For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  పెద్ద ఎన్టీఆర్ కి సిగరెట్ వెలిగించిన అక్కినేని.... ఈ స్నేహం ఇప్పటి హీరోల్లో లేదా? చూపించరా?? (అరుద

  |

  ఒక హీరో కోసం ప్రాణాలిచ్చేంత అభిమానం ఉండొచ్చు కానీ అది ప్రాణాలు తీసేంత వరకూ వెళ్ళటం మంచిది కాదు. మేము బాగానే ఉంటాం మీరు కూడా ఒకరిపై ఒకరు దాడుల వరకూ వెళ్ళకండీ అంటూ ఒకటీ రెండు సార్లు ఇప్పటి హీరో లు చెప్పారు కానీ. కాస్త అగ్రహీరోల దగ్గరికి వెళ్తే మాత్రం అలా చెప్పటం అటుంచి... సినిమాలో డైలాగుల రూపం లో మరో హీరో మీదే సెటర్ వేసే స్థాయికి కూడా దిగజారిన సంఘతనలున్నాయి. ఆఖరికి సినీ ఫంక్షన్లలో కూడా ఇన్ డైరెక్ట్ గా తమ అభిమానులని ఉద్దేశించి నా ఫ్యాన్స్ అలా ఉండాలీ... ఇలా ఉండాలీ అంటూ రెచ్చగొట్టిన సందర్భాలూ ఉన్నాయి...

  బహిరంగంగానే ఒకరి పై ఒకరు కామెంట్లు విసురుకుంటూ ఇతర హీరోలమీద ద్వేషాన్ని ప్రకటిస్తూంటే ఇక అభిమానులదేముందీ..? తమ హీరోలనే రోల్ మోడల్ గా తీసుకునే వాళ్ళు ఈ విషయం లోనూ అలాగే తయారవుతున్నారు. కానీ ఒకప్పుడు ఇలా ఉఇండేది కాదు. ప్రతీ అగ్రహీరో మరో హీరోతో కలి ఎన్నో సినిమాల్లో నటించారు.

  అక్కినేని ముందుగా

  అక్కినేని ముందుగా

  ఎన్టీఆర్ కన్నా అక్కినేని నాగేశ్వర రావు ముందుగా ఇండస్ట్రీలోకి వచ్చారు. కానీ ఎన్టీఆర్ సినీ రంగ ప్రవేశం చేసిన అతి తక్కువ కాలంలోనే అద్భుతమైన ప్రతిభతో విపరీతమైన పాపులారిటీ సంపాదంచారు. అయినా నేను ముందొచ్చాను అన్న అభిప్రాయం ఇటు ఏ ఎన్నార్ కి గానీ.., నేను వెనకొచ్చినా నా ఫాలోయింగ్ ఎలా ఉందో చూసావా? అన్న గర్వం ఎన్టీఆర్ కి గానీ ఎప్పుడూ లేవు. ఇద్దరూ కలిసే నటించారు. తెర వెనుక కూడా ఇద్దరూ మంచి స్నేహితులు గానే ఉన్నారు.

  అక్కినేని కామెడీ హీరోగా

  అక్కినేని కామెడీ హీరోగా

  ఇక ఎన్టీఆర్ హీరోగా నటించిన మిస్సమ్మలో అక్కినేని కామెడీ హీరోగా కనిపించటానికి ఏమాత్రం ఆలోచించలేదు. మా హీరోకి ప్రాధన్యత లేని పాత్ర ఇది అంటూ ఆయన ఫ్యాన్స్ కూడా అనుకోలేదు. ఇండస్ట్రీలో అప్పటికే స్థిరపడిపోయిన ఏఎన్ఆర్ అంటే ఎన్టీఆర్ కి చాలా గౌరవం అభిమానం అందుకే ఏ కార్యక్రమాల్లో అయినా సరే ఇద్దరు ఎక్కువగా పాల్గొనేవారట. ఎన్టీఆర్ మీద కూడా గౌరవం తోనే ఉన్నారు అక్కినేని.

  నిజమైన హీరోలు

  నిజమైన హీరోలు

  ఈ ఫొటో చూడండి ఈ ఇద్దరూ నిజమైన హీరోలు ఎప్పుడూ ఎక్కడా భేషజాలు చూపించని మన తెలుగు సినీ ఇండస్ట్రీ తారలు. చలా విపత్తుల సమయం లో కూడా ఎన్టీఆర్, ఏఎన్నార్ అభిమానులు, అభిమాన సంఘాలు కలిసి పని చేసాయి. ఎన్టీఆర్ సినిమా లు విడుదలైనప్పుడు.., ఎన్టీఆర్ పుట్టిన రోజుల వేడుకలలోనూ అక్కినేని, కృష్ణ, అభిమానులనూ ఆహ్వానించేవాళ్ళు. తమ హీరోలు కలిసి చేసిన సినిమాల మీద మాట్లాడుకునే వాళ్ళు...

