twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పిల్లలు, పవన్ పై రేణు దేశాయ్ మనసులో మాట (ఫొటో ఫీచర్)

    By Srikanya
    |

    హైదరాబాద్ : "ఆద్య చూడ్డానికి అచ్చం వాళ్ల నాన్నలా ఉంటుంది. కానీ అలవాట్లూ, అభిరుచులూ నావే. ఇద్దరం ఇంటి భోజనాన్నే ఇష్టపడతాం. బాబు నా పోలికలతో ఉన్నా నడకా, ఇష్టాయిష్టాలూ... అంతా నాన్నే. వాళ్లిద్దరికీ స్పైసీగా ఉండే పదార్థాలంటే ఇష్టం. అకీరా వాళ్ల నాన్నలా ఏ పని చేసినా సీరియస్‌గా, సిన్సియారిటీతో చేస్తాడు" అంటూ మురిసిపోతూ ఓ తల్లిగా రేణు దేశాయ్ తన పిల్లల గురించి చెప్పుకొచ్చింది.

    పవన్‌కల్యాణ్‌ నుంచి విడిపోయాక పూణేలో నివాసం ఉంటున్న రేణుదేశాయ్‌ సొంత పరిశ్రమ మరాఠీలో సినిమాలకు దర్శకత్వం వహిస్తూ బిజీగా ఉన్నారు. తన దర్శకత్వంలోని రెండో సినిమా ఇష్క్‌ వాలా వ్‌ తెలుగులోనూ త్వరలో రిలీజవుతోంది.

    రేణు దేశాయ్...ఈ పేరు తెలుగు నాట ఇన్నాళ్ళూ పవన్ భార్యగా...ఓ నటిగానే తెలుసు. ఇప్పుడు ఓ దర్శకురాలిగా పరిచయం అవబోతోంది. తెలుగింటి కోడలిగా అడుగుపెట్టి... ఆ తరవాత తిరిగి పుట్టినింటికే చేరినా, అప్పుడూ ఇప్పుడూ తెలుగుదనానికి దూరం కాలేదంటోంది రేణుదేశాయ్‌. పవన్ వి, తనవి ఇద్దరూ ఆలోచనలు చాలా విషయాల్లో ఒకటే అని చెప్తోంది.

    మోడల్‌గా నటిగా, నిర్మాతగా, దర్శకురాలిగా విభిన్న పాత్రల్లో ఇమిడిపోయిన రేణు తల్లిగానూ తన పాత్రనూ సమర్థంగా నిర్వహిస్తోంది. కొడుకు అకీరా నందన్‌, కూతురు ఆద్య ముచ్చట్లను మనతో ఇలా పంచుకుంటోంది. వారి పోలికలు. వారి బుద్దలు గురించి తల్లిగా మురిసిపోతూ చెప్పుకొస్తోంది. తమకు ఆడంబరాలు అంటే గిట్టవని చెప్తోంది. అదే తమ పిల్లలకూ నేర్పుతున్నామంటోంది.

    పుట్టింది...పెరిగింది..

    పుట్టింది...పెరిగింది..

    నేను పుట్టి, పెరిగిందంతా పుణెలోనే. ఇప్పుడు గలగలా మాట్లాడుతున్నాను కానీ, చిన్నప్పుడు నేను చాలా నెమ్మది. చదువులో మాత్రం చురుకే.

    గుర్తింపు తెచ్చించి

    గుర్తింపు తెచ్చించి

    ఆసక్తి కొద్దీ మోడల్‌గా కెరీర్‌ ప్రారంభించా. శంకర్‌ మహదేవన్‌ బ్రీత్‌లెస్‌ మ్యూజిక్‌ వీడియోలో నటించడం నాకు చాలా గుర్తింపు తెచ్చిపెట్టింది

    తర్వాత సినిమాలు.

    తర్వాత సినిమాలు.

    ఆ తరవాత తెలుగులో 'బద్రి', 'జానీ'ల్లో నటించే అవకాశం వచ్చింది. తరవాత జరిగింది మీకు తెలిసిందే... తెలుగింటి కోడలిగా అందరికీ దగ్గరయ్యా.

    ఏ మార్పూ లేదు..

    ఏ మార్పూ లేదు..

    చాలా ఏళ్లుగా అక్కడే ఉన్నా... ఇప్పుడు పుణెలో ఉంటున్నా సినిమాలపై నాకున్న ఆసక్తిలో ఏ మార్పూ లేదు. పుణేకి చేరుకున్నాక నిర్మాతగా, దర్శకురాలిగా కొత్త బాధ్యతలూ తలకెత్తుకున్నా.

    ఆత్మ విశ్వాసంతో అడుగు వేసా..

    ఆత్మ విశ్వాసంతో అడుగు వేసా..

    నేను సినిమా నిర్మాణంలోకి అడుగుపెట్టడం గురించి తెలిసి చాలామంది 'ఎందుకీ అకస్మాత్తు నిర్ణయం' అని అడిగారు. కానీ ఇది నేనొక్క రోజులో తీసుకున్న నిర్ణయం కాదు. ఆత్మవిశ్వాసంతో వేసిన అడుగే.

    నేర్చుకుంటూనే ఉన్నా...

    నేర్చుకుంటూనే ఉన్నా...

    నేను సినిమాల్లోకి వచ్చినప్పట్నుంచీ ఇప్పటి వరకూ నిర్మాణం, దర్శకత్వం, కళ, దుస్తులూ, ఎడిటింగ్‌... ఇలా వివిధ రంగాలకు సంబంధించిన విషయాలను తెలుసుకుంటూనే ఉన్నా. ఆ పరిజ్ఞానమే నన్ను ధైర్యంగా సినిమా నిర్మాణం వైపు వెళ్లేలా చేసింది.

    నేనదే చేస్తున్నా...

    నేనదే చేస్తున్నా...

    'ఇద్దరు పిల్లల్ని చూసుకుంటూ దర్శకత్వం చేయడమంటే కష్టంతో కూడిన పని. ఎలా సాధ్యపడుతోంది... ఎలా సమర్థిస్తున్నావ్‌...' అని కొందరు అడుగుతుంటారు. ఏదయినా సాధించాలి అనుకున్నప్పుడు దారి అంతా పరిచిన పూలబాటలా ఉండదు కదా! సమస్యలు ఉంటాయి. సవాళ్లు ఎదురవుతాయి. వాటిని యథాతథంగా స్వీకరిస్తూ దాటుకుంటూ ముందుకెళ్లడమే. నేనదే చేస్తున్నాను.

    హిట్ కొడతా..

    హిట్ కొడతా..

    సమస్యల్ని పరిష్కరించుకుంటూ, ఇంటి పనులకూ బయటి బాధ్యతలకూ సమన్వయం సాధిస్తున్నాను. మన పనే మనల్ని నిలబెడుతుంది అని నమ్ముతాను. గత ఏడాది మరాఠీలో తీసిన 'మంగళాష్టక్‌' విజయం దాన్ని నిజం చేసింది. మరో వారంలో 'ఇష్క్‌వాలా లవ్‌' పేరుతో మీ ముందుకు రాబోతున్నా.

    అలసటే లేదు...

    అలసటే లేదు...

    వివిధ శాఖలను ఒకతాటిపైకి తెచ్చి సినిమా తీసినా, విజయంతో ప్రశంసలు అందుకున్నా... అవన్నీ ఒకెత్తు. తల్లిగా బిడ్డల్ని చూసుకోవడంలో ఉన్న సంతృప్తి మరొకెత్తు. పిల్లల ఇష్టాయిష్టాలను గమనిస్తుండాలి. ఆ పసి మనసులను నొప్పించకుండా చదువూ, పద్ధతులూ నేర్పించాలి. అకీరా, ఆద్యల విషయంలో నేను వీటిని వందశాతం అమలుచేస్తాను. ఆ ప్రయత్నంలో అలసటే కలగదు.

    మా పిల్లలు కూడా...

    మా పిల్లలు కూడా...

    నాకు మొదట్నుంచీ కొత్త విషయాలను తెలుసుకోవడమంటే ఆసక్తి. పవన్‌ సృజనాత్మక ఆలోచనలూ, అభిరుచులూ ఉన్న వ్యక్తి. మా పిల్లలిద్దరూ కూడా మా బాటలోనే నడుస్తున్నారు

    పెయింటింగ్‌

    పెయింటింగ్‌

    ముఖ్యంగా పెయింటింగ్‌ అంటే వారిద్దరికీ ఎంతో ఇష్టం. ఇంకా చిన్నవాళ్లే... అయినా ఎంతో చక్కగా బొమ్మలేస్తారు. నేనూ వారికి చిత్రకళలో మెలకువలు నేర్పడం కోసం ఎంత తీరిక లేకున్నా రోజూ గంట వారికి కేటాయిస్తా.

    పిల్లలు ఏం చదువుతున్నారు..

    పిల్లలు ఏం చదువుతున్నారు..

    ప్రస్తుతం బాబు ఐదో తరగతి చదువుతున్నాడు. పాప ఎల్‌కేజీ. నేను గర్భవతిగా ఉన్నప్పుడే నిర్ణయించుకున్నా... పాప పుడితే ఆద్య అని పేరుపెట్టాలని.

    కోపం వచ్చింది...

    కోపం వచ్చింది...

    నిజానికి పిల్లలన్నాక అల్లరి చేయక మానరు కదా! కానీ మా బుడుగులు చెప్పిన మాట చక్కగా వింటారు. కానీ అప్పుడప్పుడూ ఆటాడిస్తారు...! ఈ మధ్య ఓ రోజు వాళ్ల కజిన్‌లతో పాటూ వచ్చి 'మమ్మీ... మేం కాసేపు పెయింటింగ్‌ వేసుకుంటాం మమ్మీ...' అని ముద్దుముద్దుగా అడిగారు. ఎందుకు కాదంటాను... ముచ్చటపడుతూ అలాగే అన్నా. కాసేపాగి ఎందుకో వాళ్లున్న వైపు వెళితే... గోడల నిండా పెయింటింగ్‌లే! చాలా కోపం వచ్చింది.

    పాడయితే పాడయ్యాయిలే...

    పాడయితే పాడయ్యాయిలే...

    కానీ వారి ఆలోచన తెలుసుకోకుండా సరేనన్నది నేనే కదా... తగ్గిపోయా. ఆవేశం తగ్గాక గోడల వైపు చూస్తే చక్కటి రంగులూ, ఆకట్టుకునే బొమ్మలూ... కంటికింపుగా అనిపించాయి. గోడలు పాడయితే పాడయ్యాయిలే అనుకున్నా.

     ఒళ్లంతా వేసుకుంది.

    ఒళ్లంతా వేసుకుంది.

    ఇక మా ఆద్య అల్లరి సంగతి చెప్పాలి. ఓ రోజు తన రూమ్‌కెళ్లి చూసేసరికి పెయింట్‌ ప్లేట్‌ దగ్గర పెట్టుకుని ఒళ్లంతా రంగులు వేసుకుంటూ కనిపించింది. నాకైతే ఓ పట్టాన నవ్వాగలేదు. పని వాళ్లందరినీ పిలిచా. అందరూ వచ్చి నవ్వేసరికి... చిన్నది తెగ సిగ్గుపడిపోయి నా దగ్గరికొచ్చి ఒళ్లో తలదాచుకుంది. పిల్లలతో ఇటువంటి అందమైన అనుభూతులు ఎన్నని చెప్పాలి!

    నా కొడుకు..

    నా కొడుకు..

    మా అబ్బాయి త్వరలో విడుదలయ్యే 'ఇష్క్‌వాలా లవ్‌'లో మొదటిసారి తెరపై కనిపించనున్నాడు. తల్లిగా చెప్పడం కాదు... ఒక దర్శకురాలిగా చూసినా వాడు బాగా చేశాడు. ఏ విధంగా నటించాలీ, డైలాగ్‌ ఎలా చెప్పాలీ వంటివన్నీ ముందే అడిగి తెలుసుకున్నాడు.

