»   » ఆ హీరోతో నా ప్రేమ విఫలం.. ఇక ఆ జోలికి వెళ్లను.. తప్పు జరిగింది.. రెజీనా.

ఆ హీరోతో నా ప్రేమ విఫలం.. ఇక ఆ జోలికి వెళ్లను.. తప్పు జరిగింది.. రెజీనా.

Posted By:
Subscribe to Filmibeat Telugu

అనతికాలంలోనే దక్షిణాది సినీ పరిశ్రమలోకి తారాజువ్వలా దూసుకొచ్చిన తారల్లో రెజీనా కసాండ్రా ఒకరు. సినీ పరిశ్రమలో ప్రవేశించిన తొలినాళ్లలోనే వరుస విజయాలు రెజీనాను పలుకరించాయి. ఆ తర్వాత రెజీనా కెరీర్ ఎందుకో ఒడిదుడుకులకు లోనైంది. అందుకు కారణం ఓ మెగా హీరోతో ప్రేమలో పడిందనే వార్తలు గుప్పుమన్నాయి. ప్రేమ, పెళ్లి అంశాల మధ్య రెజీనా నలిగిపోయింది. దాంతో ఆమె స్టార్‌డమ్‌కు గండిపడింది. ఆమె తర్వాత ఇండస్ట్రీలోకి వచ్చిన హీరోయిన్లందరూ అగ్రతారలుగా కొనసాగడం విశేషం.

హీరోతో ప్రేమ...

హీరోతో ప్రేమ...

అటు అందంతోను, నటనతోను దక్షిణాది ప్రేక్షకులను రెజీనా ఆకట్టుకొన్నది. ఓ హీరోతో వరుస చిత్రాల్లో నటించింది. అమెరికాలో ఓ చిత్ర షూటింగ్ సందర్భంగా సదరు హీరోతో ప్రేమలో పడిందనే వార్తలు మీడియాలో షికారు చేశాయి. వారి ప్రేమ పెళ్లిపీటల వరకు దారి తీసిందని చెప్పుకొన్నారు. ఆ హీరో మెగా హీరోల్లో ఒకరు అనే వార్త వైరల్ అయింది.

పెళ్లి ప్రతిపాదనకు నో...

పెళ్లి ప్రతిపాదనకు నో...

సదరు హీరోతో పీకల్లోతు ప్రేమలో కూరుకుపోయిన రెజీనా.. పెళ్లి ప్రతిపాదనను తిరస్కరించిందట. కెరీర్ ఉన్నత స్థానంలో ఉన్నందున పెళ్లికి నో చెప్పినట్టు సమాచారం. ఆ మెగా హీరో మాత్రం పెళ్లి చేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడని, అంతేకాకుండా కుటుంబ సభ్యులను కూడా ఒప్పించినట్టు వార్తలు వెలువడ్డాయి.

 కొన్ని తప్పులు జరిగిపోయాయి...

కొన్ని తప్పులు జరిగిపోయాయి...

మీడియాలో వస్తున్న తన ప్రేమ, పెళ్లి వార్తలపై ఇటీవల రెజీనా స్పందించినట్టు ఓ పత్రిక పేర్కొన్నది. కెరీర్ ఆరంభంలోనే ప్రేమలో పడటం వల్ల తెలియకుండా కొన్ని తప్పులు జరిగిపోయాయి అని రెజీనా తెలిపినట్టు ఓ వార్త ఇంటర్నెట్‌లో ప్రచారం జరుగుతున్నది.

మత్తు నుంచి బయటపడ్డాను...

మత్తు నుంచి బయటపడ్డాను...

ప్రస్తుతం ప్రేమ మత్తు నుంచి బయటపడ్డాను. ఇకపై ప్రేమ, పెళ్లి అనే ఆలోచనలను వదిలేసి, కెరీర్‌పైనే పూర్తి స్థాయిలో దృష్టి సారిస్తాను అని చెప్పినట్టు ఆ వార్త కథనం సారాంశం. అయితే ఎవరితో ప్రేమలో పడ్డాను. ఎందుకు ప్రేమ విఫలమైంది అనే విషయాలను వెల్లడించడానికి నిరాకరించింది.

English summary
Regina Cassandra one of the talented artist from the telugu industry. because of love affiair her career not up to the mark. In this Occassion she clarifies her about her love affiair. Regina said she came out from the the affiair. Now onwards i decided to concentrate on my career.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu