పవన్ ఒకప్పుడు నా భర్త... నేను రాసిన బుక్‌లో ఆయన లేడు, తెలుగులో అందుకే: రేణు దేశాయ్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ 'ఎ లవ్, అన్ కండీషనల్' అనే పుస్తకం రాశారు. దీన్ని ఇంగ్లీషులో రాసిన ఆమె తెలుగులో ప్రముఖ పాటల రచయిత అనంత శ్రీరామ్ సహాయంతో అనువాదం చేసి విడుదల చేశారు. ఈ నేపథ్యంలో ఈ పుస్తకంపై అనేక సందేహాలు నెలకొన్నాయి.
తన మాజీ భర్త పవన్ కళ్యాణ్ మీద తనకు ఉన్న ప్రేమను ఫోకస్ చేస్తూ ఈ పుస్తకం రాశారని, ఇందులో పలు వివాదాస్పద అంశాలు సైతం జొప్పించారనే ప్రచారం మొదలైంది. ఈ నేపథ్యంలో రేణు దేశాయ్ ఈ వార్తలపై స్పందించారు.

పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశిస్తూ ఈ పుస్తకం రాయలేదు
తన ఎక్స్ హస్బెండ్ పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశిస్తూ పుస్తకం రాయలేదని, ఇందులో ఆయన కానీ, ఆయనకు సంబంధించిన భావనలు కానీ లేవని రేణు దేశాయ్ స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి వివాదాస్పద అంశాలకు చోటు లేదని తెలిపారు.

ఆయన ఒకప్పుడు నా భర్త
పవన్ కళ్యాణ్ ఒకప్పుడు నా భర్త. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఆయన కాకుండా నా జీవితంలో వేరే వ్యక్తి ఉన్నా రొమాన్స్, హ్యాపీనెస్, పెయిన్ అనే ఫీలింగ్స్ ఉంటాయి. ప్రతి మనిషిలోనూ ఇలాంటివి సహజమే అని రేణు దేశాయ్ తెలిపారు.

అందుకే పుస్తకం రాశాను
ఈ పుస్తకం రాయడానికి కారణం నాలోని రైటింగ్స్ స్కిల్స్ నిరూపించుకోవడానికే. నేను ఒక రచయితను... ఏ రచయిత అయినా తన మనసులోని భావాలను పుస్తకం రూపంలో తేవాలనుకుంటారు. నేను కూడా అలాగే చేశాను అని తెలిపారు.

తెలుగులో అనువాదం అందుకే
నాకు తెలుగు ప్రేక్షకులు, ప్రజలతో అనుబంధం ఉంది. ఎంతో మంది అభిమానులు ఉన్నారు. నేను ఇంగ్లీషులో రాసిన పుస్తకం వారికి కూడా చేరువ కావాలనే తెలుగులో అనువాదం చేసిన విడుదల చేసినట్లు రేణు దేశాయ్ తెలిపారు.


Click it and Unblock the Notifications