    పేచీ పెట్టరు..

    పేచీ పెట్టరు..

    బాబూ, పాపా కూడా 'అది కావాలీ... ఇది కావాలీ' అని పేచీ పెట్టరు. పరిస్థితులకు అనుగుణంగా సర్దుకుపోతారు.

    పవన్ కు ఇష్టం ఉండదు..

    పవన్ కు ఇష్టం ఉండదు..

    పవన్‌కు, నాకూ ఫంక్షన్‌లు ఆడంబరంగా చేయడం ఇష్టం ఉండదు. దానికయ్యే మొత్తాన్ని పేదల కోసం ఖర్చు చేయాలనుకుంటాం. అలాని పిల్లల ముచ్చట తీర్చమని కాదు. ఆరోజు స్నేహితులూ, సన్నిహితుల సమక్షంలో కేక్‌ కట్‌ చేయించినా కొంత మొత్తాన్ని దగ్గర్లోని మురికివాడలూ, అనాథాశ్రమాల్లో అన్నదానం కోసం ఖర్చు చేస్తాం. ఎప్పట్నుంచో మేం అనుసరిస్తున్న పద్ధతి ఇది.

    తెలుగు బాగా వచ్చు..

    తెలుగు బాగా వచ్చు..

    తెలుగింటికి దూరంగా ఉన్నా పిల్లలిద్దరూ తెలుగులో చక్కగా మాట్లాడతారు. ముఖ్యంగా అకీరా స్పష్టమైన తెలుగులో మాట్లాడతాడు. అన్ని భాషల సినిమాలూ బాగానే చూసినా వాళ్ల నాన్న సినిమాలని మాత్రం పదే పదే చూస్తుంటారు.

    డెబ్బై సార్లు పైగా చూసింది..

    డెబ్బై సార్లు పైగా చూసింది..

    ముఖ్యంగా ఆద్య గబ్బర్‌సింగ్‌ని డెబ్భైసార్లకు పైగానే చూసిందంటే నమ్మండి. చివరకు డీవీడీ కూడా పోగొట్టింది.

    ఇష్టంగా తింటారు..

    ఇష్టంగా తింటారు..

    ఇద్దరూ ఇష్టంగా తినే ఆహారం అంటే అన్నం, పప్పూ, టొమాటో చారు. నిజానికి పుణేలో అంతా రోటీలు తినే అలవాటే ఉన్నప్పటికీ, నాకూ వాళ్లలానే ఇవంటేనే ఇష్టం.

    పొదుపు..

    పొదుపు..

    డబ్బు పొదుపు గురించి తెలిసే వయసు కాకపోయినా అకీరాతో పోల్చితే ఆద్య కొంచెం మెరుగు. నేను పర్స్‌ తీస్తే చాలు... దగ్గరికొచ్చి చిల్లర పైసలన్నీ పోగేస్తుంది. వాటిని డిబ్బీలో దాచుకుంటుంది. అలా ఇప్పటి వరకూ వంద రూపాయలు దాచుకుంది!

    అమ్మ ఇంటికి వచ్చినట్లే..

    అమ్మ ఇంటికి వచ్చినట్లే..

    రేణు దేశాయ్ మాట్లాడుతూ...చాలా ఏళ్ల తర్వాత తెలుగు సినీపరిశ్రమకి వస్తున్నా. చాలా సంతోషంగా ఉంది. రెండేళ్ల నుంచి మరాఠీలో సినిమాలకు దర్శకత్వం వహిస్తున్నా. మంగళాష్ఠక్‌ నా తొలి సినిమా. మరాఠీలో పెద్ద విజయం సాధించింది. ప్రస్తుతం రెండో సినిమా ఇష్క్‌ వాలా లవ్‌ కి దర్శకత్వం వహించాను. చిత్రీకరణ సహా తెలుగు అనువాదం కూడా పూర్తయింది. కానీ హుదూద్‌ ప్రభావంతో సినిమాలన్నీ వాయిదా పడ్డాయి.

    సినిమా గురించి...

    సినిమా గురించి...

    ఇష్క్‌ వాలా లవ్ ఓ చక్కని రొమాంటిక్‌ లవ్‌స్టోరి. యూనివర్శల్‌ కాన్సెప్టుతో తెరకెక్కింది. అమ్మాయి-అబ్బాయి కలుస్తారు. ప్రేమించుకుంటారు. గొడవపడి విడిపోతారు. సంఘర్షణ నడుస్తుంది. నవతరం అమ్మాయిలు ఎదుర్కొంటున్న ఓ ప్రధాన సమస్యని ఈ సినిమాలో చర్చించాం. పుట్టింట్లో ఎంతో గారాబంగా పెరిగిన ఓ అమ్మాయి అత్త ఇంటికి వెళ్లాక ఎన్నో చికాకుల్లో పడుతుంది. అది సబబేనా? అనేది టచ్‌ చేశాం. ప్రేమ పెళ్లి అంటే ఒకప్పుడు భయపడేవారు. ఇప్పుడు జనరేషన్‌ మారింది.

    చూపలేదు..

    చూపలేదు..

    నా నిజ జీవిత అనుభవాలేవీ తెరపై చూపించలేదు. నా బంధువులు, స్నేహితుల్ని ఇలా చూశాను. వారంతా పెళ్లిళ్లు ఆలస్యంగానే చేసుకుంటున్నారు. పెళ్లి తర్వాత పెద్ద పొజిషన్‌లో ఉన్న ఉద్యోగాల్నే వదులుకోవాల్సిన పరిస్థితి. అవన్నీ తెరపై చూపిస్తున్నాం. సమస్యని చూపిస్తున్నాం కదా! అని సీరియస్‌గా ఉండదు. ఫన్నీగా ఉండే చిత్రమిది. అదినాధ్‌-సులగ్న పాణిగ్రాహి జంట చక్కగా నటించారు. కుటుంబ సమేతంగా చూడదగ్గ ఆహ్లదకర చిత్రమిది. శ్రీ ఆద్య ఫిల్మ్‌స సమర్పణలో అకీరా ఫిలింస్‌ పతాకంపై తెరకెక్కించాం.

    రేణు మాట్లాడుతూ... ఏ బాధ్యతల్ని నిర్వర్తించినా వాటిని సమన్వయం చేసుకోవడంలోనే ఉంది కిటుకు. పనితో పాటూ పిల్లల బాధ్యతల్ని సమన్వయం చేసుకోవడం కష్టమే. కానీ వృత్తిగత, వ్యక్తిగత జీవితాల్ని పక్కాగా సమన్వయం చేసుకున్నప్పుడే అనుకున్న లక్ష్యాలను చేరుకోగలం అన్నది నా నమ్మకం. అందుకే పనిలో ఎంత బాధ్యతగా ఉంటానో, పిల్లలకు తగిన సమయం కేటాయించడంలోనూ అదే విధంగా వ్యవహరిస్తాను అందామె.

    అలాగే...జీవితం ఎవరికి వారు నిర్ఱయించుకున్నట్టు జరగకపోవచ్చు. కానీ ఎప్పటికప్పుడు వచ్చే మార్పులను స్వీకరిస్తూ, సరికొత్త లక్ష్యాలను నిర్ణయించుకుంటూ వెళ్లినప్పుడే ఆనందంగా ఉండగలం. అంతిమ లక్ష్యాన్ని చేరుకోగలం అని చెప్తున్నారామె.

    రేణు దేశాయ్ ఇంటర్వూ లాంటి ముచ్చట్లు..స్లైడ్ షోలో ...

    English summary
    Renu Desai said that she is very much happy her two children. Renu Desai said 'Of course. I saw Gabbar Singh 60 times for sake of my children as they feel like watching their father’s films! We watched the film so many times that the DVD got scratches as well. We watched Attarintiki Daaredhi at least 20 times!'
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X