  విభేదాలు లేవని కాదు

  విభేదాలు లేవని కాదు

  అయితే ఇద్దరిమధ్యా విభేదాలు లేవని కాదు ఇద్దరూ విమర్శలూ చేసుకున్నారు..., వాదించుకున్నారు కానీ ఎప్పుడూ ఎక్కడా కూడా హద్దులు మీరి స్వవిశయాలని అభిమానుల దాకా తీసుకు వెళ్లలేదు. రక్తం పంచుకు పుట్టకపోయినా సొంత అన్నదమ్ముల్లా, ఒకే కుటుంభసభ్యుల్లా కలసిమెలసి ఉన్న వీరి మధ్య విభేదాలు సైతం ఉన్నాయని మనలో చాలా మందికి తెలీదు.

  నమ్మదగ్గ మనుషులు కారు

  నమ్మదగ్గ మనుషులు కారు

  ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో కాషాయ వస్త్రాల్లో నిండుగా ఉండేవారు....అదే క్రమంలో రవీంధ్ర భారతిలో జరిగిన ఒకానొక కార్యక్రమంలో మాట్లాడిన అక్కినేని...కాషాయ వస్త్రాలు ధరించిన వాళ్ళు నమ్మదగ్గ మనుషులు కారు అని, భుక్తి కోసం, వేషాలు వెయ్యడమే తప్పా, వారిని నమ్మకూడదు అని అక్కినేని ఆయనకు అత్యంత ఇష్టమైన ఆదిశంకరుడి శ్లోకాన్ని వివరించారు. నిజానికి కాస్త హేతువాద దృక్పదం తో ఉండే అక్కినేని కావాల్ని అన్న మాట కాదు.

  అక్కినేని కావాలనే ఎన్టీఆర్ ను అన్నారని

  అక్కినేని కావాలనే ఎన్టీఆర్ ను అన్నారని

  ఆ శ్లోకం కాస్త వీరిద్దరి మధ్య వైరానికి దారి తీసింది అని అప్పట్లో బలంగా చర్చకు వచ్చినట్లు తెలుస్తుంది. అక్కినేని కావాలనే ఎన్టీఆర్ ను అన్నారని కొందరు ఎన్టీఆర్ వద్ద వాపోయినట్లు సమాచారం. ఇక ఆ దెబ్బతో అక్కినేని దాదాపుగా 3ఏళ్ళపాటు రవీంద్ర భారతి గడప తొక్కలేదు. ఆతరువాత ఎన్నో కార్యక్రమాల్లో వీళ్ళు కలసినప్పటికీ పెద్దగా మాట్లాడుకున్న సంధర్బాలు లేవు. కానీ

  వీడిపోని బంధంగా చిరకాలం

  వీడిపోని బంధంగా చిరకాలం

  ఎన్నో మలుపులు తిరిగి చివరకు వారి స్నేహభావం బలమైనది కావడంతో వీడిపోని బంధంగా చిరకాలం మిగిలిపోయింది. అంతే తప్ప ఇప్పటిలా అభిమానుల మధ్య గొడవలకి గానీ.., వేరు వేరు వర్గాలుగా చీలిపోవటానికి గానీ కారణం కాలేదు. ఇప్పటికీ ఈ ఇద్దరుమితృలూ కలిసి చేసిన సినిమాలని ఈ ఇద్దరి అభిమానులూ సంతోషంగానే చూస్తారు. ఈ తరం లో కూడా ఈ మహా నటులకి ఫ్యాన్స్ ఉండటానికి కారణం. వారు ఎప్పుడూ ఇంతటి విభేదాలకి కారణం కాకపోవటమే

  కుల సంఘాల లా

  కుల సంఘాల లా

  కానీ ఇప్పుడు మారిపోయింది ఒక హీరో పై ఇంకో హీరో మాటల దాడి చేస్తే... ఆ హీరోల అభిమానులు మరో హీరో అభిమానుల పై దాడులు చేసే దాకా వచ్చింది. ఇక ఇప్పుడు చంపుకోవటం వరకూ చేరుకోవటం అంటే ఇదేమంత ఆహ్వానించ దగ్గ పరిణామం కాదు. అంతకంటే ధారుణం కుల సంఘాల లా అభిమాన సంఘాలూ తయారు కావటం. ప్రతీ హీరోకీ ఒక కుల సంఘ మద్దతు ఉంటూనే ఉంది.

  English summary
  Two Tollywood Stars Nandamuuri Taraka Rama Rao And akkineani Nageshwara rao and Their Ideal Friendship
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X