»   » దారుణం : నటి సౌందర్య స్థలం కబ్జా

దారుణం : నటి సౌందర్య స్థలం కబ్జా

Posted By:
Subscribe to Filmibeat Telugu

బెంగళూరు : ప్రమాదంలో మృతి చెందిన నటి సౌందర్య స్థలానికి నకిలీ పత్రాలు సృష్టించి విక్రయించేందుకు నిందితులతో కుమ్మక్కయ్యారన్న ఆరోపణలపై బెంగళూరు సహకార సంఘాల విశ్రాంత రిజిస్ట్రార్‌ తిమ్మయ్యను లోకాయుక్త పోలీసులు అరెస్టు చేశారు.

ఈ కుంభకోణంలో నిందితులతో చేతులు కలిపిన సహకార సంఘం కార్యదర్శి దయానంద్‌, మరో నలుగురు కాంగ్రెసు పార్టీ కార్యకర్తలు పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు. బనశంకరి రెండో స్టేజ్‌లోని జి.ఎస్‌.అసోసియేట్స్‌ పేరిట దయానంద్‌ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారాన్ని నిర్వహిస్తున్నాడని పోలీసులు గుర్తించారు.

సౌందర్య 1999 జూన్‌లో ఒక స్థలాన్ని కొనుగోలు చేశారు. అక్కడ ఇంటిని నిర్మించే ప్రయత్నాల్లో ఉండగానే విమాన ప్రయాణంలో మృతి చెందారు. ఈ నేపథ్యంలో సౌందర్య భర్త ఆ స్థలాన్ని సిద్ధమ్మ అనే మహిళకు విక్రయించారు.

Registrar cited accused in land grab case

అయితే తిమ్మయ్య, దయానంద్‌, మరో నలుగురు నిందితులు ఆ స్థలానికి నకిలీ పత్రాలను సృష్టించి భాగ్యలక్ష్మి అనే మహిళకు విక్రయించారు. భాగ్యలక్ష్మి ఆ స్థలాన్ని 2015లో నాగరత్న అనే మహిళకు విక్రయించింది.

ఈ విషయాన్ని గుర్తించిన సిద్ధమ్మ తన స్థలం కబ్జాకు గురైందని సౌందర్య భర్త రఘుకు తెలిపింది. రఘు, సిద్ధమ్మలు కలిసి లోకాయుక్తకు ఫిర్యాదు చేయటంతో అక్రమ వ్యహహారం వెలుగు చూసింది.. ప్రాథమిక దర్యాప్తు తరువాత తిమ్మయ్యను అరెస్టు చేసి విచారణ ప్రారంభించారు.

English summary
The Anti-Land Grabbing Special Cell, Bangalore, has filed a case against the Coperative-Registrar, Thimmaia, citing him as one among the four accused involved in usurping a piece of land belonging to Soundarya.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu