»   » రామ్ చరణ్ తండ్రి పాత్రలో రహమాన్

రామ్ చరణ్ తండ్రి పాత్రలో రహమాన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ హీరోగా కృష్ణ వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'గోవిందుడు అందరి వాడేలే' చిత్రంలో మళయాలం నటుడు రెహమాన్ నటించబోతున్నట్లు తెలుస్తోంది. రామ్ చరణ్ తండ్రి పాత్రలో ఈయన్ని తీసుకుంటున్నట్లు సమాచారం. వాస్తవానికి ఈ పాత్రకు జగపతి బాబును తీసుకోవాలనుకున్నారు. అయితే రజనీకాంత్ మూవీ షూటింగులో జగపతి బాబు బిజీగా ఉండటంతో రహమాన్‌ను తీసుకున్నట్లు తెలుస్తోంది.

భారీ తారాగణంతో కృష్ణ వంశీ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ ఈచిత్రంలో రామ్ చరణ్ తాత పాత్రలో నటిస్తున్నాడు. ప్రకాష్ రాజ్‌కు జోడీగా జయసుధ నటిస్తోంది. మరో నటుడు శ్రీకాంత్ రామ్ చరణ్ బాబాయ్ పాత్రలో నటిస్తుండగా అతనికి జోడీగా కమలినీ ముఖర్జీ నటిస్తున్నపారు. రామ్ చరణ్‌కు జోడీగా హీరోయిన్ కాజల్ నటిస్తున్న సంగతి తెలిసిందే.

 Rehman to play Ram Charan’s father

'గోవిందుడు అందరివాడేలే చిత్రం రిలీజ్ డేట్ కూడా ఖరారైంది. అక్టోబర్ 1న విడుదలవుతోంది. కెరీర్లో తొలి దసరా రిలీజ్ కావడంతో రామ్ చరణ్ ఎగ్జైట్మెంటుతో ఉన్నారు. ఈ చిత్రంలో చరణ్‌ పల్లెటూరికి వచ్చే ఎన్నారై పాత్రలో నటిస్తున్నారు. ఫ్యామిలీ ఎంటర్టెనర్ ఇప్పటి వరకు మాస్, యాక్షన్ సినిమాలతో అలరించిన రామ్ చరణ్ 'గోవిందుడు అందరివాడేలే' చిత్రంలో ఫ్యామిలీ హీరోగా కనిపించనున్నాడు.

English summary
Shooting for the Krishna Vamsi’s family entertainer film Govindudu Andarivadele is on, with a lot of actors involved in it. The newest entrant is Rehman who will play Charan’s father.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu