twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రేణు దేశాయ్ మరో ఆసక్తికరమైన ట్వీట్

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ ట్విట్టర్లో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటూ ఆలోచనాత్మకమైన ట్వీట్స్ చేస్తుంటారు. అనవసర విషయాల జోలికి పోకుండా సామాజిక అంశాలు, సోషల్ రెస్పాన్సిబులిటీ, పాలిటిక్స్ లాంటి అంశాలపై ఆమె ఆసక్తికరంగా కామెంట్స్ చేస్తుంటారు.

    తాజాగా రేణు దేశాయ్ మరో ఆసక్తికరమైన ట్వీట్ చేసారు. స్కూల్ లో పిల్లలకు బయోలజీ, జామెట్రీ లాంటి వాటికంటే ముఖ్యంగా దయ, కరుణ, సాహసం లాంటివి నేర్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందంటూ ఆమె ట్వీట్ చేసారు.

    Renu Desai interesting tweet about Kids

    ఈ ట్వీట్ ద్వారా ఈ కాలం పిల్లల్లో ఉండాల్సిన మంచి లక్షణాలు ఉండటం లేదని, సాహస వంతులుగా ఎదగడం లేదని స్పష్టం చేసారు. స్కూల్ లెవల్ నుండి ఇలాంటివి నేర్పిస్తే రేపటి తరం పిల్లలు ఆదర్శవంతంగా తయారవుతారని అంటోంది రేణు దేశాయ్. రేణు చెప్పింది కూడా పాయింటే...

    ఇటీవల గణేష్ ఉత్సవాల సందర్భంగా కూడా రేణు దేశాయ్ ఆసక్తికరమైన ట్వీట్ చేసారు. వినాయక నిమజ్జనం సందర్భంగా రాత్రి రోడ్డు మీద లౌడ్ స్పీకర్లలో ఐటమ్ సాంగ్స్ తో జరిగిన హంగామా గురించి రేణు దేశాయ్ ఈ ట్వీట్ చేశారు. పెద్ద సౌండ్ తో పెట్టిన ఐటెం పాటల కారణంగా తన తనయ ఆద్య నిద్రపోలేక పోయిందంటూ ట్విట్టర్ లో పేర్కొన్నారు.

    మోడల్‌గా నటిగా, నిర్మాతగా, దర్శకురాలిగా విభిన్న పాత్రల్లో ఇమిడిపోయిన రేణు తల్లిగానూ తన పాత్రనూ సమర్థంగా నిర్వహిస్తోంది. కొడుకు అకీరా నందన్‌, కూతురు ఆద్య ముచ్చట్లను మనతో ఇలా పంచుకుంటోంది. వారి పోలికలు. వారి బుద్దలు గురించి తల్లిగా మురిసిపోతూ చెప్పుకొస్తోంది. తమకు ఆడంబరాలు అంటే గిట్టవని చెప్తోంది. అదే తమ పిల్లలకూ నేర్పుతున్నామంటోంది.

    English summary
    "Kindness,compassion, tolerance should be taught to young kids as subjects in school rather than biology,geometry,etc...(these we can Google)" Renu desai tweeted.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X