»   » రెమో "భామ" గా వస్తున్న మాస్ హీరో

రెమో "భామ" గా వస్తున్న మాస్ హీరో

Posted By:
Subscribe to Filmibeat Telugu

హీరోలు ఆడ వేషం లో కనిపించటం మనకేం కొత్తకాదు. అయితే దాదాపు యాబై శాతం సినిమాకి పైగా హీరో ఆడ వేషం లో కనిపించటం అరుదే. "మేడం" లో ఆ ఫీట్ ని కూడా చేసి మెప్పించారు మన నవ్వుల హీరో రాజేంద్ర ప్రసాద్. ఆయనే కాదు "చిత్రం భళారే విచిత్రం" లో మరో హీరో నరేష్ కూడా బాగానే అలరించాడు.

ఇక కమల్ చేసిన "భామనే సత్యభామనే" మరో ఎత్తు వయసుమళ్ళిన భ్రాహ్మణ వృద్దురాలి వేశం లో ఆద్యంతం నవ్వులు పూయించ్ఘాడు కమల్ హసన్. హీరో ఆడవేషం వేయడం చాలానే సినిమాల్లో చూసినా.. గుర్తుండి పోయేవి మాత్రం చాలా తక్కువ. హీరో ఆడవేషం వేసి మెప్పించడం ఆ తర్వాత మళ్ళీ ఆస్థాయిలో ఆడవేశాన్ని ఎవరూ చేయలేకపోయారు.

"Remo" first look, title track launch

అయితే ఇన్నేళ్లకి ఆ ఫీట్ చేయటానికి నేను సిద్దం అంటున్నాడు తమిళ యంగ్ హీరో శివకార్తికేయన్.. తన రాబోయే మూవీలో లేడీ గెటప్ లో కనిపించనున్నాడు. ఇన్నాళ్లూ ఈ విశయం చెబుతూంటే నమ్మలేదెవరూ... అన్ని రూమర్లు గా భావించి కొట్టి పడేశారు. కానీ ఇప్పుడు "రెమో" ఫస్ట్ లుక్ విడుదల చేయడంతో ఒక్కొక్కరూ అదేదో సబ్బు అడ్వర్తైజ్మెంట్లో లాగా "అవక్కయ్యారా..?" అనుకున్నారు.

కారణం శివ అసలు సిసలు అమ్మాయిలా హొయలొలకబోస్తూ చెబితే తప్ప అమ్మాయి కాదు అబ్బాయి అనే విశయం తెలియకుండా ఉన్నాడు. ఓ నర్స్ గెటప్ వేసుకున్న శివకార్తికేయన్ పోస్టర్ ని రిలీజ్ చేసింది యూనిట్. ముందే చెబితే కానీ అతను అబ్బాయిగా పోల్చుకోలేం.. నిజంగా అబ్బాయికే అమ్మాయి వేషం వేశారంటే నమ్మడం కష్టం.

"Remo" first look, title track launch

ఆ రేంజ్ లో మేకప్ పూసి మాయ చేసారు రెమో టీం. మామూలుగా మాస్ పాత్రలు చేసే ఈ రఫ్ హీరో శివకార్తికేయన్ ని.. ఈ రేంజ్ లో చూసి కోలీవుడ్ లో అందరూ ఒక్క సారి బిత్తరపోయారు. శివ చేయబోతున్న "సాహసాన్ని" చ్హుసి ముక్కున వేలేసుకున్నారు. ఎందుకంటే...

ఎంతో కొంత నటనలో ప్రవేశం ఉన్న ప్రతీ వారికీ తెలుసు ఆడ పాత్రలో కనిపించటం ఎంత కష్టమో. స్టోరీ కాన్సెప్ట్ లాంటివేమీ ఇంకా లీక్ కాలేదు కానీ.. సినిమాలో చాలాసేపు ఈ లేడీ గెటప్ లోనే ఉంటాడట హీరో. మొత్తానికి మరో మేడమ్ హీరోని చూసే అవకాశం చాలా ఏళ్లకు ఆడియన్స్ కి వస్తోంది. ఇప్పుడు హైప్ ప్రకారం డబ్బింగ్ చేస్తే తెలుగోళ్లకు కూడా ఈ ఛాన్స్ వచ్చినట్లే.

English summary
Sivakarthikeyan is playing a female nurse and we still can't believe our eyes
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu