శృతి హాసన్ కెరీర్లోనే సూపర్ హాట్ సాంగ్ ఇది...(వీడియో)

By Bojja Kumar

హైదరాబాద్: జాన్ అబ్రహం, శృతి హాసన్ హీరో హీరోయిన్లుగా బాలీవుడ్లో తెరకెక్కుతున్న చిత్రం ‘రాఖీ హాండ్సమ్'. యాక్షన్ థ్రిలర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి నిశికాంత్ కామత్ దర్శకత్వం వహిస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్ అయినప్పటికీ సినిమాలో రొమాంటిక్ సీన్లుక ఏ మాత్రం లోటు లేకుండా జాగ్రత్త పడుతున్నాడు దర్శకుడు.

సినిమా ప్రమోషన్లో భాగంగా జాన్ అబ్రహాం, శృతి హాసన్ ల పై చిత్రీకరించిన రొమాంటిక్ సాంగును రిలీజ్ చేసారు. ఈ సాంగ్ యువతను ఎంతగానో ఆకట్టుకుంటోంది. శృతి హాసన్ తన కెరీర్లోనే అత్యంత హాట్ హాట్ గా రొమాన్స్ పండించిన సాంగ్ ఇది. ఈ హాట్ సాంగుపై మీరూ ఓ లుక్కేయండి...

2010లో వచ్చిన కొరియన్ ఫిల్మ్ ‘ది మ్యాన్ ఫ్రమ్ నోవేర్' అనే సినిమా ఆధారంగా ‘రాఖీ హాండ్సమ్' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో హీరోగా నటించడంతో పాటు సహ నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నాడు జాన్ అబ్రహాం. జాన్ అబ్రహాంకు చెందిన జాన్ అబ్రహాం ఎంటర్టెన్మెంట్స్, సునీర్ కేత్రపాల్ కు చెందిన అజురె ఎంటర్టెన్మెంట్స్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

ఈ చిత్రంలో శృతి హాసన్ జాన్ అబ్రహం భార్యగా నటిస్తోంది. దివ్య అనే ఏడేళ్ల బాల్య నటి ఈ చిత్రంలో మరో ముఖ్యమైన పాత్రలో నటిస్తోంది. బాలీవుడ్ ఐటం గర్ల్ నథాలియా గర్ల్ ఈ చిత్రంలో దివ్య తల్లి పాత్రలో నటిస్తోంది. రూ. 75 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ చిత్రాన్ని మార్చి 25న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X