»   » అదే దాసరి ప్రాణం తీసింది.. మరో పదేళ్లు బతికే వారు.. అలా చేయడం తప్పు..

అదే దాసరి ప్రాణం తీసింది.. మరో పదేళ్లు బతికే వారు.. అలా చేయడం తప్పు..

Posted By:
Subscribe to Filmibeat Telugu

దర్శకరత్న దాసరి నారాయణరావు ఆకస్మిక మరణంపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. బరువు తగ్గడం కోసం అందించిన చికిత్సనే దాసరి మరణానికి కారణమైందని, సర్జరీ వికటించడంతోనే మనకు దూరమయ్యాడనే వాదనను ఆయన సన్నిహితులు వినిపించారు. దాసరి మరణంపై తాజాగా ఆయనకు సన్నితుడు, ప్రముఖ దర్శకుడు రేలంగి నరసింహరావు కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఓ యూట్యూబ్ ఛానెల్‌తో మాట్లాడుతూ రేలంగి చెప్పినదేమింటంటే.

బరువు తగ్గడం కోసం వెళ్లి..

బరువు తగ్గడం కోసం వెళ్లి..

బరువు తగ్గడం కోసం దాసరి గారు తొలుత కడుపులో బెలూన్ వేసుకొన్నారు. దాని తర్వాత ఆరు, ఏడు కిలోల బరువు తగ్గాడు. ఆ నమ్మకంతోనే అందుకే రెండోసారి సర్జరీకి వెళ్లారు. బెలూన్ వేసుకొన్నారు. అదే ప్రాణం తీసింది. రెండోసారి వేసుకోవడానికి వెళ్లడమే తప్పు అని రేలంగి అన్నారు.

రెండోసారి వెళ్లడం తప్పు..

రెండోసారి వెళ్లడం తప్పు..

రెండోసారి బెలూన్ వేయడంలో తప్పు జరిగింది. దానిని కొంత సవరించి ఇంటికి పంపించారు. ఆయన నోటి ద్వారా కాకుండా లిక్విడ్ ఫుడ్ తీసుకొంటున్నారు. నోటి ద్వారా ఆహారాన్ని తీసుకోవడానికే రెండోసారి సర్జరీకి వెళ్లాడు. అలా వెళ్లకుండా ఉండి ఉంటే మరో పదేళ్లు బతికే వారు రేలంగి అన్నారు. సర్జరీ చేసుకోకుండా లిక్విడ్ తీసుకొంటూ ఉంటే ఇప్పటికీ మనముందు గురువు గారు ఉండేవారు అని దర్శకుడు కోడి రామకృష్ణ చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా రేలంగి పేర్కొన్నారు.

ఆ ప్రయత్నమే ప్రాణం తీసింది..

ఆ ప్రయత్నమే ప్రాణం తీసింది..

నోటి ద్వారా ఆహారం తీసుకోవడానికి చేసిన ప్రయత్నం చాలా దారుణానికి దారి తీసింది. ఒకవేళ లిక్విడ్ తీసుకుంటూ ఉంటే మరి కొన్ని ఏళ్లు బతికే వాళ్లు. అంతా విధి రాత అని రేలంగి చెప్పుకొచ్చారు. దాసరి ఉండి ఉంటే పరిశ్రమకు అండగా ఉండేవారు. మరింత మేలు జరిగి ఉండేది అని ఆయన అభిప్రాయపడ్డారు. ఆయన బరువు తగ్గాలనే కోరికే ఆయన ప్రాణం తీసిందన్నారు.

దాసరి మరణించినప్పడు..

దాసరి మరణించినప్పడు..

దాసరి మరణించినప్పుడు ఆయనకు సన్నిహితులు రాకపోవడం రేలంగి అసంతృప్తిని వ్యక్తం చేశారు. మరణించిన సమయంలో ద్వేషాలకు, కోపతాపాలకు చోటుండకూడదు అని చెప్పారు. ఆయనతో సంబంధం లేని వారు కూడా వచ్చి చివరిచూపు చూసి వెళ్లారు. శ్రద్ధాంజలి ఘటించారు. కానీ ఆయన సహకారం తీసుకొన్న వాళ్లు స్థానికంగా ఉండి కూడా రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

English summary
Director Relangi Narsimharao revealed many things behind Dasari Narayana Rao' death. He said.. Dasari went to surgery second time has gone totally wrong. That mistake made him very costly.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu