»   » వెర్రి మొర్రి కూతలేం ఉండవని ముందే హామీ

వెర్రి మొర్రి కూతలేం ఉండవని ముందే హామీ

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : హిట్ తో దోబూచులాడుతున్న నారా రోహిత్ ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్ ని అందిపుచ్చుకోవాలనే తపనతో ఉన్నారు. బయిట రీమిక్స్ ట్రెండ్ నడుస్తోంది. బాగా పాపులర్ అయిన పాటలను తమదైన శైలిలో మోడ్రన్ మ్యూజిక్ ని కలిపి వదులుతున్నారు. వాటిలో కొన్ని ఈ కాలంలోనూ హిట్ అయ్యి అందరి ప్రశంసలూ పొందుతూంటే మరికొన్ని సంగీతాభిమానుల ఆగ్రహానికి దారి తీసేలా తయారవుతున్నాయి. దాంతో ఎందుకైనా మంచిదని తాము రీమిక్స్ చేసే పాటలో వెర్రి మొర్రి కూతలేం జోడించం అని ముందే హామీ ఇస్తున్నారు.

మహ్మద్‌ రఫీ పాడిన తెలుగు పాటల్లో ఓ ఆణిముత్యం..'ఎంతవారుగానీ.. వేదాంతులైనగానీ, వాలు చూపు తాకగానే తేలిపోదురోయ్‌..' 'భలే తమ్ముడు'లోని ఈ పాట ఎప్పటికీ శ్రోతల్ని అలరిస్తూనే ఉంటుంది. ఇప్పుడీ గీతాన్ని మరోసారి వినిపించబోతున్నారు 'రౌడీఫెలో' చిత్రంలో. నారా రోహిత్‌ హీరోగా నటిస్తున్న చిత్రమిది. గీత రచయిత కృష్ణచైతన్య దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. సన్నీ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంలో 'ఎంతవారుగానీ..' గీతాన్ని రీమిక్స్‌ చేస్తున్నారు.

Remix song in Nara rohit Rowdy fellow

దర్శకుడు మాట్లాడుతూ ''సి.నారాయణరెడ్డి సాహిత్యం, మహ్మద్‌ రఫీ గానం ఎప్పటికీ మర్చిపోలేం. 'రౌడీఫెలో'లో ఈ పాట వినిపించే సందర్భం కుదిరింది. అందుకే పాటను యథాతథంగా వాడుకొంటున్నాం. ట్రెండ్‌ అని చెప్పి వెర్రి మొర్రి కూతలేం జోడించకుండా, పాటలో మాధుర్యం ఏ మాత్రం తగ్గకుండా జాగ్రత్తలు తీసుకొంటున్నాం. సన్నీ రీమిక్స్‌ చేసిన విధానం తప్పకుండా ప్రేక్షకులకు నచ్చుతుంది'' అన్నారు.

నిర్మాత టి. ప్రకాశ్‌రెడ్డి మాట్లాడుతూ.... 'యాక్షన్, కామెడీ, రొమాన్స్ అంశాలు మిళితమైన సినిమా ఇది. దర్శకుడు కృష్ణచైతన్య విభిన్నంగా చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నారు. 'స్వామి రారా', 'ఉయ్యాల జంపాలా' చిత్రాలకు పనిచేసిన సన్నీ ఈ సినిమాకి సంగీత దర్శకుడు. 'ఆషికి-2' చిత్రంలో తన గానంతో దేశాన్ని ఉర్రూతలూగించిన గాయకుడు ఆర్జిత్ సింగ్ ఇందులోని అన్ని పాటలూ పాడటం విశేషం' అని తెలిపారు.

మూవీ మిల్స్, సినిమా 5 సంస్థలు నిర్మిస్తున్నఈ చిత్రం షూటింగ్ తుదిదశకు చేరుకొంది. విశాఖా సింగ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో రావు రమేశ్, పరుచూరి వెంకటేశ్వరరావు, గొల్లపూడి, పోసాని, తాళ్లూరి రామేశ్వరి, సుప్రీత్, అజయ్, ఆహుతి ప్రసాద్, ప్రవీణ్, సత్య ఇతర ముఖ్యతారాగణం. గీత రచయిత కృష్ణచైతన్య దర్శకత్వం వహిస్తున్నారు. సినిమా5, మూవీ మిరాకిల్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రానికి సన్ని సంగీతం అందిస్తున్నారు.

English summary
Nara Rohit’s upcoming film Rowdy Fellow is almost complete.Popular lyricist Krishna Chaitanya has turned director with this film.Visakha Singh is playing the female lead. Sunny, who’s had two back to back hits with Swamy Ra Ra and Uyyala Jampala has composed music for this film.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu