంది. జమునారాణి అనే ఆమె పాత్ర ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుందని అంటున్నారు. ఈ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఈ రోజు మీడియాకు రిలీజ్ చేస్శారు. ఇందులో ఆమె చాలా గ్లామరస్ గా కనిపిస్తూ అందాలు విరజిమ్ముతోంది.


Regina Cassandra as Jr Artist Jamuna Rani In Nakshatram

అయితే ఈ సినిమాలో సందీప్ కిషన్ పోలీస్ కానిస్టేబుల్ గా నటిస్తున్నట్టు గతంలోనే ఓ వార్త బయటికి వచ్చింది. ఇక ఈ సినిమాలో రెజీనా పోలీస్ ఆఫీసర్ గా నటిస్తోందనేది తాజా సమాచారం. సెట్లో ఖాకీ డ్రెస్ లో ఉన్న రెజీనా ఫోటోను సందీప్ కిషన్ ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. "మంచి పోలీసా.. చెడ్డ పోలీసా?" అంటూ ఒక ప్రశ్నను కూడా వేయటం తో రెజీనా కూడా పోలీస్ పాత్రలోనే కనిపించనుందంటూ వార్తలు వచ్చాయి గానీ అందులో నిజమెంతో ఎవరికీ తెలియదు. ప్రస్తుతం ఈ బ్యూటీ చేస్తున్న నాలుగు కొత్త సినిమాలు ఏకకాలంలో షూటింగ్ జరుపుకోవడం విశేషం.


అందుకే సక్సెస్ లు లేకపోయిన ఛాన్స్ లు పెరగడంతో అమ్ముడు అమాంతం తన రెమ్యూనేషన్ పెంచింది. 'రెజీనా' ప్రస్తుతం నాలుగు క్రేజీ సినిమాలు చేస్తోంది. 'కృష్ణవంశీ' 'నక్షత్రం' సినిమాలో నటిస్తున్న ఈ బ్యూటీ 'అవసరాల శ్రీనివాస్' దర్శకత్వం వహిస్తున్న 'జ్యో అచ్యుతానంద' మూవీలో హీరోయిన్ గా చేసింది. ఇక తమిళంలోనూ 'మా నగరం' అనే సినిమా చేస్తోంది. అంతేకాదు బాలీవుడ్ లో 'ఆంఖే 2' చిత్రంలో నటించే ఛాన్స్ పట్టేసింది. కేవలం బాలీవుడ్ లో ఛాన్స్ రావడం వల్లే 'రెజీనా' రెమ్యూనేషన్ పెంచినట్లు వినిపిస్తోంది. ఇప్పటి వరకు రూ.60 లక్షల రెమ్యూనేషన్ తీసుకున్న ఈ చెన్నై పిల్ల ఇక నుంచి రూ. కోటి 50 లక్షలకు ఏ మాత్రం తగ్గేది లేదని చెప్పుతోందట.

English summary
Regina is essaying the role of a Junior Artist in Telugu films who goes by the name Jamuna Rani. We wonder if this character sounds like another Sangeetha from Khadgam movie.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X