»   » సందీప్ కిషన్‌కు కేక్ ఫేషియల్ చేసిన రెజీనా (ఫోటో)

సందీప్ కిషన్‌కు కేక్ ఫేషియల్ చేసిన రెజీనా (ఫోటో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: తెలుగు యంగ్ హీరో సందీప్‌ కిషన్ ఈ రోజు(మే 7) పుట్టిన రోజు జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా 'ఇది కేక్‌ ఫేషియల్‌' అంటూ... రెజీనా సరదాగా అతనికి కేక్‌ పూసిన ఫోటోను తన ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసింది. ఇద్దరూ కలిసి పలు చిత్రాల్లో నటించారు. అప్పటి నుండి మంచి ఫ్రెండ్స్ అయ్యారు. ఫ్రెండ్ బర్త్ డే ఇలా కేక్ పూసి అల్లరి చేసింది రెజీనా.

సందీప్ కిషన్ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం 'ఒక అమ్మాయి తప్ప' అనే చిత్రంలో నటిస్తోంది. రాజసింహ తాడినాడ దర్శకుడు. అంజిరెడ్డి ప్రొడక్షన్స్‌ పతాకంపై బోగాది అంజిరెడ్డి నిర్మిస్తున్నారు. ఈచిత్రంలో నిత్యా మీనన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఆడియో మే 8న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

'ఒక అమ్మాయి తప్ప' సినిమా గురించి సందీ కిషన్‌ గతంలో ఓసారి ప్రెస్ మీట్లో మాట్లాడుతూ... మాట్లాడుతూ ''ఇప్పటి వరకు కథల్ని నమ్మి మాత్రమే సినిమాలు చేశాను. ఈ సినిమాకి కథతోపాటు దర్శకుడిని కూడా నమ్మి చేస్తున్నాను. తెలివిగల కాలేజ్‌ కుర్రాడి లవ్‌స్టోరీ ఇది. అతనికి ఎదురైన సమస్యలను ఎలా పరిష్కరించుకున్నాడు అనేది ఆసక్తికరం. నా కెరీర్‌కి కీలకమైన చిత్రమిది'' అని తెలిపారు.

దర్శకడు మాట్లాడుతూ ''కొత్త తరహా లవ్‌స్టోరీతో రూపొందుతున్న చిత్రమిది. పక్కా కమర్షియల్‌ అంశాలతో తెరకెక్కిస్తున్నాం. 45 నిమిషాల గ్రాఫిక్స్‌ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి అన్నారు. ''సినిమా చూపిస్త మావ' చిత్రంతో పెద్ద హిట్‌ అందుకున్నాం. అదే తరహాలో ఈ సినిమా కూడా హిట్‌ కావాలని ఆశిస్తున్నాం'' అని అంజిరెడ్డి అన్నారు.

English summary
Regina Cassandra does facial to hero Sundeep Kishan today!!! It is a sweet surprise to the fans when the beautiful heroine posted a photo of her along with Sundeep Kishan. The news is that today is Sundeep’s birthday.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu