»   » ఆ విషయం ఆయన్నే అడగండి: రేణు దేశాయ్ ఆసక్తికర సమాధానాలు!

ఆ విషయం ఆయన్నే అడగండి: రేణు దేశాయ్ ఆసక్తికర సమాధానాలు!

By Bojja Kumar
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  పవన్ కళ్యాణ్ మాజీ భార్య, నటి రేణు దేశాయ్ మరో వివాహం చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. మరో వ్యక్తితో ఆమె ఎంగేజ్మెంట్ వేడక ఇటీవలే జరిగింది. అయితే అతడు ఎవరు? ఏం చేస్తారు? అనే విషయాలు మాత్రం బయటకు రాలేదు. తన వివాహంపై పవన్ కళ్యాణ్ అభిమానులు తీవ్రంగా రియాక్ట్ అవుతుండటంతో తనకు కాబోయే భర్త పేరు చెప్పడానికి రేణు ఇష్టపడటం లేదు. అదే సమయంలో తాను మరో వివాహం చేసుకోవద్దంటున్న వారికి రేణు దేశాయ్ తగిన సమాధానాలు ఇస్తున్నారు.

  Pawan Kalyan Tweets About Renu Desai Second Marriage
   ఆ విషయం ఆయన్నే అడగండి

  ఆ విషయం ఆయన్నే అడగండి

  మీ పెళ్లికి పవన్ కళ్యాణ్ వస్తారా? అన్న ప్రశ్నకు రేణు దేశాయ్ తనదైన రీతిలో స్పందించారు. ఆ విషయం ఆయన్నే అడగాలని, ఆయన కూడా సోషల్ మీడియాలో ఉన్నారు కదా అంటూ రేణు దేశాయ్ రిప్లై ఇచ్చారు.

  మీ లాంటి వారికి భారత రత్న ఇవ్వాలి

  మీ లాంటి వారికి భారత రత్న ఇవ్వాలి

  మరో పెళ్లి చేసుకోబోతున్న నేపథ్యంలో రేణు దేశాయ్‌ను కొందరు అసంబద్ధమైన సమాధానాలతో విసిగిస్తున్నారు. పవన్ కళ్యాణ్ మళ్లీ కలిసుందామంటే తిరిగి వస్తారా? అనే ప్రశ్నకు ఆమె రియాక్ట్ అవుతూ ‘మీకు నిజంగా భారతరత్న ఇవ్వాలి' అంటూ సమాధానం ఇచ్చినట్లు సమాచారం.

  నా పిల్లల గురించి మీకెందుకు? మీ పిల్లల సంగతి చూసుకోండి

  నా పిల్లల గురించి మీకెందుకు? మీ పిల్లల సంగతి చూసుకోండి

  నా పిల్లల గురించి మీరు బాధపడొద్దు. వాళ్లకు తల్లి, తండ్రి.. పెదనాన్న, నానమ్మ, పిన్ని, పెద్దమ్మ... చాలామంది ఉన్నారు. మీరు, అసలు టెన్షన్ పడొద్దు. మీరు, మీ పిల్లలను సంతోషంగా చూసుకుంటే చాలు... అంటూ ఓ ప్రశ్నకు రేణు దేశాయ్ సమాధానం ఇచ్చారు.

  అకీరాకు యాక్టింగ్ ఇష్టం లేదట

  అకీరాకు యాక్టింగ్ ఇష్టం లేదట

  పవన్ కళ్యాణ్ అభిమానులు అకీరాను జూనియర్ పవర్ స్టార్ అని పిలుస్తుండటంపై రేణు దేశాయ్ గతంలో అభ్యంతరం వ్యక్తం చేస్తూ అలా పిలిచిన వారిని బ్లాక్ చేస్తానంటూ వార్నింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అకీరా గురించి ఎదురైన మరో ప్రశ్నకు రేణు దేశాయ్ స్పందిస్తూ... ‘అకీరాకు యాక్టింగ్ ఇష్టం లేదు. అతడు సినిమాల్లోకి రావడం లేదు' అని సమాధానం ఇచ్చారు.

   పర్సనల్ విషయాల్లో కలుగజేసుకోవద్దు

  పర్సనల్ విషయాల్లో కలుగజేసుకోవద్దు

  తాను మరో పెళ్లి చేసుకోవడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్న వారికి రేణు దేశాయ్ దీటైన సమాధానాలు ఇస్తున్నారు. తన వ్యక్తి గత జీవితంలో కలుగు చేసుకోవడానికి మీరెవరంటూ కౌంటర్ ఎటాక్ చేస్తున్నారు. సెలబ్రిటీలు కూడా మనుషులే అని, వారికి వ్యక్తిగత జీవితం ఉంటుందని, వారికి నచ్చినట్లు జీవించడం వారి హక్కు అని రేణు దేశాయ్ చెబుతోంది.

   రేణూ... పెళ్లిపై పవన్ కళ్యాణ్ సంతోషం

  రేణూ... పెళ్లిపై పవన్ కళ్యాణ్ సంతోషం

  కాగా... రేణు దేశాయ్ మరో పెళ్లి చేసుకోవడంపై పవన్ కళ్యాణ్ సంతోషంగా ఉన్నారు. ఇటీవల నిశ్చితార్థం జరుపుకున్న ఆమెకు పవన్ కళ్యాణ్ ట్విట్టర్ ద్వారా విషెస్ తెలిపారు. రేణు దేశాయ్‌తో విడిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ మరో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.

  English summary
  Renu Desai hard reply to Pawan Kalyan fans regarding her second marriage. Renu, who was previously married to actor and politician Pawan Kalyan, had recently posted a picture of her engagement on all the social media platforms including Facebook, Twitter and Instagram. While several users had congratulated her, a few were dejected with her decision to marry once again, after her divorce with actor Pawan Kalyan.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more