»   » ఒకటీ రెండూ కాదు 150 కోట్లట.., మహేష్ బాబు చరిష్మా అలా ఉంది మరి

ఒకటీ రెండూ కాదు 150 కోట్లట.., మహేష్ బాబు చరిష్మా అలా ఉంది మరి

Posted By:
Subscribe to Filmibeat Telugu

మూవీకి ఈ నెల 29న షూటింగ్ ప్రారంభం కానుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు చివరి దశకు చేరుకుంటున్నాయి. ఇంకా షూటింగ్ కూడా మొదలుకాకముందే ఈ చిత్రానికి భారీ ఆఫర్ రావడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అది కూడా హోల్ అండ్ సోల్ రైట్స్ కోసం ప్రయత్నిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది.

మహేష్ మురుగ దాస్ ల కాంబినేషన్ లో రానున్న సినిమా బడ్జెత్ 100 కోట్లకు దగ్గరలో ఉందని తెలిసిందే. రెండు భాషల్లో చిత్రాన్ని నిర్మించడం ద్వారా ఈ బడ్జెట్ ను ఈజీగా రికవర్ చేయచ్చన్నది మురుగదాస్ ఆలోచన. అయితే.. ఇప్పుడే ఈ సినిమాకి రిలయన్స్ ఎంటర్టెయిన్మెంట్స్ నుంచి 150 కోట్ల రూపాయలకు ఆఫర్ వచ్చిందని అంటున్నారు. తెలుగు తమిళ రెండు వెర్షన్స్ థియేట్రికల్ రైట్స్ కోసమే ఈ మొత్తం అంటున్నా.. అదినిజం కాదనీ శాటిలైట్ సహా మిగిలిన రైట్స్ కూడా కలుపుకునే ఇంత మొత్తం ఆఫర్ చేసారనీ చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం మహేష్ తో నిర్మాతల చర్చలు సీరియస్ గానే ఉన్నట్టు టాక్.

Reliance struck 150 Cr deal with Mahesh

ఈ ద్విభాషా చిత్రం లో మహేష్ బాబుతో పాటు బాలీవుడ్, కోలీవుడ్ స్టార్స్ సైతం నటించే ఛాన్స్ ఉందని అంటున్నారు. దీనికి సంబంధించిన వివరాల్లోకి వళితే, సక్సెస్ ఫుల్ డిస్ట్రిబ్యూషన్ హౌస్ గా మైత్రి మూవీస్ ఇప్పటికే భారీ లాభాలను చూసింది. వీరు మొట్ట మొదటి సారిగా చేసిన 'శ్రీమంతుడు' సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడమే కాకుండా, నిర్మాతలకి దాదాపు 40 కోట్ల రూపాయాల అదనపు ఆదాయాన్ని తీసుకువచ్చింది. ఇప్పుడు ఈ సినిమా కూదా అసలు పూర్తవకుండానే లాభాలని చేతుల్లో పెట్టేలా ఉంది.

గతంలో యూటీవీ కూడా మహేష్ తో ఇలాంటి డీల్స్ కి ప్రయత్నించింది కానీ.. ఆఖరి నిమిషంలో డ్రాప్ అయిపోయింది. ఈరోస్ సంస్థ మాత్రమే మహేష్ మూవీలను కొనుగోలు చేస్తోంది. ఇప్పుడు రిలయన్స్ కూడా మహేష్ సినిమాపై కన్నేసింది. ఈ సినిమాకి ఇంత క్రేజ్ రావడానికి మురుగదాస్ డైరెక్షన్ కాకుండా మరో ప్రధాన కారణం ఉంది. అదే మహేష్ డ్యుయల్ రోల్ చేయడం. గతంలో నాని మూవీలో ఓ నిమిషం పాటు ఇలాంటి సీన్ ని ఫ్యాన్స్ ఎంజాయ్. ఫుల్ ప్లెడ్జెడ్ గా హీరోగా మహేష్ ద్విపాత్రాభినయం చేయడం ఈ సినిమాతోనే.

English summary
for the first time in his career Mahesh will be seen in a dual role in this untitled project with Murugadas. Reliance offered Rs 150 crores for the theatrical rights of both the versions alone and the makers are currently holding discussions. The deal will be finalized in a couple of days revealed the makers.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu